ఆసీస్‌దే టి20 సిరీస్ ఆఖరి మ్యాచ్‌లో ఓడిన దక్షిణాఫ్రికా | final match losing to South Africa | Sakshi
Sakshi News home page

ఆసీస్‌దే టి20 సిరీస్ ఆఖరి మ్యాచ్‌లో ఓడిన దక్షిణాఫ్రికా

Published Fri, Mar 11 2016 12:24 AM | Last Updated on Sun, Sep 3 2017 7:26 PM

ఆసీస్‌దే టి20 సిరీస్  ఆఖరి మ్యాచ్‌లో ఓడిన దక్షిణాఫ్రికా

ఆసీస్‌దే టి20 సిరీస్ ఆఖరి మ్యాచ్‌లో ఓడిన దక్షిణాఫ్రికా

కేప్ టౌన్: లక్ష్య ఛేదనలో చెలరేగిన ఆస్ట్రేలియా... దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. కెప్టెన్ స్మిత్ (26 బంతుల్లో 44; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), వాట్సన్ (27 బంతుల్లో 42; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) వీరవిహారం చేయడంతో బుధవారం అర్ధరాత్రి జరిగిన ఆఖరి మ్యాచ్‌లోనూ కంగారులు 6 వికెట్ల తేడాతో సఫారీలపై విజయం సాధించారు. న్యూలాండ్స్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 4 వికెట్లకు 178 పరుగులు చేసింది. హషీమ్ ఆమ్లా (62 బంతుల్లో 97 నాటౌట్; 8 ఫోర్లు, 4 సిక్సర్లు) దుమ్మురేపాడు. కోల్టర్‌నీల్ 2 వికెట్లు తీశాడు. తర్వాత ఆసీస్ 19.2 ఓవర్లలో 4 వికెట్లకు 181 పరుగులు చేసింది.  వార్నర్ (27 బంతుల్లో 33; 3 ఫోర్లు), మ్యాక్స్‌వెల్ (10 బంతుల్లో 19 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement