T-20 Series
-
భారత్ క్లీన్‌స్వీప్
కొలంబో: శ్రీలంక పర్యటనలో భారత మహిళల జట్టు జైత్రయాత్ర ముగిసింది. వన్డే సిరీస్‌ను 2–1తో హస్తగతం చేసుకున్న మన అమ్మాయిలు... పొట్టి ఫార్మాట్లోనూ దుమ్మురేపారు. ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో ఓ మ్యాచ్ వర్షార్పణం కాగా మిగతా నాలుగు మ్యాచ్‌లను గెలిచి 4–0తో క్లీన్‌స్వీప్ చేశారు. మంగళవారం జరిగిన చివరిదైన ఐదో టి20లో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (38 బంతుల్లో 63; 3 ఫోర్లు, 5 సిక్స్‌లు), జెమీమా రోడ్రిగ్స్ (31 బంతుల్లో 46; 6 ఫోర్లు, 1 సిక్స్) చెలరేగడంతో భారత్ 51 పరుగుల తేడాతో శ్రీలంకను చిత్తుచేసింది. తొలుత భారత్ 18.3 ఓవర్లలో 156 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్లు మిథాలీ రాజ్ (12), స్మృతి మంధాన (0) త్వరగానే పెవిలియన్ చేరినా... జెమీమా, హర్మన్ ధాటిగా ఆడుతూ స్కోరు బోర్డును ఉరకలెత్తించారు. వీరిద్దరు మూడో వికెట్‌కు 75 పరుగులు జోడించారు. అనంతరం వేద కృష్ణమూర్తి (8), అనూజ (1), తానియా (5) సింగిల్ డిజిట్‌కే పరిమితమవడంతో భారత్ నిర్ణీత ఓవర్లకంటే ముందే ఆలౌటైంది. లంక బౌలర్లలో శశికళ, ప్రయదర్శని ఫెర్నాండో మూడేసి వికెట్లు పడగొట్టారు. అనంతరం పూనమ్ యాదవ్ (3/18), దీప్తి శర్మ (2/18), రాధ యాదవ్ (2/14)ల ధాటికి లంక 17.4 ఓవర్లలో 105 పరుగులకే పరిమితమైంది. -
‘ధోనిని 4వ స్థానంలో పంపండి’
న్యూఢిల్లీ : మాజీ కెప్టెన్ ధోనిని బ్యాటింగ్ ఆర్డర్లో నాలుగో స్థానంలో పంపితే బావుంటుందని వీరేంద్ర సెహ్వాగ్ అభిప్రాయపడ్డారు. అవసరమైన సమయంలో ఆపద్భాందవుడిలా జట్టును ఆదుకోవడంలో ముందుండే మహేంద్ర సింగ్ ధోని ట్వంటీ-20 ఫార్మాట్లో గత కొంతకాలంగా క్రీజులో నిలదొక్కుకోవడానికి కష్టపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికాతో మూడు ట్వంటీ-20ల్లో ధోని బరిలోకి దిగనున్నాడు. మిడిల్ ఆర్డర్లో మనీష్ పాండే, కేదార్ జాదవ్, హార్దిక్ పాండ్యాల తర్వాత ధోనీ బ్యాటింగ్‌కు వస్తున్నాడు. చివరి ఓవర్లలో బ్యాటింగ్ చేస్తుండటంతో కుదురుకోవడానికి సమయం దొరకడం లేదు. దీంతో పెద్దగా పరుగులేమీ చేయకుండా వెనుదిరగాల్సి వస్తోంది. దీని గురించి సెహ్వాగ్ మాట్లాడుతూ.. ధోనీకి బ్యాటింగ్ ఆర్డర్లో ప్రమోషన్ కల్పిస్తే బావుంటుందని అన్నాడు. నాలుగో స్థానంలో ధోనిని పంపడం వల్ల భారీ స్కోరు చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పాడు. ఈ విషయం కోహ్లికి తెలుసని, ధోని త్వరగా అవుటైతే తర్వాత పరిస్థితి ఏంటి? అనే ఉద్దేశంతోనే ఆ ధైర్యం చేయడం లేదేమోనని అన్నాడు. ఈ విషయంపై ఎలాంటి డైలమా అవసరం లేదని చెప్పాడు. మనీష్ పాండే, హార్దిక్, జాదవ్‌ల్లో ఒకరికి ఇన్నింగ్స్ ఫినిషింగ్ బాధ్యతను అప్పజెప్పడమే బెటరని సూచించాడు. దక్షిణాఫ్రికా గడ్డపై భారత్‌కు ట్వంటీ-20ల్లో మంచి రికార్డే ఉంది. ధోని సారథ్యంలోని టీమిండియా 2007లో టీ-20 ప్రపంచకప్‌ను గెలుపొందింది. -
పాకిస్తాన్‌దే టి20 సిరీస్
పోర్ట్ ఆఫ్ స్పెయిన్: వెస్టిండీస్‌తో జరిగిన నాలుగు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను పాకిస్తాన్ జట్టు కైవసం చేసుకుంది. చివరిదైన నాలుగో మ్యాచ్‌లో పాక్ జట్టు 7 వికెట్ల తేడాతో గెలుపొంది సిరీస్‌ను 3–1తో గెలుచుకుంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 124 పరుగులు చేసింది. ఓపెనర్ చాడ్విక్ వాల్టన్ (31 బంతుల్లో 40; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), బ్రాత్‌వైట్ (24 బంతుల్లో 37 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆకట్టుకున్నారు. పాక్ బౌలర్లలో హసన్ అలీ, షాదాబ్ ఖాన్ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం పాక్ జట్టు 19 ఓవర్లలో 3 వికెట్లకు 127 పరుగులు చేసి గెలిచింది. షెహజాద్ (45 బంతుల్లో 53; 6 ఫోర్లు, 1 సిక్సర్) అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. హసన్ అలీకి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవా ర్డు దక్కగా... షాదాబ్ ‘ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ పురస్కారాన్ని గెలుచుకున్నాడు. -
అశ్విన్, జడేజాలకు విశ్రాంతి
టి20 జట్టులో అమిత్‌మిశ్రా, రసూల్ న్యూఢిల్లీ: ఇంగ్లండ్‌తో జరిగే టి20 సిరీస్ కోసం ఇంతకు ముందే ప్రకటించిన భారత జట్టులో రెండు మార్పులు చోటు చేసుకున్నాయి. ఆఫ్ స్పిన్నర్ అశ్విన్, ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాలకు ఈ సిరీస్ నుంచి విశ్రాంతినిస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. వీరి స్థానాల్లో లెగ్‌స్పిన్నర్ అమిత్ మిశ్రా, ఆల్‌రౌండర్ పర్వేజ్ రసూల్‌లను జట్టులోకి ఎంపిక చేశారు. భారత టీమ్ మేనేజ్మెంట్తో చర్చించిన తర్వాత సెలక్షన్ కమిటీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు వెల్లడించింది. జట్టులో ఇప్పటికే చహల్ రూపంలో మరో లెగ్‌స్పిన్నర్ ఉండగా, మిశ్రాను కూడా ఎంపిక చేశారు. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో ‘మ్యాన్ ఆఫ్ ద టోర్నీ’గా నిలిచినా, ఇంగ్లండ్‌తో ఒక్క మ్యాచ్‌లో కూడా మిశ్రాకు అవకాశం దక్కలేదు. కెరీర్లో 8 టి20లు ఆడి 14 వికెట్లు తీసిన అతను, ఈ ఫార్మాట్లో భారత్ ఆడిన ఆఖరి సిరీస్ (అమెరికాలో వెస్టిండీస్‌తో) లో కూడా జట్టులో సభ్యుడిగా ఉన్నా డు. జమ్మూ కశ్మీర్ నుంచి భారత్‌కు ప్రాతినిధ్యం వహిం చిన తొలి ఆటగాడిగా గుర్తింపు పొందిన రసూల్ టీమిం డియా తరఫున ఏకైక వన్డేను రెండున్నరేళ్ల క్రితం ఆడాడు. -
‘జోకర్’ అనిపించుకోవడమే నాకిష్టం!
విరాట్ కోహ్లి వ్యాఖ్య టి20లకు సిద్ధమన్న భారత కెప్టెన్ కోల్‌కతా: విరాట్ కోహ్లి అద్భుత ఆటతీరుపై ఇటీవల కురుస్తున్న ప్రశంసల వర్షానికి విరామమే లేదు. అతడిని పిలిచేందుకు కొత్త విశేషణాలు వెతుక్కోవాల్సిన పరిస్థితి. ‘కింగ్ కోహ్లి’ అని, ‘భయమన్నదే ఎరుగని నాయకుడు’ అంటూ ఇలా అతడిని ప్రస్తుతిస్తున్నారు. కానీ అసలు ఇలాంటి వాటి గురించి తాను ఏమనుకుంటున్నాడని అతడినే ప్రశ్నిస్తే... ‘డ్రెస్సింగ్ రూమ్‌లో నేను జోకర్ అని పిలిపించుకోవడానికే ఎక్కువగా ఇష్టపడతాను’ అని ఒక్క ముక్కలో తన గురించి తాను చెప్పుకున్నాడు! మరోవైపు ఇంగ్లండ్‌తో సిరీస్‌లో భారత జట్టు ప్రదర్శన చాలా బాగుందని అతను విశ్లేషించాడు. తొలి, చివరి వన్డేల్లో జాదవ్ బ్యాటింగ్, ఆఖరి మ్యాచ్‌లో పాండ్యా ఆల్‌రౌండ్ ప్రదర్శనతో పాటు, సీనియర్లు యువరాజ్, ధోని కటక్ మ్యాచ్‌లో చెలరేగడం ఈ సిరీస్‌లో ప్రత్యేక క్షణాలని అతను ప్రశంసించాడు. ఓపెనింగ్ సమస్యను కూడా త్వరలోనే చక్కదిద్దుకుంటామని అతను అన్నారు. ‘మన ఓపెనర్లకు మద్దతుగా నిలబడాల్సిన సమయమిది. వారు ఫామ్‌లోకి తిరిగి వచ్చేందుకు తగిన అవకాశమిచ్చి ప్రోత్సహించాలి. మన దగ్గర కావాల్సినంత మంది మంచి ఓపెనర్లు ఉన్నారు. అయితే ఈ లోపాన్ని సవరించుకునేందుకు ప్రయత్నిస్తాం. సరిగ్గా చెప్పాలంటే మా బ్యాటింగ్ బలం తమ పూర్తి సామర్థ్యంలో 75 శాతం మాత్రమే ఆటను ప్రదర్శించింది. ఓపెనింగ్ కూడా చక్కబడి వంద శాతం బాగా ఆడితే ఇంకా ఎన్ని పరుగులు చేసేవాళ్లమో దేవుడికే తెలుసు’ అని కోహ్లి వ్యాఖ్యానించాడు. చాంపియన్స్ ట్రోఫీకి (జూన్‌లో) ముందు ఇకపై షెడ్యూల్ ప్రకారం మన జట్టుకు వన్డేలు లేవు. అయితే ఇది పెద్ద సమస్య కాదని, టి20 మ్యాచ్‌ల వల్ల డెత్ బౌలింగ్ మెరుగు పడుతుందని అతను అభిప్రాయపడ్డాడు. ‘వన్డేలు లేకపోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది లేదు. బ్యాటింగ్‌కు సంబంధించి ఫార్మాట్ ఏదైనా టెక్నిక్‌లో తేడా ఉండదు. టి20ల వల్ల బౌలింగ్ మెరుగుపర్చుకునే అవకాశం ఉంది. ఇక్కడ డెత్ బౌలింగ్‌లో చక్కగా బంతులు వేస్తే వన్డేలకు అది మంచి పాఠంలా మారుతుంది’ అని విరాట్ విశ్లేషించాడు. ధోని సంతకం చేసిన బంతిని ఇచ్చాడు... కటక్‌లో రెండో వన్డే గెలుపు తర్వాత సిరీస్ భారత్ సొంతమైంది. ఈ క్షణాన్ని చిరస్మరణీయం చేసేందుకు మాజీ కెప్టెన్ ధోని మ్యాచ్ బాల్ తనకు ఇచ్చాడని కోహ్లి వెల్లడిం చాడు. ‘ఈ రోజుల్లో స్టంప్స్ చాలా విలువైనవి కాబట్టి వాటిని ఎవరూ తీసుకుపోనివ్వడం లేదు. ధోని అందుకే మ్యాచ్ బాల్‌ను నాకిచ్చి ఇది నా తొలి సిరీస్ విజయం కాబట్టి జ్ఞాపికగా ఉంచుకోమన్నాడు. అతను దానిపై తన సంతకం కూడా చేసి ఇవ్వడం నాకో మధుర క్షణం’ అని కోహ్లి అన్నాడు. -
వన్డే సిరీస్‌కు అశ్విన్, జడేజా దూరం!
ఇంగ్లండ్‌తో జరగబోయే వన్డే, టి20 సిరీస్‌కు ఆర్.అశ్విన్‌తో పాటు రవీంద్ర జడేజా, పేసర్లు మొహమ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్‌లకు విశ్రాంతి ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నారుు. ప్రస్తుతం జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్‌లో వీరంతా అద్భుతంగా రాణిస్తున్న విషయం తెలిసిందే. వచ్చేనెల 15న మూడు వన్డేల సిరీస్ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత మూడు టి20లు జరుగుతారుు. అరుుతే మున్ముందు బంగ్లాదేశ్‌తో టెస్టు, ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్ ఉండటంతో తమ ప్రధాన బౌలర్లను గాయాలబారిన పడకుండా చూడాలని భారత జట్టు ప్రధాన కోచ్ అనిల్ కుంబ్లే ఆలోచిస్తున్నారు. -
టి20 సిరీస్ విండీస్‌దే
రెండో మ్యాచ్‌లోనూ భారత్ ఓటమి విజయవాడ స్పోర్ట్స: వన్డే సిరీస్‌ను 0-3తో కోల్పోరుున వెస్టిండీస్ మహిళల క్రికెట్ జట్టు టి20 సిరీస్‌లో మాత్రం రాణిస్తోంది. భారత జట్టుతో ఆదివారం జరిగిన రెండో టి20 మ్యాచ్‌లో ప్రపంచ చాంపియన్ వెస్టిండీస్ 31 పరుగుల ఆధిక్యంతో గెలిచింది. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను 2-0తో సొంతం చేసుకుంది. 138 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 18.1 ఓవర్లో 106 పరుగులకే ఆలౌటై ఓటమి పాలైంది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (37 బంతుల్లో 43 పరుగులు; 3 సిక్స్‌లు, 1 ఫోరు) మినహా మిగతావారు విఫలమయ్యారు. అంతకుముందు వెస్టిండీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. చివరి టి20 మ్యాచ్ ఇదే గ్రౌండ్లో ఈనెల 22న జరుగనుంది. -
హీట్స్’ హోం గ్రౌండ్లో...
ఫ్లోరిడా: టి20 సిరీస్‌కు ముందు లభించిన విరామంలో భారత ఆటగాళ్లు అమెరికాలో సరదాగా గడుపుతున్నారు. అశ్విన్, ధావన్, భువనేశ్వర్ గురువారం అమెరికా బాస్కెట్ బాల్ టీమ్ ‘మియామీ హీట్స్’ హోం గ్రౌండ్ ‘ది అమెరికన్ ఎయిర్‌లైన్స్ ఎరీనా’ను సందర్శించారు. జట్టు ఆటగాళ్లు టైలర్ జాన్సన్, బ్రియాంట్ వెబర్‌లతో ముచ్చటించిన క్రికెటర్లు... కొద్ది సేపు బాస్కెట్‌బాల్ కూడా ఆడారు. ఇతర భారత జట్టు సభ్యులలో కొందరు షాపింగ్ చేయగా, మరికొందరు హోటల్ రూంలకే పరిమితమయ్యారు. భారత్‌నుంచి ధోని, బుమ్రా కలిసి బుధవారం ఫ్లోరిడా చేరుకున్నారు. మరో వైపు ఈ సిరీస్‌ను 0-2తో ఓడితే టీమిండియా ఐసీసీ టి20 ర్యాంకింగ్స్‌లో రెండు నుంచి మూడో స్థానానికి పడిపోతుంది. 2-0తో గెలిస్తే నంబర్‌వన్‌కు చేరువయ్యే అవకాశం ఉండగా... 1-1తో సిరీస్ ముగిస్తే రెండో స్థానంలోనే కొనసాగుతుంది. -
శరణు... శరణు...!
► రెండో టి20లో జింబాబ్వే చిత్తు ► 10 వికెట్లతో భారత్ ఘనవిజయం ► రాణించిన బరీందర్, బుమ్రా ► రేపు చివరి మ్యాచ్ బరీందర్ శరణ్ పదునైన స్వింగ్‌కు జింబాబ్వే విలవిల్లాడింది. సాధారణప్రదర్శన కూడా ఇవ్వలేక రెండో టి20లో తలవంచింది. గత మ్యాచ్‌లో అనూహ్య ఓటమికి తగిన రీతిలో ప్రతీకారం తీర్చుకుంటూ భారత్ పది వికెట్లతో ప్రత్యర్థిని చిత్తు చేసింది. కెరీర్ తొలి అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లోనే చెలరేగిన బరీందర్‌కు తోడు బుమ్రా పేస్‌తో జింబాబ్వేను వణికిస్తే... స్వల్ప లక్ష్యాన్ని భారత ఓపెనర్లు ఊదేశారు. హరారే: జింబాబ్వేతో జరుగుతున్న టి20 సిరీస్‌లో భారత్ వెంటనే కోలుకుంది. గత మ్యాచ్‌లో ఓడిన జట్టు ఈ సారి అన్ని రంగాల్లో సమష్టిగా రాణించి ఏకపక్ష విజయం సాధించింది. సోమవారం ఇక్కడ జరిగిన రెండో టి20లో భారత్ 10 వికెట్ల తేడాతో జింబాబ్వేను చిత్తుగా ఓడించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 99 పరుగులకే కుప్పకూలింది. పీటర్ మూర్ (32 బంతుల్లో 31; 2 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ బరీందర్ (4/10), బుమ్రా (3/11) ప్రత్యర్థిని దెబ్బ తీశారు. అనంతరం భారత్ 13.1 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 103 పరుగులు చేసింది. మన్దీప్ సింగ్ (40 బంతుల్లో 52 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్), కేఎల్ రాహుల్ (40 బంతుల్లో 47 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) జట్టును గెలిపించారు. తాజా ఫలితంతో సిరీస్ 1-1తో సమంగా నిలిచింది. మూడోదైన చివరి టి20 మ్యాచ్ బుధవారం జరుగుతుంది. బరీందర్ ధాటికి విలవిల తొలి మ్యాచ్‌లో స్ఫూర్తిదాయక ఆటతీరు కనబర్చిన జింబాబ్వే ఈ మ్యాచ్‌లో పూర్తిగా చేతులెత్తేసింది. పీటర్ మూర్ మినహా మరెవరూ కనీస ప్రదర్శన ఇవ్వలేకపోయారు. తొలి మ్యాచ్ ఆడుతున్న బరీందర్ తన రెండో ఓవర్లో చిబాబా (10)ను అవుట్ చేసి భారత్‌కు శుభారంభం అందించాడు. అతని తర్వాతి ఓవర్ జింబాబ్వేను పూర్తిగా కష్టాల్లో పడేసింది. రెండో, ఐదో, చివరి బంతులకు అతను మసకద్జ (10), రజా (1), ముతుంబొజి (0)లను వెనక్కి పంపాడు. టి20ల్లో ఒక భారత బౌలర్ ఒకే ఓవర్లో 3 వికెట్లు తీయడం ఇది రెండో సారి మాత్రమే కావడం విశేషం. అనంతరం వాలర్ (14)ను చహల్ అవుట్ చేయగా... బుమ్రా తర్వాతి మూడు వికెట్లు తీసి ప్రత్యర్థిని కుప్పకూల్చాడు. ఈ మ్యాచ్‌తో ధావల్, బరీందర్ అంతర్జాతీయ టి20ల్లో అరంగేట్రం చేశారు. అలవోకగా ఛేదన స్వల్ప లక్ష్య ఛేదనలో భారత్‌కు ఏ దశలోనూ ఇబ్బంది ఎదురు కాలేదు. జింబాబ్వే పేలవ ఫీల్డింగ్ కూడా జట్టుకు కలిసొచ్చింది. ఓపెనర్లు రాహుల్, మన్దీప్ స్వేచ్ఛగా ఆడుతూ జట్టును లక్ష్యం వైపు నడిపించారు. ఇద్దరూ పోటీ పడుతూ చక్కటి షాట్లతో మరో 41 బంతులు మిగిలి ఉండగానే భారత్‌ను గెలిపించారు. భారత విజయానికి ఒక్క పరుగు అవసరమైన దశలో బౌండరీ కొట్టడం ద్వారా మన్దీప్ కెరీర్లో తొలి అర్ధసెంచరీ సాధించాడు. ► బరీందర్ శరణ్ భారత్ తరఫున టి20ల్లో రెండో అత్యుత్తమ గణాంకాలు (4/10) నమోదు చేశాడు. అరంగేట్రం చేసిన మ్యాచ్‌లో ఒక భారత బౌలర్‌కు ఇదే ఉత్తమ ప్రదర్శన కాగా... ఓవరాల్‌గా రెండో అత్యుత్తమం. ఇలియాస్ సన్నీ (బంగ్లాదేశ్) తన తొలి మ్యాచ్‌లో 13 పరుగులిచ్చి 5 వికెట్లు తీశాడు. ► ఒకే ఏడాదిలో టి20ల్లో అత్యధిక వికెట్లు (24) తీసిన భారత బౌలర్‌గా బుమ్రా...అశ్విన్ (21)ను అధిగమించాడు. స్కోరు వివరాలు జింబాబ్వే ఇన్నింగ్స్: చిబాబా (సి) అంబటి రాయుడు (బి) బరీందర్ 10; మసకద్జ (బి) బరీందర్ 10; మూర్ (సి) అక్షర్ (బి) బుమ్రా 31; రజా (సి) రాహుల్ (బి) బరీందర్ 1; ముతుంబొజి (ఎల్బీ) (బి) బరీందర్ 0; వాలర్ (సి) అక్షర్ (బి) చహల్ 14; చిగుంబురా (బి) బుమ్రా 8; క్రీమర్ (సి) రాయుడు (బి) ధావల్ 4; మద్జివ (బి) బుమ్రా 1; తిరిపానో (నాటౌట్) 11; ముజరబని (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 99. వికెట్ల పతనం: 1-14; 2-26; 3-28; 4-28; 5-57; 6-75; 7-81; 8-83; 9-91. బౌలింగ్: బరీందర్ 4-0-10-4; ధావల్ 4-0-32-1; అక్షర్ 4-0-23-0; చహల్ 4-1-19-1; బుమ్రా 4-0-11-3. భారత్ ఇన్నింగ్స్: రాహుల్ (నాటౌట్) 47; మన్దీప్ (నాటౌట్) 52; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (13.1 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా) 103. బౌలింగ్: తిరిపానో 3-0-11-0; మద్జివ 2.1-0-19-0; ముజరబని 2-0-17-0; క్రీమర్ 3-0-24-0; చిబాబా 2-0-23-0; రజా 1-0-9-0. -
ఆసీస్‌దే టి20 సిరీస్ ఆఖరి మ్యాచ్‌లో ఓడిన దక్షిణాఫ్రికా
కేప్ టౌన్: లక్ష్య ఛేదనలో చెలరేగిన ఆస్ట్రేలియా... దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. కెప్టెన్ స్మిత్ (26 బంతుల్లో 44; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), వాట్సన్ (27 బంతుల్లో 42; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) వీరవిహారం చేయడంతో బుధవారం అర్ధరాత్రి జరిగిన ఆఖరి మ్యాచ్‌లోనూ కంగారులు 6 వికెట్ల తేడాతో సఫారీలపై విజయం సాధించారు. న్యూలాండ్స్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 4 వికెట్లకు 178 పరుగులు చేసింది. హషీమ్ ఆమ్లా (62 బంతుల్లో 97 నాటౌట్; 8 ఫోర్లు, 4 సిక్సర్లు) దుమ్మురేపాడు. కోల్టర్‌నీల్ 2 వికెట్లు తీశాడు. తర్వాత ఆసీస్ 19.2 ఓవర్లలో 4 వికెట్లకు 181 పరుగులు చేసింది. వార్నర్ (27 బంతుల్లో 33; 3 ఫోర్లు), మ్యాక్స్‌వెల్ (10 బంతుల్లో 19 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. -
‘పేస్’ గుర్రం
సత్తా చాటుతున్న నెహ్రా 37 ఏళ్ల వయసులో బౌలింగ్ జోరు {పపంచకప్‌లో కీలకం కానున్న సీమర్ ‘నా ఎంపిక విషయంలో ఇన్నేళ్లుగా ఏం జరుగుతుందో నాకు తెలీదు. బహుశా వాళ్లకు నా మొహం నచ్చలేదేమో, కనీసం నా భార్యకైనా నచ్చినందుకు సంతోషం’... భారత జట్టులో పునరాగమనం కోసం దాదాపు నాలుగేళ్ల పాటు ప్రయత్నించి, శ్రమించి చివరకు ఆవేదనతో సెలక్టర్ల గురించి ఆశిష్ నెహ్రా చేసిన వ్యాఖ్య ఇది. సోమరి, జిమ్ అంటే దూరం, బలహీన శరీరం, ఎప్పుడూ గాయాలే... ఇలా నెహ్రా గురించి వచ్చిన, వినిపించిన విశేషణాలు అన్నీ ఇన్నీ కావు. వెన్నునొప్పి, వేలు, మడమ, చేతులు, పక్కటెముకలు... ఇలా అతని శరీరంలో గాయపడిన భాగాల జాబితా కూడా పెద్దదే. కాబట్టి ఆ మాటల్లోనూ వాస్తవం లేకపోలేదు. కానీ ఇదంతా గతం. ఇప్పుడు నెహ్రా మారిపోయాడు. మనం చూస్తోంది అతని కొత్త అవతారం. రెండు పదుల వయసు ఉన్న పేస్ బౌలర్ కూడా ఫిట్నెస్ సమస్యలు ఎదుర్కొంటున్న చోట 37 ఏళ్ల నెహ్రా కుర్రాడిలా చెలరేగిపోతున్నాడు. తన వయసులో ఉన్నవాళ్లు ఆట మానేసి కామెంటరీ చెబుతున్న సమయంలో అతను యార్కర్లు సంధిస్తున్నాడు. దాదాపు నాలుగేళ్ల పాటు జట్టుకు దూరమై పునరాగమనం చేయడమే అనూహ్యం అనుకుంటే... టి20ల్లో నెహ్రా ప్రదర్శన మరింత పదునెక్కుతూ వస్తోంది. ఏదో జట్టులో ఉన్నాడని కాకుండా ఇన్నేళ్ల తర్వాత కూడా ప్రధాన పేసర్‌గా కొత్త బంతితో అతను ప్రభావం చూపిస్తున్న తీరు వయసు మళ్లినా పంజా పదును తగ్గని వృద్ధ సింహాన్ని గుర్తుకు తెస్తోంది. క్రీడా విభాగం ఆస్ట్రేలియాతో జరిగే టి20 సిరీస్ కోసం ఆశిష్ నెహ్రాను ఎంపిక చేసినప్పుడు అన్ని వర్గాల్లో ఆశ్చర్యం వ్యక్తమైంది. క్రికెట్‌కు సంబంధించి ఒక రకంగా ముసలితనంగా భావించే 37 ఏళ్ల వయసులో టి20లాంటి యూత్ క్రికెట్‌కు అతని అవసరం ఉందా? యువ పేసర్లు మన దగ్గర లేరా? అని అందరూ వ్యాఖ్యానించారు. అయితే ఆటలో జోరు, ఫిట్నెస్ ఉంటే వయసుతో పని లేదని నెహ్రా నిరూపించాడు. ఆడిన 7 మ్యాచ్‌లలో 18.30 సగటుతో 10 వికెట్లు పడగొట్టిన అతను కీలక సమయాల్లో ఆ వికెట్లు తీసి మ్యాచ్ ఫలితాన్ని శాసించాడు. భారత్ వరుస విజయాల్లో అతని బౌలింగ్ కూడా కీలక పాత్ర పోషించిందనడంలో సందేహం లేదు. తాను వేసే నాలుగు ఓవర్లలోనే స్లో బంతులు, కటర్లు, యార్కర్లతో వైవిధ్యం ప్రదర్శిస్తూ నెహ్రా మంచి ఫలితాలు సాధించాడు. ఆరంభంలో వేసే ఓవర్లు గానీ, డెత్ ఓవర్లలో కానీ అతను తన బాధ్యతను సమర్థంగా నిర్వర్తిస్తున్నాడు. ‘తాను ఫిట్‌గా ఉంటే ఏం చేయగలడో నెహ్రాకు బాగా తెలుసు. అతని బౌలింగ్‌లో చక్కటి క్రమశిక్షణ ఉంది. ఎంత పెద్ద వయసు ఉన్నా, అతని అనుభవం ఈ ఫార్మాట్లో కీలకంగా మారింది. మేం ఆశించిన విధంగా అతని ప్రదర్శన ఉండటం శుభ పరిణామం’ అని కెప్టెన్ ధోని ప్రశంసలు కురిపించడం నెహ్రా ప్రభావాన్ని చూపిస్తోంది. ఐపీఎల్‌తోనే మలుపు గత ఏడాది ఐపీఎల్లో చెన్నై జట్టు తరఫున నెహ్రా ప్రదర్శనను దగ్గరినుంచి చూడటం వల్లే ధోని కూడా అతని అవసరాన్ని గుర్తించాడు. వరుసగా ప్రయత్నించిన యువ బౌలర్లంతా తేలిపోవడంతో చివరి ఓవర్లలో తనకు కావాల్సిన బౌలర్ నెహ్రానే అని కెప్టెన్ భావించినట్లున్నాడు. ఐపీఎల్లో ఆడిన 16 మ్యాచ్‌లలో కలిపి అతను 7.24 ఎకానమీతో 22 వికెట్లు తీశాడు. ఐదు మ్యాచ్‌లలో కనీసం మూడు వికెట్లు చొప్పున పడగొట్టాడు. అందుబాటులో ఉన్న 64 ఓవర్లలో 62 ఓవర్లు బౌలింగ్ చేసి ఫిట్నెస్ కూడా నిరూపించుకున్నాడు. అయితే ఈ ప్రదర్శన తర్వాత కూడా వెంటనే నెహ్రాకు జాతీయ జట్టు పిలుపు రాలేదు. భారత్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్‌కు అతడిని పట్టించుకోలేదు. ‘ఐపీఎల్ ముగిసిన పది రోజుల్లో అంతా నన్ను మరచిపోతారు’ అంటూ నెహ్రా ఆ సమయంలో తన బాధను వ్యక్తం చేశాడు. అయితే సెలక్టర్లు మరీ పూర్తిగా మరచిపోలేదు. సొంతగడ్డపై సఫారీల చేతిలో పరాజయం తర్వాత ఆసీస్ మైదానాల్లో ఒక అనుభవజ్ఞుడి అవసరాన్ని వారు గుర్తించారు. అందుకే టి20 ఫార్మాట్‌కు సరిపోతాడని ఏరికోరి ఎంపిక చేసుకున్నారు. ఈ వెటరన్ పేసర్ వారి నమ్మకాన్ని నిలబెట్టాడు. కుర్రాళ్లతో పోటీ పడుతూ... 2011 వన్డే ప్రపంచకప్ సెమీస్ ఆడిన తర్వాత నాలుగేళ్లకు పైగా నెహ్రా భారత జట్టుకు దూరమయ్యాడు. ఫిట్నెస్ సమస్యలు ఒక కారణమైతే, వెల్లువలా వచ్చిన కొత్త పేసర్ల ముందు అతడిని ఎవరినీ పట్టించుకోలేదు. నిజానికి ఆ సమయానికి అతను మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఆ తర్వాతా దేశవాళీలో రెగ్యులర్‌గా మంచి ప్రదర్శన కనబర్చాడు. ఫస్ట్‌క్లాస్ ఫార్మాట్లో రెగ్యులర్‌గా ఆడకపోయినా... వన్డేలు, టి20లు మాత్రం కొనసాగించాడు. చాలెంజర్ ట్రోఫీ, దేవధర్ ట్రోఫీలలో ప్రతీ సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో అతను ఉన్నాడు. యువ బౌలర్లతో పోటీ పడుతూ వారితో సమానంగా రాణించిన నెహ్రా కొన్నిసార్లు వారికంటే మెరుగ్గా బౌలింగ్ చేశాడు. అయినా నాలుగేళ్ల పాటు అతనిపై సెలక్షన్ కమిటీ దృష్టి పడలేదు. 2015 ప్రపంచకప్ కోసం ఎంపిక చేసిన 30 మంది ప్రాబబుల్స్ జాబితాలో కూడా అతని పేరు లేదు. అయితే నెహ్రా విషయంలో భూమి గుండ్రంగా ఉందనే మాట నిజమైంది! 2011 ప్రపంచకప్ తర్వాత ఇటీవలి దక్షిణాఫ్రికా సిరీస్ వరకు భారత వన్డే, టి20 జట్లలో కలిపి 19 మంది పేస్ బౌలర్లు ఆడారు. కానీ ఇన్నేళ్ల తర్వాత అందరినీ కాదని మరో అవకాశం నెహ్రాను వెతుక్కుంటూ వచ్చింది. మారిపోయాడు ఐపీఎల్‌తో నెహ్రా ఫిట్నెస్, బౌలింగ్‌లో చాలా మార్పు వచ్చింది. ఇందు కోసం అతను కఠోరంగా శ్రమించాడు. కెరీర్ పొడిగించుకోవాలనే పట్టుదలతో మానసికంగా దృఢంగా తయారయ్యాడు. తన యాక్షన్‌తో శరీరంపై ఎక్కువ ఒత్తిడి పడే అవకాశం ఉన్నా... గాయాలపాలు కాకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. బౌలింగ్‌లో ఇన్నేళ్లకు కూడా కించిత్ వేగం తగ్గకపోవడం విశేషం. అన్నింటికీ మించి తీవ్ర సాధనతో నెహ్రా యార్కర్ మరింత పదునెక్కింది. ఐపీఎల్లో పదే పదే ఈ బంతిలో ఫలితం రాబట్టగలిగిన అతని సామర్థ్యం భారత్ తరఫున మరో అవకాశం కల్పించింది. ఆటలో కొనసాగుతూనే ఉన్నా... ఎవరూ పట్టించుకోక ఒక రకమైన అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన ఈ సీనియర్ పేస్ బౌలర్ ఇప్పుడు మరోసారి భారత్ విజయాల్లో భాగమయ్యాడు. ఇదే జోరు కొనసాగించి శుభారంభాలు ఇస్తే ప్రపంచకప్ విజేతగా నిలిచిన జట్టులో మరోసారి అతనూ ఉండటం ఖాయం. 37 ఏళ్ల వయసులో ఒక పేసర్ పునరాగమనం చేయడం సులభం కాదు. ఫాస్ట్ బౌలింగ్ అంటే 75 శాతం ఫిట్‌నెస్‌దే పాత్ర. 30 ఏళ్లు దాటితే పేస్ బౌలింగ్ భారంగా అనిపిస్తూ ఉంటుంది. నా దృష్టిలో వయసు పెద్ద సమస్య కాదు. ఫలానావారి పని అయిపోయిందని ఇక్కడ చెప్పలేం. కష్టపడితే మళ్లీ అవకాశం దక్కవచ్చు. 36 ఏళ్ల ఆటగాడు, 26 ఏళ్లవాడు ఇద్దరూ బాగా ఆడుతుంటే తక్కువ వయసు ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వవచ్చు. కానీ 40 ఏళ్లు ఉంటే తీసుకోవద్దని, ఎలా ఆడినా 20 ఏళ్లవాడికే అవకాశం ఇవ్వాలని అనుకోవద్దు. అంతర్జాతీయ క్రికెట్ అంటే అండర్-19 క్రికెట్ కాదుగా. టి20ల్లో బౌలర్లపై ఎంతో ఒత్తిడి ఉంటుంది. మూడు ఓవర్లు బాగా వేసినా ఒక్క బంతి మ్యాచ్‌ను మార్చేస్తుంది. వాటన్నింటినీ తట్టుకుంటూ రాణించడంలోనే మన విలువేమిటో తెలుస్తుంది. -ఆశిష్ నెహ్రా -
కొత్త అధ్యాయం
* ఆసీస్ గడ్డపై తొలి ద్వైపాక్షిక సిరీస్ గెలిచిన ధోని బృందం * 2-0తో టి20 సిరీస్ కైవసం * రెండో మ్యాచ్‌లో 27 పరుగులతో ఓడిన ఫించ్‌సేన మెల్బోర్న్: దుమ్మురేపే బ్యాటింగ్... కళ్లు చెదిరే క్యాచ్‌లు... మెరుపు ఫీల్డింగ్... బౌలర్ల రాణింపు... ప్రతీకారేచ్ఛతో రెచ్చిపోయిన భారత జట్టు ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టి20లో చేసిన సమష్టిపోరాటం ఇది. ఏమాత్రం అలసత్వం చూపకుండా... ఏ అవకాశాన్ని వదలకుండా... అదరహో అన్న రీతిలో ఆడుతూ కంగారూల గడ్డపై తొలి ద్వైపాక్షిక సిరీస్‌ను గెలిచి కొత్త అధ్యాయాన్ని లిఖించింది. శుక్రవారం ఎంసీజీలో జరిగిన రెండో టి20లోనూ 27 పరుగుల తేడాతో ఫించ్‌సేనపై నెగ్గిన ధోని బృందం... మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో టి20 సిరీస్‌ను కైవసం చేసుకుని ఈ ఘనత అందుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 184 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (47 బంతుల్లో 60; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), విరాట్ కోహ్లి (33 బంతుల్లో 59 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్స్) ఫామ్‌ను కొనసాగించగా, శిఖర్ ధావన్ (32 బంతుల్లో 42; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరిశాడు. తర్వాత ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 8 వికెట్లకు 157 పరుగులకే పరిమితమైంది. ఫించ్ (48 బంతుల్లో 74; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) ఒంటరిపోరాటం చేశాడు. కోహ్లికి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఇరుజట్ల మధ్య ఆఖరి టి20 ఆదివారం సిడ్నీలో జరుగుతుంది. సూపర్ భాగస్వామ్యం: తొలి మూడు ఓవర్లలో 12 పరుగులు మాత్రమే చేసిన రోహిత్, ధావన్ ఆ తర్వాత చెలరేగిపోయారు. బంతి ఎలాంటిదైనా బౌండరీ దాటించడంతో స్కోరు బోర్డు కదం తొక్కింది. ఏడో ఓవర్లో ఫాల్క్‌నర్ సంధించిన బౌన్సర్‌ను ధావన్ సిక్సర్‌గా మల్చడం అతని బ్యాటింగ్‌కే హైలైట్. లయోన్, మ్యాక్స్‌వెల్‌లకు రోహిత్ సిక్సర్ల రుచి చూపెట్టాడు. ఆరు ఓవర్లలో 50 పరుగులు చేసిన భారత్... 11.2 ఓవర్లలో 100 పరుగులను అందుకుంది. తొలి వికెట్‌కు 97 పరుగులు జత చేశాక ధావన్ రివర్స్ స్వీప్‌తో అవుటయ్యాడు. ఈ దశలో వచ్చిన కోహ్లి కూడా ఏమాత్రం తగ్గలేదు. 13వ ఓవర్లో మూడు ఫోర్లు కొట్టి ఊపు తెచ్చాడు. ఓవర్‌కు 9 పరుగుల చొప్పున రాబట్టిన కోహ్లి, రోహిత్ రెండో వికెట్‌కు 46 పరుగులు జత చేశారు. 16వ ఓవర్లో రోహిత్ అవుటయ్యాక క్రీజులోకి వచ్చిన ధోని (14) వేగంగా ఆడాడు. 29 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న కోహ్లితో కలిసి ధోని మూడో వికెట్‌కు 38 పరుగులు జోడించాడు. ఫించ్ పోరాడినా...: లక్ష్యాన్ని ఛేదించేందుకు దిగిన ఆసీస్ ఓపెనర్లు ఫించ్, మార్ష్ (23) మెరుపు ఆరంభాన్నిచ్చారు. బౌండరీల వర్షం కురిపించడంతో రన్‌రేట్ దూసుకుపోయింది. దీనికి తోడు 9, 10 ఓవర్లలో ఫించ్ ఇచ్చిన మూడు క్యాచ్‌లను ఉమేశ్, రిషి ధావన్, శిఖర్ ధావన్‌లు జారవిడిచారు. అయితే 10వ ఓవర్లో మార్ష్ ఇచ్చిన క్యాచ్‌ను లాంగాన్‌లో పాండ్యా చక్కగా అందుకోవడం, ఆ వెంటనే తన బౌలింగ్‌లో లిన్ (2)ను వెనక్కిపంపడంతో భారత్ ఊపిరి పీల్చుకుంది. ఫించ్, మార్ష్‌లు తొలి వికెట్‌కు 9.5 ఓవర్లలో 94 పరుగులు జోడించారు. 12వ ఓవర్లో ‘డేంజర్ మ్యాన్’ మ్యాక్స్‌వెల్ (1)ను ధోని స్టంప్ చేశాడు. తర్వాత ఫించ్‌తో జత కలిసిన వాట్సన్ (15) నిలకడగా ఆడే ప్రయత్నం చేసినా జడేజా కుదురుకోనీయలేదు. 15వ ఓవర్లో కళ్లు చెదిరే రీతిలో రిటర్న్ క్యాచ్ తీసుకోవడంతో ఆసీస్ స్కోరు 124/4గా మారింది. తర్వాతి ఓవర్లో ఎక్స్ట్రా కవర్ నుంచి జడేజా విసిరిన బంతికి ఫించ్ రనౌట్ కావడంతో కంగారులు కుదేలయ్యారు. విజయానికి 61 పరుగులు చేయాల్సిన దశలో జడేజా మరోసారి మ్యాజిక్ చూపెట్టాడు. 17వ ఓవర్లో ఫాల్క్‌నర్‌ను అవుట్ చేస్తే... చివరి ఓవర్లో బుమ్రా యార్కర్లతో హాస్టింగ్స్ (4), టై (4)లను వెనక్కి పంపి చిరస్మరణీయ విజయాన్ని పూర్తి చేశాడు. 1 ఆసీస్ గడ్డపై ద్వైపాక్షిక సిరీస్ గెలవడం భారత్‌కు ఇదే మొదటిసారి. అంతకుముందు 2007-08లో ముక్కోణపు సిరీస్, 1985లో బెన్సన్ అండ్ హెడ్జెస్ వరల్డ్ చాంపియన్‌షిప్‌ను గెలిచారు. స్కోరు వివరాలు:- భారత్ ఇన్నింగ్స్: రోహిత్ శర్మ రనౌట్ 60; ధావన్ (సి) లిన్ (బి) మ్యాక్స్‌వెల్ 42; కోహ్లి నాటౌట్ 59; ధోని (సి) వాట్సన్ (బి) టై 14; రైనా నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు: 9; మొత్తం: (20 ఓవర్లలో 3 వికెట్లకు) 184. వికెట్ల పతనం: 1-97; 2-143; 3-181. బౌలింగ్: వాట్సన్ 3-0-17-0; హాస్టింగ్ 3-0-35-0; బోలాండ్ 4-0-30-0; ఫాల్క్‌నర్ 3-0-35-0; టై 4-0-28-1; లయోన్ 1-0-15-0; మ్యాక్స్‌వెల్ 2-0-17-1. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: ఫించ్ రనౌట్ 74; మార్ష్ (సి) హార్డిక్ పాండ్యా (బి) అశ్విన్ 23; లిన్ (సి) ధోని (బి) హార్డిక్ పాండ్యా 2; మ్యాక్స్‌వెల్ (స్టంప్) ధోని (బి) యువరాజ్ 1; వాట్సన్ (సి అండ్ బి) జడేజా 15; వేడ్ నాటౌట్ 16; ఫాల్క్‌నర్ (స్టంప్) ధోని (బి) జడేజా 10; హాస్టింగ్స్ (బి) బుమ్రా 4; టై (బి) బుమ్రా 4; ఎక్స్‌ట్రాలు: 8; మొత్తం: (20 ఓవర్లలో 8 వికెట్లకు) 157. వికెట్ల పతనం: 1-94; 2-99; 3-101; 4-121; 5-124; 6-137; 7-152; 8-157. బౌలింగ్: నెహ్రా 4-0-34-0; బుమ్రా 4-0-37-2; జడేజా 4-0-32-2; అశ్విన్ 4-0-27-1; హార్డిక్ పాండ్యా 2-0-17-1; యువరాజ్ 2-0-7-1. -
జోరు కొనసాగించాలి..!
♦ సిరీస్ విజయంపై భారత్ గురి ♦ ఆత్మవిశ్వాసంతో ధోని సేన ♦ ఆసీస్‌తో నేడు రెండో టి20 ♦ వార్నర్, స్మిత్‌లకు విశ్రాంతి టి20 ప్రపంచకప్‌కు సన్నాహకంలా మొదలైన ఆస్ట్రేలియా టి20 సిరీస్‌లో భారత్‌కు ఆశించిన ఆరంభమే లభించింది. వన్డేల్లో చిత్తుగా ఓడిన ధోని సేన టి20 సిరీస్‌ను దక్కించుకోవాలని పట్టుదలగా ఉంది. గత మ్యాచ్‌లో జట్టు ఆత్మ విశ్వాసం మరింత పెరిగింది. మరో వైపు తొలి మ్యాచ్ ఓడిన ఆసీస్ కీలక ఆటగాళ్లు దూరం కావడంతో మరింత ఒత్తిడిలో పడింది. ఈ నేపథ్యంలో ఇరు జట్లు తర్వాతి పోరుకు సిద్ధమయ్యాయి. మెల్బోర్న్: భారత్, ఆస్ట్రేలియా రెండో టి20 మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. నేడు (శుక్రవారం) ఎంసీజీలో జరిగే మ్యాచ్‌లో ఇరు జట్లు తలపడనున్నాయి. తొలి మ్యాచ్‌లో విజయం సాధించిన భారత్ సిరీస్‌లో 1-0తో ముందంజలో ఉంది. ఈ మ్యాచ్ గెలిస్తే ఆసీస్ గడ్డపై టి20 సిరీస్ సొంతం చేసుకొని సంతృప్తిగా స్వదేశం వెళ్లవచ్చు. సిరీస్ కోల్పోకుండా ఉండేందుకు ఆస్ట్రేలియాకు ఈ మ్యాచ్ చావో రేవోగా మారింది. యువీకి అవకాశం దక్కేనా! గత మ్యాచ్‌లో ఘన విజయం అందించిన జట్టునే ఈ సారి కూడా భారత టీమ్ మేనేజ్మెంట్ కొనసాగించవచ్చు. బ్యాటింగ్‌లో కోహ్లి సూపర్ ఫామ్‌లో ఉండగా, రోహిత్ తనదైన శైలిలో చెలరేగుతున్నాడు. రైనా ఆకట్టుకోగా, ధావన్ ఎప్పుడైనా చెలరేగిపోగలడు. కానీ ప్రస్తుతం భారత్‌కు సంబంధించి కీలక అంశం యువరాజ్ సింగ్ బ్యాటింగ్. ఎప్పుడో రెండేళ్ల క్రితం ఆఖరిసారిగా అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన అతను, దేశవాళీ ఫామ్‌తో ఎట్టకేలకు పునరాగమనం చేశాడు. అయితే తగిన ప్రాక్టీస్ లేదంటూ ధోని అతడికి బ్యాటింగ్ అవకాశమే ఇవ్వలేదు. ఈ మ్యాచ్‌లోనైనా యువీ ఎక్కువ ఓవర్లు ఆడగలిగితే ప్రపంచ కప్ ప్రణాళికలు సిద్ధం చేయడం సులువవుతుంది. బౌలింగ్‌లో నెహ్రా, అశ్విన్, జడేజా రాణించగా, తొలి మ్యాచ్ ఆడిన బుమ్రా ఆకట్టుకున్నాడు. మరో కొత్త కుర్రాడు హార్దిక్ పాండ్యా ఎక్కువ పరుగులిచ్చినా మరో చాన్స్ ఖాయం. అవసరమైతే ఈ మ్యాచ్‌లో అతని బ్యాటింగ్ సామర్ధ్యం కూడా పరీక్షించవచ్చు. మొత్తంగా చూస్తే భారత్ ఈ ఫార్మాట్లో పటిష్టంగా కనిపిస్తోంది. మ్యాక్స్‌వెల్‌కు చోటు! సిరీస్ కోల్పోయే ప్రమాదం ఉన్నా...ఆస్ట్రేలియా మేనేజ్మెంట్ టీమ్ ఎంపిక విషయంలో తాము ముందు గా అనుకున్న ప్రణాళికకే కట్టుబడింది. న్యూజిలాం డ్ తో సిరీస్‌కు సన్నద్ధమయ్యేందుకు ముందే వెళుతున్న వార్నర్, స్మిత్ ఈ మ్యాచ్‌కు దూరమయ్యారు. గా యం కారణంగా గత మ్యాచ్ ఆడని మ్యాక్స్‌వెల్ తిరిగి వస్తున్నాడు. మరో బ్యాట్స్‌మన్‌గా షాన్మార్ష్కు చోటు దక్కవచ్చు. తొలి మ్యాచ్‌లో టాప్‌స్కోరర్‌గా ని లిచిన కెప్టెన్ ఫించ్‌పై బాధ్యత మరింత పెరిగింది. లిన్, హెడ్లతో పాటు తమ ఆల్‌రౌండర్లు వాట్సన్, ఫాల్క్‌నర్ ఈ సారైనా చెలరేగాలని జట్టు కోరుకుం టోంది. తొలి టి20లో ముగ్గురు ప్రధాన బౌలర్లు 10 కంటే ఎక్కువ ఎకానమీతో పరుగులు ఇచ్చారు. సీని యర్ టెయిట్కు మరో అవకాశం ఇచ్చి, బాయ్స్ స్థా నంలో ఆఫ్‌స్పిన్నర్ లయోన్ను ప్రయత్నించవచ్చు. జట్ల వివరాలు (అంచనా): భారత్: ధోని (కెప్టెన్), రోహిత్, ధావన్, కోహ్లి, రైనా, యువరాజ్, జడేజా, అశ్విన్, పాండ్యా, బుమ్రా, నెహ్రా ఆస్ట్రేలియా: ఫించ్ (కెప్టెన్), షాన్ మార్ష్, వాట్సన్, లిన్, మ్యాక్స్‌వెల్, హెడ్, వేడ్, ఫాల్క్‌నర్, టెయిట్, రిచర్డ్సన్/హేస్టింగ్స్, బాయ్స్/లయోన్. పిచ్, వాతావరణం మెల్బోర్న్ ఇటీవల పూర్తిగా బ్యాటింగ్ పిచ్‌గా మారింది. భారత్, ఆసీస్ మధ్య జరిగిన వన్డేతో పాటు బిగ్‌బాష్‌లోనూ భారీగా పరుగులు వచ్చాయి. కాబట్టి ఈసారి కూడా అదే జరగొచ్చు. చిరుజల్లులు పడే అవకాశం ఉంది. మహిళల మ్యాచ్ కూడా... మరో వైపు భారత్, ఆస్ట్రేలియా మహిళల జట్ల మధ్య కూడా నేడు రెండో టి20 మ్యాచ్ జరగనుంది. తొలి మ్యాచ్‌లో గెలిచిన భారత్ సిరీస్‌లో 1-0తో ముందంజలో ఉంది. అనూహ్యంగా ఓడిన ఆసీస్ ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది. ఉ. గం. 9నుంచి స్టార్ స్పోర్ట్స్1లో ప్రత్యక్ష ప్రసారం -
భారత్ తో టి20 సిరీస్ కు శ్రీలంక జట్టు
కొలంబో: భారత్‌తో జరిగే టి20 సిరీస్ కోసం శ్రీలంక 15 మంది ఆటగాళ్లతో కూడిన జట్టును ప్రకటించింది. వచ్చే నెల 9 నుంచి 14 వరకు భారత్‌లో జరిగే సిరీస్‌కు చండిమాల్ లంకకు సారథ్యం వహిస్తాడు. మలింగ గాయంతో బాధపడుతుండడంతో దిల్హార ఫెర్నాండో జట్టులోకి వచ్చాడు. తొలి మ్యాచ్ 9న పుణేలో, రెండో మ్యాచ్ 12న ఢిల్లీలో, చివరి మ్యాచ్ 14న విశాఖలో జరుగుతాయి. గాయం కారణంగా మాథ్యూస్ కూడా ఈ సిరీస్‌లో ఆడటం లేదు. శ్రీలంక జట్టు: చండిమాల్ (కెప్టెన్), దిల్షాన్, ప్రసన్న, సిరివర్ధన, గుణతిలక, పెరీరా, షనక, గుణరత్నే, కపుగెడెర, చమీర, ఫెర్నాండో, రజిత, బినుర ఫెర్నాండో, సేనానాయకే, వాండర్సే. -
దూకుడుగా ఆడాల్సి ఉంది: రైనా
టి20 సిరీస్‌లో దూకుడైన ఆటతీరుతోనే ఆస్ట్రేలియాపై ఆధిపత్యం ప్రదర్శిస్తామని భారత బ్యాట్స్‌మన్ సురేశ్ రైనా వ్యాఖ్యానించాడు. ప్రత్యర్థితో పోలిస్తే తమ జట్టులో మంచి అనుభవం ఉందని, దేశవాళీ క్రికెట్ కారణంగా తనకు కూడా తగినంత మ్యాచ్ ప్రాక్టీస్ లభించిందని అతను అన్నాడు. ఆస్ట్రేలియా మైదానాల్లో బౌండరీలు అంత సులభంగా రావు కాబట్టి సింగిల్స్‌పై దృష్టి పెట్టాలన్న రైనా, ఫీల్డింగ్ కూడా మ్యాచ్ ఫలితాన్ని నిర్దేశిస్తుందన్నాడు. -
ఒక్క బంతీ పడలేదు..!
వర్షంతో మూడో టి20 రద్దు సిరీస్ 2-0తో దక్షిణాఫ్రికా సొంతం ఆదివారం తొలి వన్డే కోల్‌కతా: టి20 సిరీస్‌ను ఇప్పటికే కోల్పోయినా... చివరి మ్యాచ్‌లో నెగ్గి కాస్త పరువు దక్కించుకుందామని భావించిన భారత్‌కు ఆశాభంగం కలిగింది. దక్షిణాఫ్రికాతో గురువారం ఇక్కడ జరగాల్సిన మూడో టి20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. వర్షం కొద్దిసేపే పడినా... అవుట్ ఫీల్డ్ అనుకూలంగా లేకపోవడంతో ఆట సాధ్యం కాలేదు. గ్రౌండ్ సిబ్బంది ఎంత ప్రయత్నించినా బౌండరీ సమీపంలో మైదానం చిత్తడిగానే ఉండిపోయింది. అంపైర్లు గంటకు ఒక సారి చొప్పున మొత్తం మూడు సార్లు మైదానాన్ని పరీక్షించారు. చివరకు 9.30 గంటలకు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఫలితంగా టాస్ వేయకుండా, ఒక్క బంతి కూడా పడకుండానే కోల్‌కతా మ్యాచ్ కథ ముగిసిపోయింది. దీంతో 2-0తో టి20 సిరీస్ దక్షిణాఫ్రికా ఖాతాలో చేరింది. జేపీ డుమినికి ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు దక్కింది. సిరీస్ కోల్పోయి ఐసీసీ ర్యాంకింగ్స్‌లో భారత్ నాలుగునుంచి ఆరో స్థానానికి పడిపోగా, దక్షిణాఫ్రికా ఐదో స్థానానికి చేరింది. ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య ఆదివారం కాన్పూర్‌లో తొలి మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో రహానేతో ఓపెనింగ్ చేయించాలని, రైనాను మూడో స్థానంలో పంపాలని... మిశ్రా, బిన్నీలను ఆడించాలని కూడా నిర్ణయించాం. అయితే అది సాధ్యం కాలేదు. ఇలాంటి వేదికకు వచ్చి మ్యాచ్ ఆడకపోవడం అసంతృప్తి కలిగించింది. ఇక్కడి అవుట్ ఫీల్డ్ చాలా మారాల్సి ఉంది. వన్డేల్లోనూ మంచు ప్రభావం ఉంటుంది కాబట్టి టాస్ కీలకమే. సొంతగడ్డపై సిరీస్ కాబట్టి పిచ్‌లపై పచ్చిక ఉండాలని కోరుకోవడం లేదు. -ధోని, భారత కెప్టెన్ మ్యాచ్ సాధ్యం కాకపోవడంతో నిరాశ చెందాం. అయితే ఇలాంటి సుదీర్ఘ పర్యటనంలో ఆటగాళ్లు గాయాల పాలు కాకుండా ఉండటం కూడా ముఖ్యం. భారత్‌లో సిరీస్ గెలవడం అంత సులువు కాదు. మా నలుగురు పేసర్లు కూడా బాగా ఆడారు. ఈ విజయం వన్డేల్లో మా ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది - డు ప్లెసిస్, దక్షిణాఫ్రికా కెప్టెన్ -
పరువు దక్కేనా!
►నేడు చివరి టి20 మ్యాచ్ ► తీవ్ర ఒత్తిడిలో భారత్ ► ధోని కెప్టెన్సీకి పరీక్ష ► క్లీన్‌స్వీప్‌పై దక్షిణాఫ్రికా గురి సొంతగడ్డపై మొనగాళ్ల ముద్రతో బరిలోకి దిగిన భారత బృందం ఇప్పటికే ప్రత్యర్థి ముందు తలవంచింది. పొట్టి ఫార్మాట్లో అపరిమిత అనుభవం ఉన్నా భారత్‌లో తొలిసారి జరిగిన పూర్తి స్థాయి టి20 సిరీస్‌లో అది అక్కరకు రాకపోవడంతో పరాజయం దక్కింది. ఇక మిగిలింది కాస్త పరువు నిలబెట్టుకోవడమే. తుది జట్టులో మార్పులు చేస్తారా, మూడో స్పిన్నర్‌ను మారుస్తారా... ఏం చేసినా ఒక విజయమైతే కావాలి. ఆటగాళ్లతో పాటు కెప్టెన్ కూడా తీవ్ర ఒత్తిడిలో కనిపిస్తున్న స్థితిలో మన జట్టు ఈ పోరులో సఫారీల జోరును ఆపాలంటే రెట్టింపు శ్రమించాల్సి ఉంది. కోల్‌కతా: కెప్టెన్‌గా భారత్‌కు అత్యుత్తమ విజయాలు అందించిన మహేంద్ర సింగ్ ధోని ఈ ఏడాదిలో రెండోసారి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాడు. ఇటీవలే అనూహ్యంగా బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్ ఓటమి అనంతరం ఇప్పుడు స్వదేశంలో టి20 సిరీస్ పోయింది. కనీసం టి20 ప్రపంచకప్ వరకు కొనసాగాలని పట్టుదలగా ఉన్న ధోని ఆట, నాయకత్వంపై ఇప్పుడు ప్రతీ మ్యాచ్ తర్వాత ‘పోస్ట్‌మార్టం’ జరిగే అవకాశం కనిపిస్తోంది. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు ముందు జట్టులో ఆత్మవిశ్వాసం నింపాలంటే గెలుపు తప్పనిసరి. మరోవైపు సిరీస్ గెలిచిన ఉత్సాహంలో ఉన్న దక్షిణాఫ్రికా క్లీన్‌స్వీప్‌పై కన్నేసింది. ఈ నేపథ్యంలో నేడు (గురువారం) ఇక్కడి ఈడెన్ గార్డెన్స్ మైదానంలో ఇరు జట్ల మధ్య సిరీస్‌లో చివరిదైన మూడో టి20 మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. అమిత్ మిశ్రాకు చోటు?: తొలి మ్యాచ్‌లో బౌలింగ్ వైఫల్యం, రెండో మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో తడబాటు... మరి మూడో మ్యాచ్‌లో భారత తుది జట్టు ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరం. రెండు మ్యాచ్‌లలోనూ విఫలమైన ఓపెనర్ ధావన్ చెలరేగాల్సి ఉంది. రైనా మెరుపులు కూడా ఇంకా కనిపించలేదు. రోహిత్, కోహ్లిలు చెలరేగితే భారీ స్కోరుకు ఆశలుంటాయి. అన్నింటికి మించి కెప్టెన్ ధోని బ్యాటింగ్ చాలా మెరుగవ్వాల్సి ఉంది. ఒకప్పుడు ఇన్నింగ్స్ చివర్లో ధనాధన్ షాట్లతో రెచ్చిపోయే ధోనిలో ఇప్పుడు ఆ దూకుడు కనిపించడం లేదు. పరిస్థితి ఎలా ఉన్నా తన తరహాలో షాట్లు ఆడటమే సరైందని, అతి జాగ్రత్తకు పోనని ఇప్పటికే ప్రకటించిన ధోని ఈ మ్యాచ్‌లోనైనా సత్తా చాటితే జట్టుకు ఉపయోగం. రెండు డకౌట్లు తన ఖాతాలో వేసుకున్న అంబటి రాయుడు స్థానంలో అజింక్య రహానేకు అవకాశం దక్కవచ్చు. పేస్ బౌలింగ్‌లో జట్టుకు పెద్దగా ప్రత్యామ్నాయాలు అందుబాటులో లేవు. స్పిన్‌లో అశ్విన్ ఒక్కడే చెలరేగుతున్నాడు. లెగ్‌స్పిన్నర్ అమిత్ మిశ్రా ఈసారి ఆడే అవకాశం కనిపిస్తోంది. పెద్దగా ఆకట్టుకోని అక్షర్ పటేల్ స్థానంలో లేదా హర్భజన్‌ను తప్పించి మిశ్రాను తీసుకునే అవకాశాలు ఉన్నాయి. మార్పులకు అవకాశం...: మరోవైపు దక్షిణాఫ్రికా సిరీస్ సొంతం చేసుకున్న నేపథ్యంలో తమ జట్టులోని మరి కొందరు కొత్త కుర్రాళ్లను పరీక్షించాలని భావిస్తోంది. వచ్చే ఏడాది ఇక్కడే టి20 ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో లెగ్‌స్పిన్నర్ ఎడీ లీకి అవకాశం దక్కవచ్చు. సుదీర్ఘ పర్యటన ముందుండటంతో ఆమ్లాకు విశ్రాంతినిచ్చి ఓపెనర్ క్వింటన్ డి కాక్‌ను కూడా ఆడించే అవకాశం ఉంది. ప్రధాన ఆటగాళ్లంతా ఫామ్‌లో ఉండటం కూడా దక్షిణాఫ్రికా జట్టు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతోంది. డివిలియర్స్, డు ప్లెసిస్, డుమిని, డేవిడ్ మిల్లర్లతో జట్టు బ్యాటింగ్ బలంగా ఉంది. సుదీర్ఘ విరామం తర్వాత జట్టులోకి వచ్చిన ఆల్‌రౌండర్ ఆల్బీ మోర్కెల్ గత మ్యాచ్‌లో బౌలింగ్‌లో సత్తా చాటాడు. అతని బ్యాటింగ్ కూడా జట్టుకు అదనపు బలం. ఇక పేసర్లు అబాట్, రబడ చక్కగా రాణించారు. ఐపీఎల్లో కోల్‌కతా నైట్‌రైడర్స్ తరఫున రాణించిన డి లాంజ్‌కు మరో మ్యాచ్ అవకాశం ఇవ్వాలనుకుంటే రబడ స్థానంలో చోటు దక్కుతుంది. అనుభవం లేకపోయినా టి20 ఫార్మాట్‌కు సరిగ్గా సరిపోయే ఆటగాళ్లతో ఇక్కడికి వచ్చి ఫలితం సాధించి సఫారీలు మరో విజయమే లక్ష్యంగా పెట్టుకున్నారు. జట్ల వివరాలు (అంచనా) భారత్: ధోని (కెప్టెన్), రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లి, సురేశ్ రైనా, అంబటి రాయుడు/అజింక్య రహానే, హర్భజన్ సింగ్, అశ్విన్, భువనేశ్వర్, మోహిత్ శర్మ, అక్షర్/మిశ్రా. దక్షిణాఫ్రికా: డు ప్లెసిస్ (కెప్టెన్), డివిలియర్స్, డి కాక్, డుమిని, ఫర్హాన్ బెహర్దీన్, డేవిడ్ మిల్లర్, ఆల్బీ మోర్కెల్, మోరిస్, అబాట్, రబడ/లాంజ్, తాహిర్/ఎడీ లీ. పిచ్, వాతావరణం బ్యాటింగ్‌కు అనుకూల పిచ్ అని క్యురేటర్ ప్రకటించారు. అయితే ఈడెన్‌లో ఎప్పటిలాగే స్పిన్నర్లు కూడా ప్రభావం చూపవచ్చు. 31 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత ఉంటుంది. వర్షం పడే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. మ్యాచ్ రాత్రి గం. 7.00 నుంచి స్టార్ స్పోర్ట్స్-1, డీడీలో ప్రత్యక్ష ప్రసారం ఇక్కడి మైదానంలో బౌండరీ చిన్నది కాబట్టి రెండు పరుగులు రావడం కష్టం. సింగిల్పైనే అందరి దృష్టి ఉంటుంది. ఈ క్రమంలో రనౌట్‌కు అవకాశం ఎక్కువ. గత మ్యాచ్‌లలాగే మా ఫీల్డింగ్‌తో బ్యాట్స్‌మెన్‌పై మరింత ఒత్తిడి పెంచుతాం. సిరీస్‌కు మేం బాగా సన్నద్ధమయ్యాం. గెలవడం సంతోషాన్నిచ్చింది. స్కోరును 3-0 చేయాలని పట్టుదలగా ఉన్నాం. ఐపీఎల్ మా అందరికీ ఎంతో మేలు చేసింది. ఆ అనుభవం ఇక్కడ పనికొస్తోంది.’ -మిల్లర్, దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్ ఈడెన్‌తో నా అనుబంధం ప్రత్యేకం. ఎన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయి. ఇక్కడే ఆఖరి టెస్టు ఆడి రిటైర్ అవ్వాలనేది నా కోరిక. దాల్మియా లేకపోవడమే ఈ మ్యాచ్‌లో లోటు. సిరీస్ ఓడినా ఈ మ్యాచ్ మేం గెలవగల సత్తా జట్టుకు ఉంది. ఈ ఫలితం తర్వాత పర్యటన దిశ మారిపోవచ్చు కూడా. మంచి ఆరంభం లభిస్తే చాలు. ఈ ఫార్మాట్లో మనోళ్లు అత్యుత్తమ ఆటగాళ్లని చెప్పగలను. వచ్చే టి20 ప్రపంచకప్‌లో స్పిన్నర్లదే కీలక పాత్ర అవుతుంది. తుది జట్టులో ఎవరున్నా విజయం కోసం వంద శాతం శ్రమించడమే అందరికీ తెలుసు.’ -హర్భజన్ సింగ్, భారత బౌలర్ -
పాకిస్తాన్‌దే టి20 సిరీస్
రెండో మ్యాచ్‌లోనూ జింబాబ్వేపై విజయం హరారే: జింబాబ్వేతో 2 మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను పాకిస్తాన్ చేజిక్కించుకుంది. ఆదివారం తొలి టి20లో నెగ్గిన పాక్, మంగళవారం జరిగిన రెండో మ్యాచ్‌లో 15 పరుగుల తేడాతో జింబాబ్వేను ఓడించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పాక్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 136 పరుగులు చేసింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ ఉమర్ అక్మల్ (28 బంతుల్లో 38 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) టాప్‌స్కోరర్‌గా నిల వగా, మఖ్సూద్ (25 బంతుల్లో 26; 3 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. జాంగ్వే, పన్యగారా చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం జింబాబ్వే 20 ఓవర్లలో 7 వికెట్లకు 121 పరుగులు మాత్రమే చేయగలిగింది. సీన్ విలియమ్స్ (36 బంతుల్లో 40 నాటౌట్; 4 ఫోర్లు), సికందర్ రజా (36 బంతుల్లో 36; 1 ఫోర్) ఐదో వికెట్‌కు 60 పరుగులు జోడించినా జట్టును గెలిపించలేకపోయారు. ఇర్ఫాన్, ఇమ్రాన్ చెరో 2 వికెట్లు తీశారు. ఇమాద్ వసీంకు ‘మ్యాన్ ఆఫ్ ద సిరీ స్’ అవార్డు దక్కింది. -
రైనాపైనే అందరి దృష్టి
♦ నేడు భారత్, బంగ్లాదేశ్ ‘ఎ’ జట్ల మ్యాచ్ ♦ యువ క్రికెటర్లకు చక్కని అవకాశం బెంగళూరు : కీలకమైన దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు ముందు బ్యాటింగ్ ప్రాక్టీస్ కోరుకుంటున్న సురేశ్ రైనాకు మంచి అవకాశం వచ్చింది. మూడు వన్డేల్లో భాగంగా నేడు (బుధవారం) బంగ్లాదేశ్ ‘ఎ’తో జరగనున్న తొలి వన్డేలో భారత్ ‘ఎ’ తలపడనుంది. దీంతో గత మూడు నెలలుగా ఆటకు దూరంగా ఉన్న రైనా... ఈ సిరీస్‌తో ఫామ్‌లోకి రావాలని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాడు. ఫలితంగా ప్రస్తుతం అందరి దృష్టి రైనాపైనే నెలకొంది. చివరిసారిగా బంగ్లాదేశ్ టూర్లో ఆడిన రైనా అనుకున్న స్థాయిలో రాణించలేకపోయాడు. ఇప్పుడు బంగ్లా బౌలర్లు తస్కిన్ అహ్మద్, అమిన్ హుస్సేన్, రూబెల్ హుస్సేన్‌లాంటి నాణ్యమైన పేసర్లను ఎదుర్కొంటే ప్రొటీస్‌పై తిరుగుండదనే భావనతో ఈ యూపీ బ్యాట్స్‌మన్ ఉన్నాడు. జాతీయ జట్టులో చోటును పదిలం చేసుకునేందుకు కరుణ్ నాయర్, కేదార్ జాదవ్, మనీష్ పాండే, ధవల్ కులకర్ణి, కర్ణ్ శర్మలు ఈ సిరీస్‌ను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని చూస్తున్నారు. వచ్చే నెలలో సఫారీ జట్టుతో జరిగే వన్డే, టి20 సిరీస్‌కు సందీప్ పాటిల్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ భారత జట్టును ఎంపిక చేయనుంది. ఈ నేపథ్యంలో కుర్రాళ్లు భారీ స్కోర్లతో సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాలని ప్రయత్నిస్తున్నారు. ఇటీవల ఆస్ట్రేలియా ‘ఎ’తో సిరీస్‌లో రాణించిన ఉన్ముక్త్ చంద్, మయాంక్ అగర్వాల్ కూడా ఈ సిరీస్‌పై భారీ స్థాయిలో ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటి వరకు బ్యాట్స్‌మెన్‌పై ఎక్కువగా దృష్టిపెట్టిన ‘ఎ’ జట్టు కోచ్ రాహుల్ ద్రవిడ్... ఇప్పుడు బౌలింగ్‌ను బలోపేతం చేయడంపై దృష్టిసారించారు. పేసర్లు రుష్ కలారియా, శ్రీనాథ్ అరవింద్, కులకర్ణిలతో పాటు స్పిన్నర్లు కర్ణ్ శర్మ, జయంత్ యాదవ్, కుల్దీప్ యాదవ్‌లను గాడిలో పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు బంగ్లాదేశ్ జట్టు పూర్తిస్థాయిలో బరిలోకి దిగుతోంది. వచ్చే నెలలో వాళ్లకు ఆసీస్‌తో సిరీస్ ఉండటంతో దాదాపుగా సీనియర్లందరూ ఫిట్నెస్ కోసం ఈ సిరీస్‌ను ఉపయోగించుకోనున్నారు. దీంతో భారత కుర్రాళ్లు అప్రమత్తంగా లేకపోతే సిరీస్ చేజారే ప్రమాదం ఉంది. -
సిరీస్ సమం
రెండో టి20లో కివీస్ విజయం సెంచూరియన్ : దక్షిణాఫ్రికాతో జరిగిన రెండు టి20ల సిరీస్‌ను న్యూజిలాండ్ జట్టు 1-1తో సమం చేసుకుంది. ఆదివారం సూపర్ స్పోర్ట్ పార్క్‌లో జరిగిన చివరి మ్యాచ్‌లో కివీస్ 32 పరుగులతో నెగ్గింది. తొలి మ్యాచ్‌లో సఫారీలు గెలిచారు. 19 నుంచి ఇరు జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ జరుగుతుంది. టాస్ నెగ్గి బ్యాటింగ్‌కు దిగిన ఆతిథ్య జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లకు 177 పరుగులు చేసింది. ఓపెనర్ గప్టిల్ (35 బంతుల్లో 60; 6 ఫోర్లు; 3 సిక్సర్లు), నీషమ్ (19 బంతుల్లో 28; 3 ఫోర్లు; 1 సిక్స్), విలియమ్సన్ (17 బంతుల్లో 25; 4 ఫోర్లు; 1 సిక్స్) వేగంగా ఆడి రాణించారు. రబడకు మూడు వికెట్లు దక్కాయి. అనంతరం లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన ప్రోటీస్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడింది. చివరకు 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 145 పరుగులు చేసి ఓడింది. బెహర్డీన్ (27 బంతుల్లో 36; 3 ఫోర్లు; 1 సిక్స్), మిల్లర్ (20 బంతుల్లో 29; 2 ఫోర్లు; 1 సిక్స్) ఓ మాదిరిగా ఆడారు. నాథన్ మెకల్లమ్, మెక్లెనెగాన్, సోధిలకు రెండేసి వికెట్లు దక్కాయి. -
భారత్‌కు ఊరట విజయం
బెంగళూరు : ఇప్పటికే మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను చేజార్చుకున్న భారత మహిళల జట్టు... న్యూజిలాండ్‌తో జరిగిన ఆఖరి మ్యా చ్లో 3 వికెట్ల తేడాతో గెలిచి కాస్త ఊరట చెందింది. బుధవారం చిన్నస్వామి స్టేడియం లో జరిగిన ఈ మ్యాచ్‌లో... ముందుగా న్యూజిలాండ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 126 పరుగులు చేసింది. బేట్స్ (27 బంతుల్లో 34; 5 ఫోర్లు) మెరుగ్గా ఆడగా, డివైన్ (13 బంతుల్లో 18; 1 ఫోర్, 2 సిక్సర్లు), బ్రాడ్మోర్ (18 బంతుల్లో 15 నాటౌట్; 1 ఫోర్) ఫర్వాలేదనిపించారు. రాజేశ్వరి గైక్వాడ్ 3 వికెట్లు తీసింది. తర్వాత భారత్ 19 ఓవర్లలో 7 వికెట్లకు 128 పరుగులు చేసి నెగ్గింది. వేదా కృష్ణమూర్తి (19 బంతుల్లో 34; 6 ఫోర్లు) టాప్ స్కోరర్. వనిత (22 బంతుల్లో 28; 4 ఫోర్లు, 1సిక్స్), అనుజా పాటిల్ (23 బంతుల్లో 22; 3 ఫోర్లు), లతికా కుమారి (18 బంతుల్లో 15; 2 ఫోర్లు) రాణించారు. డివైన్, కాస్పరెక్, బ్రాడ్మోర్ తలా రెండు వికెట్లు తీశారు. -
టి-20 సిరీస్ ఓడిన భారత్
బెంగళూరు: న్యూజిలాండ్‌తో మూడు టి-20ల సిరీస్‌లో భారత్ అమ్మాయిలకు వరుసగా రెండో ఓటమి ఎదురైంది. దీంతో భారత్ మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్‌ను 0-2తో కోల్పోయింది. సోమవారం జరిగిన రెండో టి-20లో భారత్ 6 వికెట్లతో తేడాతో కివీస్ చేతిలో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లకు 136 పరుగులు చేసింది. వనిత 41, హర్మన్ ప్రీత్ కౌర్ 30, వేద కృష్ణమూర్తి 29 పరుగులు చేశారు. అనంతరం న్యూజిలాండ్ మరో 13 బంతులు మిగిలుండగా 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సాధించింది. రెచల్ ప్రీస్ట్ (60) హాఫ్ సెంచరీతో రాణించింది. -
దక్షిణాఫ్రికా ‘క్లీన్‌స్వీప్’
- రెండో టి20లోనూ బంగ్లాదేశ్‌పై విజయం మిర్పూర్: బంగ్లాదేశ్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను దక్షిణాఫ్రికా క్లీన్‌స్వీప్ చేసింది. ఆల్‌రౌండ్ నైపుణ్యంతో అదరగొట్టిన సఫారీ జట్టు... మంగళవారం జరిగిన రెండో టి20లో 31 పరుగుల తేడాతో బంగ్లాపై విజయం సాధించింది. షేర్ ఎ బంగ్లా జాతీయ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో... టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 4 వికెట్లకు 169 పరుగులు చేసింది. డికాక్ (31 బంతుల్లో 44; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), డివిలియర్స్ (34 బంతుల్లో 40; 6 ఫోర్లు), మిల్లర్ (28 బంతుల్లో 30 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్), రోసోవ్ (6 బంతుల్లో 19 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్సర్లు) రాణించారు. తర్వాత బంగ్లా 19.2 ఓవర్లలో 138 పరుగులకు ఆలౌటైంది. సౌమ్య సర్కార్ (21 బంతుల్లో 37; 6 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్. అబాట్, లీ, ఫాంగిసో తలా మూడు వికెట్లు తీశారు. -
పాక్‌లో జింబాబ్వే పర్యటన!
కరాచీ : ఆరేళ్ల విరామం తర్వాత పాకిస్తాన్ దేశంలో అంతర్జాతీయ క్రికెట్ నిర్వహణకు దారులు తెరచుకున్నాయి. 2009 మార్చిలో లాహోర్‌లో శ్రీలంక జట్టుపై తీవ్రవాదుల దాడి తర్వాత అన్ని దేశాలు తమ జట్లను పాక్‌లో ఆడించరాదని నిర్ణయించాయి. ఇప్పుడు జింబాబ్వే జట్టు ఆ దేశంలో పర్యటించే అవకాశం ఉంది. ఇటీవల ఇరు బోర్డుల మధ్య చర్చల అనంతరం వన్డే, టి20 సిరీస్‌లు దాదాపుగా ఖరారు అయ్యాయి. దీని ప్రకారం పాక్, జింబాబ్వే మధ్య 3 వన్డేలు, 2 టి20 మ్యాచ్‌లు జరుగుతాయి. ‘మ్యాచ్‌ల వివరాలను ఇప్పటికే జింబాబ్వే బోర్డుకు పంపించాం. వారు కోరినట్లుగా భద్రతా వివరాలు కూడా అందించాం. ఇక అధికారిక అనుమతి రావడమే మిగిలి ఉంది. సిరీస్‌లు జరుగుతాయని ఆశిస్తున్నాం’ అని పాక్ బోర్డు సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. -
మూడో టి-20లో భారత మహిళల ఓటమి
విశాఖపట్నం: భారత మహిళలతో మూడు టి-20ల సిరీస్‌ను శ్రీలంక మహిళల జట్టు 2-1తో కైవసం చేసుకుంది. మంగళవారం ఇక్కడి వైఎస్ రాజశేఖర రెడ్డి క్రికెట్ స్టేడియంలో జరిగిన చివరి, మూడో టి-20లో శ్రీలంక జట్టు ఆరు వికెట్లతో విజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 117 పరుగులు చేసింది. జట్టులో పూనమ్ రౌత్ (38) టాప్ స్కోరర్. రౌత్‌తో పాటు జులాన్ గోస్వామి (37 నాటౌట్), ఏక్తా బిస్త్ (15) మినహా ఇతర బ్యాట్స్‌వుమెన్ రెండంకెల స్కోరు సాధించలేకపోయారు. లక్ష్యఛేదనలో శ్రీలంక నాలుగు వికెట్లు కోల్పోయి మరో ఏడు బంతులు మిగిలుండగా విజయతీరాలకు చేరింది. లంక కెప్టెన్ సిరివర్దనె (46 నాటౌట్) రాణించింది. భారత బౌలర్లలో ఏక్తా బిస్త్ రెండు, సోనియా డబీర్ వికెట్ తీశారు.