తొలి టెస్టు న్యూజిలాండ్‌దే | Brendon McCullum hailed as 'best batsman in the world' | Sakshi
Sakshi News home page

తొలి టెస్టు న్యూజిలాండ్‌దే

Published Tue, Dec 30 2014 1:34 AM | Last Updated on Sat, Sep 2 2017 6:55 PM

తొలి టెస్టు న్యూజిలాండ్‌దే

తొలి టెస్టు న్యూజిలాండ్‌దే

శ్రీలంకపై 8 వికెట్ల తేడాతో
గెలుపుక్రైస్ట్‌చర్చ్: ఈ ఏడాదిని తమ టెస్టు చరిత్రలోనే అత్యంత విజయవంతంగా న్యూజిలాండ్ జట్టు ముగించింది. శ్రీలంకతో జరిగిన తొలి టెస్టును ఎనిమిది వికెట్ల తేడాతో గెల్చుకుని 2014లో ఐదో విజయాన్ని సాధించింది. ఓ క్యాలెండర్ ఏడాదిలో ఐదు టెస్టులు గెలవడం కివీస్‌కిదే తొలిసారి. చివరి రోజు సోమవారం లంక విధించిన 105 పరుగుల లక్ష్యాన్ని కివీస్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 30.4 ఓవర్లలో 2 వికెట్లకు 107 పరుగులు చేసి నెగ్గింది. దీంతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యం పొందింది.

కేన్ విలియమ్సన్ (75 బంతుల్లో 31 నాటౌట్), రాస్ టేలర్ (63 బంతుల్లో 39; 6 ఫోర్లు) రాణించారు. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’గా మెకల్లమ్ నిలిచాడు. శనివారం నుంచి ఇరు జట్ల మధ్య వెల్లింగ్టన్‌లో చివరిదైన రెండో టెస్టు జరుగుతుంది. అంతకుముందు 293/5 ఓవర్‌నైట్ స్కోరుతో తమ ఫాలోఆన్ ఆటను ప్రారంభించిన లంక 154 ఓవర్లలో 407 పరుగులకు ఆలౌట్ అయ్యింది. మాథ్యూస్ (127 బంతుల్లో 66; 7 ఫోర్లు; 1 సిక్స్), ఎరంగ (62 బంతుల్లో 45 నాటౌట్; 7 ఫోర్లు) ఆకట్టుకున్నారు. బౌల్ట్, సౌతీలకు నాలుగేసి వికెట్లు దక్కాయి.
 
సంక్షిప్త స్కోర్లు
న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: 441 ఆలౌట్; శ్రీలంక తొలి ఇన్నింగ్స్: 138 ఆలౌట్; శ్రీలంక రెండో ఇన్నింగ్స్: 407 ఆలౌట్ (154 ఓవర్లలో) (కరుణరత్నే 152, మాథ్యూస్ 66, ఎరంగ 45 నాటౌట్, బౌల్ట్ 4/100, సౌతీ 4/91); న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్: 107/2 (30.4 ఓవర్లలో) (విలియమ్సన్ 31 నాటౌట్, రాస్ టేలర్ 39 నాటౌట్).

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement