శ్రీలంక విజయలక్ష్యం 405
దునేదిన్: రెండు టెస్టుల సిరీస్ లో భాగంగా ఇక్కడ శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ 405 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. 171/1 ఓవర్ నైట్ స్కోరుతో ఆదివారం నాల్గో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన న్యూజిలాండ్ 267/3 వద్ద డిక్లేర్ చేసి భారీ లక్ష్యాన్ని శ్రీలంక ముందుంచింది. న్యూజిలాండ్ ఆటగాళ్లలో టామ్ లాథమ్(109నాటౌట్) విలియమ్సన్(71) రాణించి న్యూజిలాండ్ భారీ స్కోరుకు సహకరించారు. వీరిద్దరూ రెండో వికెట్ కు 141 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
అనంతరం భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన శ్రీలంక 50.1 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 109 పరుగులు చేసింది. కరుణరత్నే(29), కుశాల్ మెండిస్(46)ల, జయసుందర్(3) లు పెవిలియన్ కు చేరగా, చండీమాల్(31 బ్యాటింగ్) క్రీజ్ లో ఉన్నాడు. ఇంకా శ్రీలంక విజయానికి 296 పరుగులు చేయాల్సి ఉండగా, ఏడు వికెట్లు చేతిలో ఉన్నాయి.