New Zealand team
-
ఫైనల్‌కు న్యూజిలాండ్
దుబాయ్: ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో రెండేళ్ల విరామం తర్వాత న్యూజిలాండ్ జట్టు మరో ‘ఫైనల్’ మ్యాచ్ ఆడనుంది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తొలిసారి నిర్వహిస్తున్న ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు కివీస్ అర్హత సాధించింది. కరోనా నేపథ్యంలో పలు టెస్టు సిరీస్‌లు రద్దు కావడంతో ఆయా జట్లు సాధించిన మొత్తం పాయింట్ల ఆధారంగా కాకుండా... ఆడిన టెస్టుల సంఖ్యను పరిగణనలోకి తీసుకుంటూ దాని ద్వారా వచ్చిన పాయింట్ల శాతం ఆధారంగా ఐసీసీ ఫైనల్ బెర్త్‌లను ఖరారు చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఐసీసీ డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో న్యూజిలాండ్ పాయింట్ల శాతం 70 కాగా... ఆస్ట్రేలియా జట్టు దక్షిణాఫ్రికా పర్యటనను రద్దు చేసుకోవడం కివీస్ జట్టుకు కలిసొచ్చింది. ఫలితంగా అందరికంటే ముందుగా ఫైనల్‌కు న్యూజిలాండ్ అర్హత పొందింది. ఇతర జట్లలో ఒకరికి మాత్రమే కివీస్ పాయింట్ల శాతాన్ని దాటే అవకాశం ఉంది కాబట్టి విలియమ్సన్ సేన ఫైనల్ చేరడం ఖాయమైంది. ఫైనల్లో న్యూజిలాండ్‌తో ఎవరు తలపడతారనేది భారత్–ఇంగ్లండ్ సిరీస్ ముగిసిన తర్వాత అధికారికంగా ఖరారవుతుంది. అంకెలపరంగా చూస్తే పేరుకు ఇంగ్లండ్, ఆస్ట్రేలియా కూడా పోటీలో ఉన్నా... ప్రస్తుత ఫామ్, వాస్తవికంగా చూస్తే ఫైనల్‌కు భారత్ అర్హత సాధించడం దాదాపు ఖాయమే. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో భారత్ కనీసం 2–1తో గెలిచినా సరిపోతుంది. వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ జూన్ 18 నుంచి 22 వరకు జరుగుతుంది. జూన్ 23ను రిజర్వే డేగా కేటాయించారు. 2019 జులై 14న లార్డ్స్ మైదానంలోనే జరిగిన వన్డే వరల్డ్‌కప్ ఫైనల్లో న్యూజిలాండ్ ‘బౌండరీ కౌంట్’ ద్వారా ఇంగ్లండ్ చేతిలో ఓడింది. మరో బెర్త్ కోసం మూడు జట్లు... భారత్: ప్రస్తుతం 71.7 పాయింట్ల శాతంతో అగ్రస్థానంలో ఉంది. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లను వెనక్కి నెట్టి భారత్ ఫైనల్ చేరాలంటే నాలుగు టెస్టుల ద్వారా మరో 70 పాయింట్లు రావాలి. అంటే కోహ్లి బృందం కనీసం 2–1 తేడాతో ఇంగ్లండ్‌పై సిరీస్ గెలిస్తే చాలు. 3–0 లేదా 3–1 లేదా 4–0తో గెలిస్తే మరీ మంచిది. ఇంగ్లండ్: ప్రస్తుతం 68.7 పాయింట్ల శాతంతో నాలుగో స్థానంలో ఉంది. భారత్, ఆ్రస్టేలియా శాతాన్ని ఇంగ్లండ్ దాటాలంటే ఆ జట్టుకు మరో 87 పాయింట్లు కావాలి. అంటే కనీసం ఆ జట్టు భారత్‌పై 3 టెస్టులు గెలవాలి. అంటే 3–0 లేదా 4–0 లేదా 3–1తో టీమిండియాను ఓడించాలి. ఎలా చూసినా ఇది అసాధ్యమే! ఆస్ట్రేలియా: ప్రస్తుతం 69.2 పాయింట్ల శాతంతో మూడో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా ఇంకా బరి నుంచి పూర్తిగా తప్పుకోలేదు. జూన్‌లోపు ఎలాంటి టెస్టులు లేకపోవడంతో ఆస్ట్రేలియా శాతంలో ఎలాంటి మార్పు ఉండబోదు. ఆసీస్ ముందుకెళ్లాలంటే మాత్రం భారత్ 1–0తో ఇంగ్లండ్‌పై గెలవాలి. లేదంటే ఇంగ్లండ్ 1–0 లేదా 2–0 లేదా 2–1తో సిరీస్ నెగ్గాలి. లేదంటే భారత్–ఇంగ్లండ్ సిరీస్ ‘డ్రా’ గా ముగియాలి (తేడాతో సంబంధం లేకుండా). అప్పుడే ఆ్రస్టేలియాకంటే భారత్, ఇంగ్లండ్ శాతం తక్కువ అవుతుంది. ఆసీస్ ఫైనల్‌కు చేరుతుంది. దక్షిణాఫ్రికాకు వెళ్లలేం... మెల్బోర్న్: వచ్చే నెలలో దక్షిణాఫ్రికా గడ్డపై మూడు టెస్టుల సిరీస్‌లో తలపడాల్సిన ఆ్రస్టేలియా జట్టు ఆ పర్యటనను నిరవధికంగా వాయిదా వేసుకుంది. సమీప భవిష్యత్తులో ఎలాంటి తేదీలు కూడా ప్రకటించకపోవడంతో ఈ టెస్టు సిరీస్ దాదాపుగా రద్దయినట్లే. దక్షిణాఫ్రికాలో ప్రస్తుతం కరోనా తీవ్రత ఎక్కువగా ఉండటమే దీనికి కారణం. ఈ టూర్ కోసం ఇప్పటికే జట్టును కూడా ప్రకటించిన కంగారూ టీమ్ అనూహ్యంగా ఈ నిర్ణయం తీసుకుంది. అదే కారణమా... అయితే ఆసీస్ జట్టు దక్షిణాఫ్రికా పర్యటన రద్దు విషయంలో కరోనాకంటే కూడా ఇతర విషయాలు కారణమని వినిపిస్తోంది. భారత్ చేతిలో ఎదురైన ఓటమి నుంచి ఆ జట్టు కోలుకోలేదు. పైగా ఆటగాళ్లకు, కోచ్ లాంగర్‌కు మధ్య విభేదాలు వచ్చాయి. ప్రస్తుత స్థితిలో రబడ, నోర్జే, ఇన్గిడిలాంటి బౌలర్లను ఎదుర్కొని అక్కడ గెలవడం సులువు కాదు. మరొక్క సిరీస్ ఓడినా టీమ్ మేనేజ్మెంట్లో సమూల మార్పులు ఖాయమనే భావన అందరిలో ఉండటమే వెళ్లకపోవడమే మంచిదనే నిర్ణయానికి వచి్చనట్లు సమాచారం. కరోనా కాలంలోనూ ఇటీవల దక్షిణాఫ్రికా జట్టు శ్రీలంకకు ఆతిథ్య మిచ్చింది. ఇరు జట్ల మధ్య బయో బబుల్‌లో రెండు టెస్టులు జరిగాయి. అవే ఏర్పాట్లు ఇప్పుడు చేయడం కూడా కష్టం కాదు. మరో వైపు ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో పాకిస్తాన్ మహిళల క్రికెట్ జట్టు పర్యటన కూడా సాఫీగా కొనసాగుతోంది. పాపం ఆసీస్! ఆ్రస్టేలియా వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ చేరే అవకాశాలకు భారత్‌తో సిరీస్ సందర్భంగా దెబ్బ పడింది. మెల్బోర్న్లో జరిగిన బాక్సింగ్ డే టెస్టులో స్లో ఓవర్ రేట్ కారణంగా ఆ జట్టుకు జరిమానాతో పాటు ఐసీసీ నాలుగు పాయింట్ల కోత కూడా విధించింది. అది జరగకపోయి ఉంటే ఆ్రస్టేలియా కూడా న్యూజిలాండ్‌తో సమంగా 70 పాయింట్ల శాతంతో ఉండేది. అప్పుడు ఒక్కో వికెట్‌కు చేసిన పరుగులు, ఇచ్చిన పరుగుల నిష్పత్తిని పరిగణనలోకి తీసుకోవాల్సి వచ్చేది. ఈ అంశంలో కివీస్ (1.28) కంటే మెరుగ్గా ఉన్న ఆసీస్ (1.39)కు మంచి అవకాశం ఉండేది. -
చివర్లో చేతులెత్తేశారు
క్రైస్ట్‌చర్చ్: విజయం కోసం 11 బంతుల్లో 14 పరుగులు చేయాల్సిన సమయంలో భారత బ్యాట్స్ మెన్ చేతులెత్తేశారు. 9 బంతుల్లో చివరి 4 వికెట్లను కోల్పోయి మ్యాచ్‌ను ప్రత్యర్థికి అప్పగించేశారు. న్యూజిలాండ్ ‘ఎ’తో ఆదివారం ఇక్కడ జరిగిన అనధికారిక మూడో వన్డేలో భారత్ ‘ఎ’ 5 పరుగుల తేడాతో ఓడింది. ఛేదనలో ఇషాన్ కిషన్ (84 బంతుల్లో 71 నాటౌట్; 8 ఫోర్లు) పోరాటం వృథా అయింది. ఫలితంగా కివీస్ 2–1తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 270 పరుగులు చేసింది. మార్క్ చాప్‌మ్యాన్ (110 నాటౌట్; 10 ఫోర్లు, సిక్స్), టాడ్ ఆస్టల్ (56; 2 ఫోర్లు, సిక్స్) రాణించారు. ఇషాన్ పోరెల్ మూడు వికెట్లు తీయగా... రాహుల్ చహర్ రెండు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. అనంతరం ఛేదనలో భారత్ 49.4 ఓవర్లలో 265 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్లు పృథ్వీ షా (55; 8 ఫోర్లు, సిక్స్), రుతురాజ్ గైక్వాడ్ (44; 6 ఫోర్లు) రాణించారు. జామీసన్ 4, ఎజాజ్ పటేల్ 3 వికెట్లతో కివీస్ విజయంలో కీలక పాత్ర పోషించారు. -
ఒళ్లు దగ్గర పెట్టుకుని ఆడకుండా.. ఇదేంది?!
చెస్టర్ లీ స్ట్రీట్: వన్డే వరల్డ్‌కప్‌లో న్యూజిలాండ్‌పై 119 పరుగుల తేడాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ఇంగ్లండ్ సెమీస్ చేరింది. 27 ఏళ్ల అనంతరం ఇంగ్లండ్ వరల్డ్‌కప్ సెమీస్ చేరడం విశేషం. ఇక ఈ ఫలితంతో పాకిస్తాన్ సెమీస్ చేరడం కష్టసాధ్యమైన పని. ఒకవేళ నిన్నటి మ్యాచ్‌లో ఇంగ్లండ్గనుక ఓడిపోయుంటే... 9 పాయింట్లతో ఐదో స్థానంలో ఉన్న పాకిస్తాన్ శుక్రవారం బంగ్లాదేశ్‌తో జరిగే మ్యాచ్‌లో విజయం సాధిస్తే నేరుగా సెమీస్‌కు వెళ్లేది. 10 పాయింట్లతో ఇంగ్లండ్ ఐదో స్థానానికి పరిమితమయ్యేది. అందుకనే బుధవారం న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఓడిపోవాలని యావత్ పాకిస్తాన్ కోరుకుంది. అయితే, అద్భుత ఫామ్‌లో ఉన్న ఇంగ్లండ్ అటు బ్యాట్‌తోనూ.. ఇటు బంతితోనూ రాణించి ఘన విజయం సాధించింది. తాజా సమీకరణం ప్రకారం బంగ్లాతో జరిగే మ్యాచ్‌లో పాక్ 316 పరుగుల భారీ తేడాతో విజయం సాధించాలి. కానీ, వన్డే చరిత్రలో ఇప్పటివరకు ఇంత భారీ తేడాతో ఏ జట్టూ గెలిచిన దాఖలాలు లేవు. ఒకవేళ బంగ్లాదేశ్ తొలుత బ్యాటింగ్ చేస్తే మాత్రం ఎలాంటి సమీకరణాలతో పని లేకుండా పాకిస్తాన్ టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. ఇక జట్టు పేలవ ప్రదర్శనపై సగటు పాక్ క్రికెట్ అభిమాని దుమ్మెత్తి పోస్తున్నాడు. ముందునుంచీ ఒళ్లు దగ్గర పెట్టుకుని ఆడకుండా.. ఇతర జట్ల జయాపజయాలపై ఆధారపడటం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. పాక్ మాజీ ఆటగాళ్లు ‘అల్లాకి దువా’ చేస్తున్న ఫొటో షేర్ చేసి.. మా ఆటగాళ్లు దేవునిదే భారం అనే ధోరణిలో ఉన్నారని.. కష్టపడి ఆడడం రాదని చురకలంటిస్తున్నారు. ఇక 1992 ప్రపంచకప్ ఫలితాన్ని పాక్ రిపీట్ చేస్తుందని.. ట్రోఫీని ఎగరేసుకుపోతుందని ఎన్నో అంచనాలు తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. Our only realistic chance at the moment 😓#NzvEng #ENGvNZ pic.twitter.com/6jvGbpAKep — Saqib Ali Shah (@Saqibca) July 3, 2019 It was a journey full of surprises, fun and betrayals. See you after 4 years. Sincerely, Pakistan.#ENGvNZ pic.twitter.com/Uzn7T8MH82 — abaid (@KhawajaAbaid) July 3, 2019 -
నేటి నుంచి కివీస్ వార్మప్ మ్యాచ్
న్యూఢిల్లీ: భారత్‌తో జరిగే మూడు టెస్టుల సిరీస్‌కు ముందు సన్నాహకంగా న్యూజిలాండ్ జట్టు శుక్రవారం నుంచి... ఫిరోజ్ షా కోట్ల మైదానంలో ముంబై జట్టుతో మూడు రోజుల మ్యాచ్ ఆడనుంది. -
గప్టిల్ గర్జన
ఈ ఏడాదే వన్డే ప్రపంచకప్‌లో ‘డబుల్ సెంచరీ’ చేసిన జ్ఞాపకం ఇంకా చెదిరిపోకముందే... న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్టిల్ మరో సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో కేవలం 30 బంతుల్లోనే అజేయంగా 93 పరుగులు చేశాడు. 9 ఫోర్లు, 8 సిక్సర్లతో గప్టిల్ గర్జించడంతో న్యూజిలాండ్ జట్టు 118 పరుగుల లక్ష్యాన్ని కేవలం 8.2 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా ఛేదించింది. 30 బంతుల్లో 93H (9x4; 8x6) * 8.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించిన న్యూజిలాండ్ * రెండో వన్డేలోనూ శ్రీలంక చిత్తు క్రైస్ట్‌చర్చ్: ఇన్నాళ్లూ ఎన్ని మంచి ఇన్నింగ్స్‌లు ఆడినా మెకల్లమ్ చాటుగా మిగిలిపోయిన మార్టిన్ గప్టిల్ మరోసారి సంచలన ఇన్నింగ్స్‌తో హోరెత్తించాడు. అనేక రికార్డులను త్రుటిలో కోల్పోయినా... చిరకాలం అభిమానుల మదిలో నిలిచిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. ఫలితంగా శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో న్యూజిలాండ్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. హేగ్లీ ఓవల్ మైదానంలో సోమవారం జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక 27.4 ఓవర్లలో 117 పరుగులకే ఆలౌటయింది. కులశేఖర (19) టాప్ స్కోరర్. కివీస్ బౌలర్ మాట్ హెన్రీ (4/33) వరుసగా రెండో మ్యాచ్‌లోనూ నాలుగు వికెట్లు తీయగా... మెక్లీనగన్ మూడు వికెట్లు పడగొట్టాడు. బ్రేస్‌వెల్, సోధి ఒక్కో వికెట్ తీసుకున్నారు. న్యూజిలాండ్ జట్టు 8.2 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 118 పరుగులు చేసింది. గప్టిల్ (30 బంతుల్లో 93 నాటౌట్; 9 ఫోర్లు, 8 సిక్సర్లు), లాథమ్ (20 బం తుల్లో 17 నాటౌట్; 2 ఫోర్లు) జోరుతో లంచ్ విరామం కంటే ముందే మ్యాచ్ ముగిసిపోయింది. ఆడిన తొలి బంతికే చమీరా బౌలిం గ్లో గప్టిల్ ఇచ్చిన క్యాచ్‌ను సిరివర్ధనే వదిలేయడంతో లంక భారీ మూల్యం చెల్లించుకుంది. ఆ తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగిన గప్టిల్ కేవలం 12 బంతుల్లోనే 46 పరుగులకు చేరాడు. డివిలియర్స్ పేరిట ఉన్న ఫాస్టెస్ట్-50 రికార్డు (16 బంతులు)ను గప్టిల్ అధిగమించేలా కనిపించినా... కులశేఖర యార్కర్ల కారణంగా నెమ్మదించాడు. చివరకు 17 బంతుల్లో అర్ధసెంచరీ చేసి... న్యూజిలాండ్ తరఫున వేగంగా అర్ధసెంచరీ చేసిన మెకల్లమ్ రికార్డు (18 బంతులు)ను అధిగమించాడు. ఆ తర్వాత గప్టిల్ మరింత వేగం పెంచి మ్యాచ్‌ను తొందరగా ముగిం చాడు. ఐదు వన్డేల సిరీస్‌లో ప్రస్తుతం న్యూజిలాండ్ 2-0 ఆధిక్యంలో ఉంది. మూడో వన్డే గురువారం జరుగుతుంది. 310 ఈ మ్యాచ్‌లో గప్టిల్ స్ట్రయిక్ రేట్ 310. క్రికెట్ చరిత్రలో ఇంతకంటే వేగంగా పరుగులు చేసిన క్రికెటర్ డివిలియర్స్ (స్ట్రయిక్ రేట్ 339) మాత్రమే. 17 వన్డేల్లో వేగంగా 50 పరుగులు చేసిన జాబితాలో గప్టిల్ రెండో స్థానానికి చేరాడు. ఈ రికార్డు డివిలియర్స్ (16 బంతులు) పేరిట ఉంది. 7 మరో 250 బంతులు మిగిలుండగానే న్యూజిలాండ్ ఈ మ్యాచ్ గెలిచింది. బంతుల పరంగా క్రికెట్ చరిత్రలో ఇది ఏడో అతి పెద్ద విజయం. 250 లేదా అంతకంటే ఎక్కువ బంతులు మిగిలుండగానే గెలవడం న్యూజిలాండ్‌కు ఇది మూడో సారి. 39 న్యూజిలాండ్ జట్టు ఈ మ్యాచ్‌లో 39 బంతుల్లోనే 100 పరుగులు చేసింది. 16 బంతుల్లోనే 50 పరుగులు చేసింది. 2002 తర్వాత ఇంత వేగంగా ఓ జట్టు పరుగులు చేయడం ఇదే. 14.16 ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ రన్‌రేట్. ఇది చరిత్రలో రెండో అత్యధిక రన్‌రేట్. ఇందులో రికార్డు కూడా న్యూజిలాండ్ పేరిటే ఉంది. 2007లో బంగ్లాదేశ్‌పై న్యూజిలాండ్ 15.83 రన్‌రేట్‌తో పరుగులు చేసింది. -
భారత్‌కు ఊరట విజయం
బెంగళూరు : ఇప్పటికే మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను చేజార్చుకున్న భారత మహిళల జట్టు... న్యూజిలాండ్‌తో జరిగిన ఆఖరి మ్యా చ్లో 3 వికెట్ల తేడాతో గెలిచి కాస్త ఊరట చెందింది. బుధవారం చిన్నస్వామి స్టేడియం లో జరిగిన ఈ మ్యాచ్‌లో... ముందుగా న్యూజిలాండ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 126 పరుగులు చేసింది. బేట్స్ (27 బంతుల్లో 34; 5 ఫోర్లు) మెరుగ్గా ఆడగా, డివైన్ (13 బంతుల్లో 18; 1 ఫోర్, 2 సిక్సర్లు), బ్రాడ్మోర్ (18 బంతుల్లో 15 నాటౌట్; 1 ఫోర్) ఫర్వాలేదనిపించారు. రాజేశ్వరి గైక్వాడ్ 3 వికెట్లు తీసింది. తర్వాత భారత్ 19 ఓవర్లలో 7 వికెట్లకు 128 పరుగులు చేసి నెగ్గింది. వేదా కృష్ణమూర్తి (19 బంతుల్లో 34; 6 ఫోర్లు) టాప్ స్కోరర్. వనిత (22 బంతుల్లో 28; 4 ఫోర్లు, 1సిక్స్), అనుజా పాటిల్ (23 బంతుల్లో 22; 3 ఫోర్లు), లతికా కుమారి (18 బంతుల్లో 15; 2 ఫోర్లు) రాణించారు. డివైన్, కాస్పరెక్, బ్రాడ్మోర్ తలా రెండు వికెట్లు తీశారు. -
న్యూజిలాండ్ 398/5
ఇంగ్లండ్‌తో రెండో వన్డే లండన్ : తొలి వన్డేలో ఘోర ఓటమిని మూటగట్టుకున్న న్యూజిలాండ్ తొందరగానే తేరుకుంది. బ్యాటింగ్‌లో విశేషంగా రాణించడంతో ఇంగ్లండ్‌తో శుక్రవారం జరిగిన రెండో వన్డేలో భారీ స్కోరు చేసింది. రాస్ టేలర్ (96 బంతుల్లో 119 నాటౌట్; 10 ఫోర్లు, 4 సిక్సర్లు) సెంచరీకి తోడు విలియమ్సన్ (88 బంతుల్లో 93; 12 ఫోర్లు, 1 సిక్స్) చెలరేగడంతో కివీస్ 50 ఓవర్లలో 5 వికెట్లకు 398 పరుగులు చేసింది. కెన్నింగ్స్టన్ ఓవల్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి కివీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లలో మెకల్లమ్ (39) విఫలమైనా.. గుప్టిల్ (54 బంతుల్లో 50; 6 ఫోర్లు, 1 సిక్స్) ఆకట్టుకున్నాడు. తర్వాత విలియమ్సన్ దూకుడుగా ఆడగా, టేలర్ కీలక భాగస్వామ్యాలతో ఇన్నింగ్స్‌కు వెన్నెముకగా నిలిచాడు. ఈ ఇద్ద రు మూడో వికెట్‌కు 121 పరుగులు జోడించారు. ఇలియట్ (32), రోంచి (33) ఓ మోస్తరుగా ఆడారు. స్టోక్స్ 2 వికెట్లు తీశాడు. -
తొలి టెస్టు న్యూజిలాండ్‌దే
శ్రీలంకపై 8 వికెట్ల తేడాతో గెలుపుక్రైస్ట్చర్చ్: ఈ ఏడాదిని తమ టెస్టు చరిత్రలోనే అత్యంత విజయవంతంగా న్యూజిలాండ్ జట్టు ముగించింది. శ్రీలంకతో జరిగిన తొలి టెస్టును ఎనిమిది వికెట్ల తేడాతో గెల్చుకుని 2014లో ఐదో విజయాన్ని సాధించింది. ఓ క్యాలెండర్ ఏడాదిలో ఐదు టెస్టులు గెలవడం కివీస్‌కిదే తొలిసారి. చివరి రోజు సోమవారం లంక విధించిన 105 పరుగుల లక్ష్యాన్ని కివీస్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 30.4 ఓవర్లలో 2 వికెట్లకు 107 పరుగులు చేసి నెగ్గింది. దీంతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యం పొందింది. కేన్ విలియమ్సన్ (75 బంతుల్లో 31 నాటౌట్), రాస్ టేలర్ (63 బంతుల్లో 39; 6 ఫోర్లు) రాణించారు. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’గా మెకల్లమ్ నిలిచాడు. శనివారం నుంచి ఇరు జట్ల మధ్య వెల్లింగ్టన్లో చివరిదైన రెండో టెస్టు జరుగుతుంది. అంతకుముందు 293/5 ఓవర్‌నైట్ స్కోరుతో తమ ఫాలోఆన్ ఆటను ప్రారంభించిన లంక 154 ఓవర్లలో 407 పరుగులకు ఆలౌట్ అయ్యింది. మాథ్యూస్ (127 బంతుల్లో 66; 7 ఫోర్లు; 1 సిక్స్), ఎరంగ (62 బంతుల్లో 45 నాటౌట్; 7 ఫోర్లు) ఆకట్టుకున్నారు. బౌల్ట్, సౌతీలకు నాలుగేసి వికెట్లు దక్కాయి. సంక్షిప్త స్కోర్లు న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: 441 ఆలౌట్; శ్రీలంక తొలి ఇన్నింగ్స్: 138 ఆలౌట్; శ్రీలంక రెండో ఇన్నింగ్స్: 407 ఆలౌట్ (154 ఓవర్లలో) (కరుణరత్నే 152, మాథ్యూస్ 66, ఎరంగ 45 నాటౌట్, బౌల్ట్ 4/100, సౌతీ 4/91); న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్: 107/2 (30.4 ఓవర్లలో) (విలియమ్సన్ 31 నాటౌట్, రాస్ టేలర్ 39 నాటౌట్). -
ఫాలోఆన్‌లో శ్రీలంక
⇒ రెండో ఇన్నింగ్స్ 84/0 ⇒ కివీస్ తొలి ఇన్నింగ్స్ 441 క్రైస్ట్‌చర్చ్: న్యూజిలాండ్ జట్టు ఆల్‌రౌండ్ షో ముందు శ్రీలంక జట్టు ఉక్కిరిబిక్కిరవుతోంది. తొలి రోజు ఆటలో మెకల్లమ్ తుఫాన్ ఇన్నింగ్స్‌తో అదరగొట్టగా... రెండో రోజు బౌలర్లు రెచ్చిపోయారు. ఫలితంగా శనివారం లంక జట్టు రెండుసార్లు బ్యాటింగ్‌కు దిగాల్సి వచ్చింది. ముందుగా తమ తొలి ఇన్నింగ్స్‌లో 42.4 ఓవర్లలో 138 పరుగులకే కుప్పకూలింది. దీంతో కివీస్‌కు 303 పరుగుల భారీ ఆధిక్యం అందింది. పేసర్లు ట్రెంట్ బౌల్ట్ (3/25), నీల్ వాగ్నర్ (3/60) ధాటికి శ్రీలంక కుప్పకూలింది. సౌతీ, నీషమ్‌కు రెండేసి వికెట్లు దక్కాయి. కెప్టెన్ ఏంజెలో మాథ్యూస్ (85 బంతుల్లో 50; 3 ఫోర్లు; 2 సిక్సర్లు) మినహా ఎవరూ రాణించలేకపోయారు. ఆ తర్వాత ఫాలోఆన్ కోసం బరిలోకి దిగిన లంక రెండో రోజు ముగిసే సమయానికి 35 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 84 పరుగులు చేసింది. అంతకుముందు 429/7 ఓవర్‌నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్ ఆట ప్రారంభించిన కివీస్ 85.5 ఓవర్లలో 441 పరుగులకు ఆలౌటయ్యింది. -
న్యూజిలాండ్ టీమ్ రెడీ
ఆక్లాండ్: ఇండియాతో వన్డే క్రికెట్ సిరీస్‌కు ఒక మార్పుతో న్యూజిలాండ్ టీమ్ రెడీ అయింది. సెలెక్టర్లు ప్రకటించిన 13 మంది క్రీడాకారుల బృందంలో కోలిన్ మున్రోకు చోటు దక్కలేదు. కాగా గాయం నుండి కోలుకున్న ఫాస్ట్ బౌలర్ టిమ్ సౌతీకి జట్టులో చోటు దక్కింది. ఈ సిరీస్‌లో 5 వన్డే మ్యాచ్‌లు ఆడతారు. వెస్టిండీస్‌తో ఇటీవల వన్డే సిరీస్‌ను 2-2గా డ్రా చేసుకున్న కివీస్ టీమ్‌లో వున్నప్పటికీ, మున్రో ఆడలేకపోయాడు. ఇదే సిరీస్‌లోని మూడో వన్డేలో అండర్సన్ 36 బంతుల్లో సెంచరీ కొట్టి పాక్ బ్యాట్స్‌మన్ షాహిద్ ఆఫ్రిది పేరు మీదున్న ఫాస్టెస్ట్ వన్డే సెంచరీ రికార్డుని సొంతం చేసుకున్నాడు. ఇదే మ్యాచ్‌లో జెస్సీ రైడర్ కూడా తన ఫాస్టెస్ట్ సెంచరీని కంప్లీట్ చేశాడు.