భారత్‌కు ఊరట విజయం | The success of relief to India | Sakshi
Sakshi News home page

భారత్‌కు ఊరట విజయం

Published Thu, Jul 16 2015 1:06 AM | Last Updated on Sun, Sep 3 2017 5:33 AM

భారత్‌కు  ఊరట విజయం

భారత్‌కు ఊరట విజయం

బెంగళూరు : ఇప్పటికే మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను చేజార్చుకున్న భారత మహిళల జట్టు... న్యూజిలాండ్‌తో జరిగిన ఆఖరి మ్యా చ్‌లో 3 వికెట్ల తేడాతో గెలిచి కాస్త ఊరట చెందింది.  బుధవారం చిన్నస్వామి స్టేడియం లో జరిగిన ఈ మ్యాచ్‌లో... ముందుగా న్యూజిలాండ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 126 పరుగులు చేసింది. బేట్స్ (27 బంతుల్లో 34; 5 ఫోర్లు) మెరుగ్గా ఆడగా, డివైన్ (13 బంతుల్లో 18; 1 ఫోర్, 2 సిక్సర్లు), బ్రాడ్‌మోర్ (18 బంతుల్లో 15 నాటౌట్; 1 ఫోర్) ఫర్వాలేదనిపించారు.

రాజేశ్వరి గైక్వాడ్ 3 వికెట్లు తీసింది. తర్వాత భారత్ 19 ఓవర్లలో 7 వికెట్లకు 128 పరుగులు చేసి నెగ్గింది. వేదా కృష్ణమూర్తి (19 బంతుల్లో 34; 6 ఫోర్లు) టాప్ స్కోరర్. వనిత (22 బంతుల్లో 28; 4 ఫోర్లు, 1సిక్స్), అనుజా పాటిల్ (23 బంతుల్లో 22; 3 ఫోర్లు), లతికా కుమారి (18 బంతుల్లో 15; 2 ఫోర్లు) రాణించారు. డివైన్, కాస్పరెక్, బ్రాడ్‌మోర్ తలా రెండు వికెట్లు తీశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement