Watson
-
ఏడుగురు క్రీజులోకి దిగినా..
ముందు చెన్నై, తర్వాత కోల్‌కతా... ఇరు జట్లను బౌలర్లే మలుపు తిప్పారు. కోల్‌కతా భారీస్కోరు చేయకుండా సూపర్‌కింగ్స్ బౌలర్లు అడ్డుకట్ట వేస్తే... లక్ష్యాన్ని ఛేదించకుండా నైట్‌రైడర్స్ బౌలర్లు ఆపేశారు. టి20లంటే బ్యాట్స్‌మెన్ మెరుపులే కాదు... బౌలర్ల మలుపులు కూడా ఉంటాయని, సిక్సర్లే కాదు... అనూహ్య వికెట్లతో కూడా విజయం చేతులు మారుతుందని ఈ మ్యాచ్‌లో బౌలర్లు నిరూపించారు. అబుదాబి: గత మ్యాచ్‌లో కొండంత లక్ష్యాన్ని చెన్నై ఓపెనర్లిద్దరే పిండి... పిండి చేశారు. కానీ ఈ మ్యాచ్‌లో మోస్తరు లక్ష్యాన్ని ఏడుగురు క్రీజులోకి దిగినా ఛేదించలేకపోయారు. కోల్‌కతా బౌలర్లకు తలవంచారు. దీంతో బుధవారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ 10 పరుగుల తేడాతో చెన్నై సూపర్‌కింగ్స్‌పై గెలిచింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్ 20 ఓవర్లలో 167 పరుగులకు ఆలౌటైంది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ రాహుల్ త్రిపాఠి (51 బంతుల్లో 81; 8 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఒంటరి పోరాటం చేశాడు. డ్వేన్ బ్రేవోకు 3 వికెట్లు దక్కాయి. తర్వాత చెన్నై సూపర్‌కింగ్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 157 పరుగులే చేయగలిగింది. వాట్సన్ (40 బంతుల్లో 50; 6 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. చెన్నై జట్టులో పీయూష్ చావ్లా స్థానంలో కరణ్ శర్మను తీసుకోగా... కోల్‌కతా మార్పుల్లేకుండా బరిలోకి దిగింది. అందరు బ్యాట్లెత్తారు... రాహుల్ త్రిపాఠితో ఆట ప్రారంభించిన శుబ్‌మన్ గిల్ (11), వన్‌డౌన్ బ్యాట్స్‌మన్ నితీశ్ రాణా (9), మోర్గాన్ (7), రసెల్ (2), కెప్టెన్ దినేశ్ కార్తీక్ (12) ఇలా స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్ చెన్నై బౌలింగ్‌కు బెంబేలెత్తారు. ఒక్కడు మినహా ఇంకెవరూ పట్టుమని 12 బంతులను మించి ఆడలేకపోయారు. మరోవైపు చెన్నై బౌలర్లలో ఒకే ఒక్క బౌలర్ (దీపక్ చహర్) తప్ప బౌలింగ్‌కు దిగిన ప్రతీ ఒక్కరు ప్రత్యర్థిపై ప్రతాపం చూపినవారే! స్యామ్ కరన్, శార్దుల్ ఠాకూర్, కరణ్ శర్మ తలా 2 వికెట్లు తీసి కోల్‌కతాను కట్టడి చేశారు. బ్రేవో అయితే టెయిలెండర్లు కమలేశ్(0), శివమ్ మావి (0)లను ఖాతానే తెరువనీయలేదు. ఆఖరి ఓవర్లో వాళ్లిద్దరిని ఔట్ చేశాడు. వరుణ్ చక్రవర్తి రనౌట్ కావడంతో బ్రేవో ఇన్నింగ్స్ 20వ ఓవర్లో 3 పరుగులే ఇచ్చాడు. రాణించిన వాట్సన్... ఆరంభంలో వాట్సన్, డుప్లెసిస్ చకాచకా బౌండరీలు బాదేశారు. కానీ ఈ బాదుడుకు అంతలోనే చుక్కెదురైంది. డుప్లెసిస్ (10 బంతుల్లో 17; 3 ఫోర్లు) వేగానికి శివమ్ మావి కళ్లెం వేశాడు. తర్వాత రాయుడు జతకాగా... ఇద్దరు కలిసి ఇన్నింగ్స్‌ను నిలబెట్టేందుకు శ్రమించారు. ఫోర్... లేదంటే ఒకట్రెండు పరుగులతో చెన్నైని నడిపించారు. రెండో వికెట్‌కు 69 పరుగులు జోడించాక రాయుడు (27 బంతుల్లో 30; 3 ఫోర్లు) ఔటయ్యాడు. దీంతో ధోని కాస్త ముందుగా బ్యాటింగ్‌కు దిగాడు. లక్ష్యందిశగా సాగుతున్నట్లు కనిపించిన సూపర్‌కింగ్స్‌ను నరైన్ ఓవర్ కలవరపెట్టింది. మరో ఓవర్ ధారాళంగా పరుగులిచ్చింది. అతని వరుస ఓవర్లు మ్యాచ్ అంచనాలను మార్చేశాయి. చాలా ఆలస్యంగా (ఇన్నింగ్స్ 12వ) బౌలింగ్‌కు దిగిన నరైన్ మొదటి ఓవర్లో 5 పరుగులిచ్చాడు. వాట్సన్ 39 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. తర్వాత కాసేపటికే అతన్ని నరైన్ ఎల్బీడబ్ల్యూ చేయడంతో కోల్‌కతా ఉత్సాహం రెట్టింపైంది. కానీ నరైన్ తర్వాతి ఓవర్‌ను స్యామ్ కరన్ తేలిగ్గా ఆడేశాడు. 6, 4తో కలిపి మొత్తం 14 పరుగులు రావడంతో చెన్నై శిబిరాన్ని ఆశల్లో నిలిపింది. ధోని ఔట్ కాగానే... యువ ఆటగాడు స్యామ్ కరన్ జోరు మీదున్నా... ధోని క్రీజులో ఉన్నా విజయ సమీకరణం అంత సులువుగా ఏమీ లేదు. ఆఖరి 24 బంతుల్లో 44 పరుగులు చేయాల్సిన తరుణంలో ధోని (11) భారీషాట్లపై దృష్టిపెట్టాడు. వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో ఫోర్ కొట్టిన చెన్నై సారథి మరో షాట్‌కు ప్రయత్నించి క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. స్యామ్ (17)ను రసెల్ ఔట్ చేయడంతో చెన్నై లక్ష్యానికి దూరమైంది. చివరి 12 బంతుల్లో 36 పరుగులు చేయాలి. జడేజా (8 బంతుల్లో 21 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్), కేదార్ జాదవ్ (7 నాటౌట్) క్రీజులో ఉండగా... 19వ ఓవర్ వేసిన నరైన్ 10 పరుగులిచ్చాడు. ఇక మిగతా 6 బంతుల్లో 26 పరుగులు ఆ ఇద్దరి వల్లా కాలేదు. రసెల్ చివరి ఓవర్లో జడేజా వరుసగా 6, 4, 4 కొట్టగా 15 పరుగులొచ్చాయి. అతనొక్కడే 81 ఓపెనర్ త్రిపాఠి అత్యంత విలువైన ఇన్నింగ్స్‌తో కోల్‌కతాను ఆదుకున్నాడు. చెన్నై బౌలర్లతో ఆడుకున్నాడు. అన్నీతానై ఇన్నింగ్స్‌ను నడిపించాడు. నైట్‌రైడర్స్ స్కోరు 167. ప్రతీ ఒక్కరు బ్యాటింగ్ చేశారు. ఎక్స్‌ట్రాలు 10 పరుగులు తీసేస్తే సగం కంటే ఎక్కువ స్కోరు రాహుల్ త్రిపాఠిదే! రెండో ఉత్తమం 17 పరుగులు. నరైన్, కమిన్స్ ఆ స్కోరు చేశారు. 81 పరుగులు చేసిన ఓపెనర్ జోరుకు మిగతా బ్యాట్స్‌మెన్ బేజారుకు అసలు ఏమాత్రం పొంతనే లేదు. బౌండరీతో ఇన్నింగ్స్‌కు శ్రీకారం చుట్టిన త్రిపాఠి... దీపక్ చహర్ బౌలింగ్‌లో బౌండరీలతో దూకుడు పెంచాడు. చూడచక్కని సిక్సర్లతో అలరించాడు. దీంతో కోల్‌కతా స్కోరు సగటున 9 పరుగుల రన్‌రేట్‌తో సాగిపోయింది. గిల్, రాణా, నరైన్‌లు ఔటైనా ఈ రన్‌రేట్ మాత్రం తగ్గలేదంటే దానికి కారణం త్రిపాఠినే. 31 బంతుల్లో ఫిఫ్టీ పూర్తిచేసుకున్న ఈ ఓపెనర్ క్రీజులో పాతుకుపోయాడు. ఆఖరిదాకా ఉంటే సెంచరీ చేసే ఊపుమీదున్న త్రిపాఠిని ఎట్టకేలకు బ్రేవో ఔట్ చేశాడు. అతను ఔటయ్యాక 3.1 ఓవర్లు ఆడిన కోల్‌కతా కేవలం 27 పరుగులు చేసి 4 వికెట్లను కోల్పోయింది. స్కోరు వివరాలు కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: రాహుల్ త్రిపాఠి (సి) వాట్సన్ (బి) బ్రేవో 81; గిల్ (సి) ధోని (బి) శార్దుల్ 11; నితీశ్ రాణా (సి) జడేజా (బి) కరణ్ శర్మ 9; నరైన్ (సి) డుప్లెసిస్ (బి) కరణ్ శర్మ 17; మోర్గాన్ (సి) డుప్లెసిస్ (బి) స్యామ్ కరన్ 7; రసెల్ (సి) ధోని (బి) శార్దుల్ 2; కార్తీక్ (సి) శార్దుల్ (బి) స్యామ్ కరన్ 12; కమిన్స్ (నాటౌట్) 17; కమలేశ్ (సి) డుప్లెసిస్ (బి) బ్రేవో 0; శివమ్ మావి (సి) ధోని (బి) బ్రేవో 0; వరుణ్ (రనౌట్) 1; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో ఆలౌట్) 167. వికెట్ల పతనం: 1–37, 2–70, 3–98, 4–114, 5–128, 6–140, 7–162, 8–163, 9–166, 10–167. బౌలింగ్: దీపక్ చహర్ 4–0–47–0, స్యామ్ కరన్ 4–0–26–2, శార్దుల్ 4–0–28–2, కరణ్ శర్మ 4–0–25–2, బ్రేవో 4–0–37–3. చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్: వాట్సన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) నరైన్ 50; డుప్లెసిస్ (సి) కార్తీక్ (బి) శివమ్ మావి 17; రాయుడు (సి) గిల్ (బి) కమలేశ్ 30; ధోని (బి) వరుణ్ 11; స్యామ్ కరన్ (సి) మోర్గాన్ (బి) రసెల్ 17; కేదార్ జాదవ్ (నాటౌట్) 7; రవీంద్ర జడేజా (నాటౌట్) 21; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 157. వికెట్ల పతనం: 1–30, 2–99, 3–101, 4–129, 5–129. బౌలింగ్: కమిన్స్ 4–0–25–0, శివమ్ మావి 3–0–32–1, వరుణ్ చక్రవర్తి 4–0–28–1, కమలేశ్ 3–0–21–1, నరైన్ 4–0–31–1, రసెల్ 2–0–18–1. ► ఐపీఎల్ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకోవడం 2015 తర్వాత ఇదే తొలిసారి. ► కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై లక్ష్యఛేదనలో ఓడిపోవడం చెన్నై సూపర్‌కింగ్స్ జట్టుకిదే మొదటిసారి. కోల్‌కతాపై ఛేజింగ్ చేస్తూ చెన్నై గతంలో ఎనిమిదిసార్లూ గెలిచింది. -
అమెరికా ఉగ్రపోరులో 5 లక్షల మంది హతం
అమెరికా చేపట్టిన ‘ఉగ్రవాదంపై యుద్ధం’లో ఐదు లక్షల మందికి పైగా మరణించినట్లు అమెరికాకు చెందిన బ్రౌన్ యూనివర్సిటీ వాట్సన్ అంతర్జాతీయ, ప్రజా వ్యవహారాల సంస్థ నివేదిక వెల్లడించింది. మృతుల్లో ఉగ్రవాదులతోపాటు పోలీసులు, భద్రతా దళాలు, పౌరులు, అమెరికా, మిత్రపక్షాల సైనికులు ఉన్నారు. 2001 సెప్టెంబర్ 11న అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై దాడి తర్వాత ఇరాక్, అఫ్ఘానిస్తాన్, పాక్‌లో ఉగ్రవాద స్థావరాలు, సమూహాలు, వ్యక్తులపై వివిధ రూపాల్లో అమెరికా దాడులు ప్రారంభించింది. అప్పటి నుంచి ఆయా దేశాల్లో జరిగిన హింసాత్మక ఘటనల్లో 5.07 లక్షల మంది చనిపోయారని, వాస్తవానికి ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉండొచ్చని నివేదిక పేర్కొంది. 2016లో ఈ సంస్థ వెల్లడించిన గణాంకాలతో పోల్చితే ఈ రెండేళ్లలో లక్షా పది వేల మంది అధికంగా మృత్యువాతపడ్డారు. ‘ఉగ్రవాదంపై యుద్ధాన్ని అమెరికాలో పౌరులు, పత్రికలు, రాజకీయవేత్తలు పెద్దగా పట్టించుకోవడం లేదు. అయితే, పెరుగుతున్న మృతుల సంఖ్య యుద్ధ తీవ్రతను స్పష్టం చేస్తోంది’ అని ఆ సంస్థ తెలిపింది. ఆ దాడుల్లో మృతులను మిలిటెంట్లుగా అమెరికాతోపాటు ఆయా దేశాల సైనికవర్గాలు అభివర్ణిస్తున్నా వాస్తవానికి వారు పౌరులై ఉండే అవకాశం ఉందని ఆ నివేదికను రూపొందించిన నేట క్రాఫోర్డ్ అభిప్రాయపడ్డారు. ‘ఇలాంటి యుద్ధాల్లో ప్రత్యక్షంగా ఎందరు చనిపోయి ఉంటారన్నది మనకు తెలిసే అవకాశం లేదు. ఉదాహరణకు ఇరాక్‌లోని మోసుల్‌తో పాటు ఇతర నగరాలను ఐసిస్ తీవ్రవాదుల నుంచి స్వాధీనం చేసుకునే క్రమంలో వేల సంఖ్యలో పౌరులు మరణించి ఉంటారు. అయితే, వారి మృతదేహాలు లభ్యం కాకపోవడం వల్ల లెక్క తేలే అవకాశం లేదు’ అని క్రాఫోర్డ్ తెలిపారు. ఈ నివేదిక ప్రకారం...ఇరాక్‌లో దాదాపు 2,04,575 మంది, అఫ్గాన్‌లో 38,480 మంది, పాక్‌లో 23,372 మంది మరణించారు. ఇరాక్, అఫ్ఘానిస్తాన్‌లలో మోహరించిన దాదాపు 7 వేల మంది అమెరికా సైనికులు చనిపోయారు. డ్రోన్ దాడుల్లో 2,714 మంది మృతి ఉగ్రవాదంపై యుద్ధంలో భాగంగా అమెరికా గూఢచారి విభాగం సీఐఏ (సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ) పాకిస్తాన్లో డ్రోన్ల ద్వారా 409 దాడులకు పాల్పడినట్లు డాన్ పత్రిక వెల్లడించింది. 2004 నుంచి జరుగుతున్న ఈ దాడుల్లో ఇప్పటి వరకు 2,714 మంది మృతి చెందగా, 728 మంది గాయపడ్డారు. -
విమానంలో కింగ్స్ సందడి
సాక్షి, చెన్నై : ఐపీఎల్ –2018 సుల్తాన్‌గా చెన్నై సూపర్ కింగ్స్ అవతరించిన విషయం తెలిసిందే. అద్భుతమైన ఫీల్డింగ్, బౌలింగ్ , బ్యాటింగ్‌తో ధోని సేన అభిమానుల మన్ననల్ని అందుకుంది. చెన్నైకి చేరుకున్న కింగ్స్ సేనకు బ్రహ్మరథం పట్టే రీతిలో అభిమాన లోకం ఆహ్వానం పలికింది. చెన్నైలోని ఓ హోటళ్లో ప్రముఖులు, కింగ్స్ ప్రతినిధులతో సంబరాలు చేసుకున్నారు. అయితే, ముంబై నుంచి చెన్నైకు వచ్చే సమయంలో విమానంలో కింగ్స్ సేన సంబరాల్లో మునిగాయి. ముంబైలో మ్యాచ్ ముగించుకుని సోమవారం జట్టు సభ్యులు చెన్నైకు తిరుగు పయనం అయ్యారు. వాట్సన్‌తో పైలట్ , ఐపీఎల్ కప్‌తో ఆనందం వీరంతా జెట్ ఎయిర్ వేస్‌లో పయనించారు. క్రికెటర్లు తమ విమానంలో పయనిస్తుండడంతో ముందుగానే జెట్ ఎయిర్వేస్ విమాన సిబ్బంది ఏర్పాట్లు చేసుకున్నారు. సొంత గడ్డ చెన్నైలో అడుగు పెట్టనున్న ధోని సేనతో కలిసి విమానంలో విజయోత్సవ ఆనందాన్ని పంచుకున్నారు. కేక్ కట్ చేశారు. కప్‌ను విమాన పైలట్, ఎయిర్ హోస్టస్‌లు చేత బట్టి ఆనందంలో ఉబ్బితబ్బిబ్బ య్యారు. క్రికెటర్లతో ఫొటోలు, సెల్ఫీలు దిగుతూ సంబరాల్ని హోరెత్తించారు. కేక్ తినిపిస్తున్న బ్రేవో ,కేక్ కట్ చేస్తున్న వాట్సన్ -
11 గంటల్లో త్రీడీ బస్సు తయార్..!
ఇక్కడ కనిపిస్తున్న మినీబస్సు పేరు ‘ఒల్లి’. అమెరికాలోని వాషింగ్టన్లో గురువారం నుంచి రోడ్డుపై కెక్కింది. ఈ బస్సును కేవలం 11 గంటల్లో తయారు చేయవచ్చు! విద్యుత్తుతో పనిచేస్తుంది కాబట్టి మోటర్‌ను తెచ్చుకుంటే చాలు.. మిగిలిన పనంతా త్రీడీ ప్రింటర్ చూసుకుంటుంది. కేవలం పది గంటల్లో ఈ మినీ బస్సుకు అవసరమైన అన్ని భాగాలను ప్రింట్ చేసేసి ఇస్తుంది. గంట టైమ్‌లో ఈ విడిభాగాలన్నింటినీ అసెంబ్లింగ్ చేసి బస్సును రోడెక్కించవచ్చట! 12 మంది ప్రయాణించేందుకు వీలున్న ఒల్లీ ఒక సెల్ఫ్ డ్రైవర్ మినీబస్సు. అంటే డ్రైవర్ ఉండడు. ఐబీఎం అభివృద్ధి చేసిన సూపర్ కంప్యూటర్ ‘వాట్సన్’ పుణ్యమా అని ఒల్లీతో మనం ఫ్రెండ్స్‌తో మాట్లాడినట్లే మాట్లాడొచ్చు... ‘‘మధ్యాహ్నం 3.30కి అబిడ్స్ దగ్గర పికప్ చేసుకో’ అని స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్ ద్వారా చెప్పేయవచ్చు. ప్రస్తుతానికి ఇది వాషింగ్టన్ డీసీలో మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలో లాస్‌వెగాస్, మియామీల్లోనూ సేవలు ప్రారంభించవచ్చునని దీని తయారీదారులైన ‘లోకల్ మోటార్స్’ ప్రతినిధులు అంటున్నారు. -
‘సన్’ ఎరుపెక్కింది...
► బెంగళూరుపై ఘన విజయం ►15 పరుగులతో నెగ్గిన హైదరాబాద్ ► వార్నర్ మరో అర్ధ సెంచరీ సన్‌రైజర్స్ సొంతగడ్డపై మళ్లీ చెలరేగింది... ఎప్పటిలా బౌలింగ్‌తో కాకుండా ఈ సారి బ్యాటింగ్‌తో సత్తా చాటింది. భారీ స్కోరు చేస్తే విజయాన్ని ఎంతటి జట్టయినా ఆపలేదని నిరూపించింది. వార్నర్ మెరుపు షాట్లతో ముందుండి నడిపించగా, విలియమ్సన్ అండగా నిలిచాడు. దాంతో సీజన్ తొలి మ్యాచ్‌లో ఓటమికి బెంగళూరుపై ప్రతీకారం తీర్చుకుంది. ముందుగా పేలవ బౌలింగ్‌తో పరుగులిచ్చుకున్న బెంగళూరు ఆపై బ్యాటింగ్‌లో విఫలమైంది. రాహుల్ ఓపెనింగ్‌తో పాటు డివిలియర్స్ కొద్దిగా ఆశలు రేపినా, కోహ్లి వైఫల్యం, గేల్ లేకపోవడం జట్టును దెబ్బ తీశాయి. ఫలితంగా టాస్ గెలిచి ఛేదనకు మొగ్గు చూపిన ఆర్సీబీ ఈ సీజన్లో జరుగుతున్నట్లుగా గెలుపు సాంప్రదాయాన్ని కొనసాగించలేకపోయింది. సాక్షి, హైదరాబాద్: ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మరో కీలక విజయాన్ని సొంతం చేసుకుంది. శనివారం ఉప్పల్ స్టేడియంలో దాదాపు ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 15 పరుగుల తేడాతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరును ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్ (50 బంతుల్లో 92; 9 ఫోర్లు, 5 సిక్సర్లు) శతకం కోల్పోగా, విలియమ్సన్ (38 బంతుల్లో 50; 7 ఫోర్లు) సహకరించాడు. అనంతరం బెంగళూరు 20 ఓవర్లలో 6 వికెట్లకు 179 పరుగులు మాత్రమే చేయగలిగింది. లోకేశ్ రాహుల్ (28 బంతుల్లో 51; 6 ఫోర్లు, 1 సిక్స్), డివిలియర్స్ (32 బంతుల్లో 47; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. గేల్‌కూ చోటు లేదు: హైదరాబాద్ జట్టు మూడు మార్పులతో బరిలోకి దిగగా, బెంగళూరు ఏకంగా నలుగురు ఆటగాళ్లను మార్చింది. గేల్‌ను తుది జట్టులోకి తీసుకోకపోవడం ఆశ్చర్యం కలిగించింది. బహుశా కోహ్లి తమ బలహీన బౌలింగ్‌ను కాస్త పటిష్టంగా మార్చాలని ఆలోచించినట్లున్నాడు. అందుకే రిచర్డ్సన్, షమ్సీలలో ఎవరినీ తప్పించలేదు. మెరుపు భాగస్వామ్యం: గత రెండు మ్యాచ్‌లలో ఆకట్టుకున్న ధావన్ (11) ఈసారి ప్రభావం చూపకుండానే వెనుదిరిగాడు. అయితే వార్నర్, విలియమ్సన్ కలిసి రైజర్స్ స్కోరును పరుగులు పెట్టించారు. వార్నర్ తన అద్భుత ఫామ్‌ను కొనసాగించగా, సీజన్లో తొలి మ్యాచ్ ఆడుతున్న విలియమ్సన్ కూడా తన కళాత్మక బ్యాటింగ్‌ను ప్రదర్శించాడు. హర్షల్ వేసిన ఆరో ఓవర్లో వార్నర్ రెండు ఫోర్లు, 1 సిక్స్ బాదగా 16 పరుగులు వచ్చాయి. పది ఓవర్లు ముగిసే సరికి సన్ స్కోరు 82 పరుగులకు చేరింది. ఆర్సీబీ బౌలర్లు ఎంతగా శ్రమించినా వీరిద్దరి దూకుడును ఆపలేకపోయారు. ఈ క్రమంలో 32 బంతుల్లోనే వార్నర్ సీజన్లో ఐదో అర్ధ సెంచరీ నమోదు చేయడం విశేషం. రిచర్డ్సన్ వేసిన 15వ ఓవర్లో రైజర్స్ అత్యధికంగా 19 పరుగులు రాబట్టింది. ముఖ్యంగా 12-16 మధ్య ఐదు ఓవర్లలోనే 66 పరుగులు కొల్లగొట్టడం విశేషం. ఎనిమిది పరుగుల తేడాతో వార్నర్, విలియమ్సన్వెనుదిరిగినా, హెన్రిక్స్ (14 బంతుల్లో 31 నాటౌట్; 1 ఫోర్, 3 సిక్సర్లు) చెలరేగాడు. ఆఖరి ఓవర్లో వాట్సన్ 6 పరుగులు మాత్రమే ఇవ్వడంతో సన్ స్కోరు 200 పరుగులు చేరలేకపోయింది. రాహుల్ దూకుడు: ఒక వైపు క్రీజ్‌లో కోహ్లి ఉన్నా, మరో వైపు లోకేశ్ రాహుల్ జోరు కొనసాగింది. గుజరాత్‌తో గత మ్యాచ్‌లో చెలరేగిన తరహాలోనే ఈ సారి ఓపెనర్‌గా రాహుల్ తన ధాటిని ప్రదర్శించాడు. వరుసగా బౌండరీలతో చెలరేగడంతో తొలి 4 ఓవర్లలో బెంగళూరు 37 పరుగులు చేసింది. అయితే తర్వాతి ఓవర్లో ముస్తఫిజుర్ రెండో బంతికే కోహ్లి (17 బంతుల్లో 14; 1 ఫోర్)ని అవుట్ చేసి బ్రేక్ ఇచ్చాడు. బరీందర్ వేసిన ఓవర్లో మరో సిక్స్, ఫోర్ కొట్టిన రాహుల్ ... 26 బంతుల్లోనే వరుసగా రెండో హాఫ్ సెంచరీని అందుకున్నాడు. ఆ వెంటనే హెన్రిక్స్ చక్కటి బంతితో అతడిని అవుట్ చేయడంతో బెంగళూరు రెండో వికెట్ కోల్పోయింది. అనంతరం లేని రెండో పరుగుకు ప్రయత్నించి బరీందర్ డెరైక్ట్ త్రోకు వాట్సన్ (2) వెనుదిరిగాడు. అయితే మరో వైపు నిలదొక్కున్న తర్వాత డివిలియర్స్ తనదైన శైలిలో ఆడాడు. హెన్రిక్స్ వేసిన 14వ ఓవర్లో ఏబీ వరుసగా రెండు భారీ సిక్సర్లు కొట్టగా, ఓవర్లో మొత్తం 19 పరుగులు లభించాయి. అయితే ఈ దూకుడుకు బరీందర్ అడ్డుకట్ట వేయడంతో సన్ ఊపిరి పీల్చుకుంది. మరో భారీ షాట్‌కు ప్రయత్నించి డివిలియర్స్ లాంగాన్‌లో విలియమ్సన్కు చిక్కాడు. ఆ తర్వాత సచిన్ బేబీ, కేదార్ జాదవ్ పోరాడినా గెలిచేందుకు అది సరిపోలేదు. స్కోరు వివరాలు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: వార్నర్ (సి) డివిలియర్స్ (బి) షమ్సీ 92; ధావన్ (సి) అండ్ (బి) రిచర్డ్సన్ 11; విలియమ్సన్ (సి) రాహుల్ (బి) వాట్సన్ 50; హెన్రిక్స్ (నాటౌట్) 31; నమన్ ఓజా (సి) డివిలియర్స్ (బి) రిచర్డ్సన్ 1; హుడా (రనౌట్) 2; ఆశిష్ రెడ్డి (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 194. వికెట్ల పతనం: 1-28; 2-152; 3-160; 4-161; 5-190. బౌలింగ్: రిచర్డ్సన్ 4-0-45-2; వాట్సన్ 4-0-33-1; రసూల్ 4-0-33-0; ఆరోన్ 3-0-27-0; హర్షల్ 1-0-16-0; షమ్సీ 4-0-39-1. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: కోహ్లి (సి) ఆశిష్ రెడ్డి (బి) ముస్తఫిజుర్ 14; లోకేశ్ రాహుల్ (సి) నమన్ ఓజా (బి) హెన్రిక్స్ 51; ఏబీ డివిలియర్స్ (సి) విలియమ్సన్ (బి) శరణ్ 47; వాట్సన్ (రనౌట్) 2; సచిన్ బేబీ (సి) శిఖర్ ధావన్ (బి) నెహ్రా 27; కేదార్ జాదవ్ (నాటౌట్) 25; రసూల్ (సి) హెన్రిక్స్ (బి) భువనేశ్వర్ 10; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం: (20 ఓవర్లలో ఆరు వికెట్లకు) 179 వికెట్ల పతనం: 1-42, 2-83, 3-90, 4-129, 5-152, 6-179. బౌలింగ్: ఆశిష్ నెహ్రా 4-0-32-1, భువనేశ్వర్ 4-0-36-1, ముస్తఫిజుర్ 4-0-34-1, శరణ్ 4-0-36-1, హెన్రిక్స్ 4-0-40-1. -
కోహ్లి, గేల్ డ్యాన్స్ డ్యాన్స్...
వాట్సన్ గిటార్ మోత బెంగళూరు: ఐపీఎల్లో ఎన్ని జట్లున్నా సరదాల విషయంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తర్వాతే ఎవరైనా. మైదానంలో మ్యాచ్ ఫలితాలు ఎలా ఉన్నా... ఒక్కసారిగా హోటల్ చేరగానే వారంతా ‘కళాకారులు’ అయిపోతారు. అసలు ఆర్సీబీ జట్టు సభ్యులైన తర్వాతే ఆటగాళ్లకూ జోష్ వస్తుందేమో! ఇలాంటి వాటిలో ముందుండే క్రిస్ గేల్‌కు సూపర్ స్టార్ విరాట్ కోహ్లి కూడా జత కలిశాడు. జట్టు ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో వీరిద్దరు కలిసి కదంతొక్కారు. తమ నైపుణ్యాన్నంతా చూపెడుతూ సూపర్ డ్యాన్స్‌లతో చెలరేగారు. వీరి నృత్య ప్రదర్శనతో అక్కడి వేదిక దద్దరిల్లింది. కోహ్లి, గేల్ తమ నాట్యంతో ఆకట్టుకుంటే... మరో ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్ తన సంగీత నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. 2011నాటి డేవిడ్ గ్వెట్టా సూపర్ హిట్ సాంగ్ ‘టైటానియం’ను పాడుతూ, మరోవైపు చక్కగా గిటార్ మోగిస్తూ ద్విపాత్రాభినయం చేశాడు. ఆర్సీబీ టీమ్‌లో మరో స్టార్ డివిలియర్స్ ఈ షో లో భాగం కాకపోయినా...అతని భార్య డేనియల్లె డివిలియర్స్ తన మధుర గాత్రంతో వాట్సన్‌తో గొంతు కలపడం మరో విశేషం. మొత్తంగా బెంగళూరు ఆటగాళ్లు ఎప్పటిలాగే తమ ఐపీఎల్ సీజన్‌ను కలర్ఫుల్గా మార్చుకుంటున్నారు. శనివారం సన్‌రైజర్స్ జట్టుతో తలపడేందుకు బెంగళూరు జట్టు గురువారం హైదరాబాద్‌కు చేరుకుంది. -
‘కంగారు’పడ్డారు!
► లక్ష్య ఛేదనలో తడబడ్డ ఆస్ట్రేలియా ► 8 పరుగులతో నెగ్గిన న్యూజిలాండ్ ► రాణించిన కివీస్ బౌలర్లు ధర్మశాల: ఆస్ట్రేలియా లక్ష్యం 20 ఓవర్లలో 143 పరుగులు... ఓ దశలో జట్టు స్కోరు 121/5... ఇక గెలవాలంటే 12 బంతుల్లో 22 పరుగులు చేయాలి. మామూలుగా ఆసీస్ బ్యాటింగ్ లైనప్‌ను బట్టి చూస్తే విజయం నల్లేరు మీద నడకే. కానీ న్యూజిలాండ్ పేసర్లు మెక్లీంగన్ (3/17), అండర్సన్ (2/29) సూపర్ బౌలింగ్‌తో కంగారూలను అద్భుతంగా కట్టడి చేశారు. 12 బంతుల వ్యవధిలో నాలుగు వికెట్లు తీసి స్మిత్‌సేన విజయాన్ని అడ్డుకున్నారు. ఫలితంగా టి20 ప్రపంచకప్‌లో భాగంగా శుక్రవారం జరిగిన గ్రూప్-2 లీగ్ మ్యాచ్‌లో కివీస్ 8 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాపై నెగ్గి వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 142 పరుగులు చేసింది. గప్టిల్ (27 బంతుల్లో 39; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), ఇలియట్ (20 బంతుల్లో 27; 3 ఫోర్లు), విలియమ్సన్ (20 బంతుల్లో 24; 4 ఫోర్లు), మున్రో (26 బంతుల్లో 23; 2 ఫోర్లు)లు రాణించారు. అనంతరం ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 9 వికెట్లకు 134 పరుగులకే పరిమితమైంది. ఖవాజ (27 బంతుల్లో 38; 6 ఫోర్లు) టాప్ స్కోరర్. చివర్లో 12 బంతుల వ్యవధిలో మార్ష్(24), అగర్(9), ఫాల్క్‌నర్ (2), కోల్టర్‌నీల్ (1)లు అవుట్ కావడంతో కివీస్ చిరస్మరణీయ విజయాన్ని సొంతం చేసుకుంది. మెక్లీంగన్కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. స్కోరు వివరాలు న్యూజిలాండ్ ఇన్నింగ్స్: గప్టిల్ (సి) మ్యాక్స్‌వెల్ (బి) ఫాల్క్‌నర్ 39; విలియమ్సన్ (సి) అగర్ (బి) మ్యాక్స్‌వెల్ 24; మున్రో (సి) ఫాల్క్‌నర్ (బి) మార్ష్ 23; అండర్సన్ (సి) అగర్ (బి) మ్యాక్స్‌వెల్ 3; టేలర్ (సి) మార్ష్ (బి) వాట్సన్ 11; ఇలియట్ రనౌట్ 27; రోంచి (సి) మ్యాక్స్‌వెల్ (బి) ఫాల్క్‌నర్ 6; సాంట్నెర్ రనౌట్ 1; మిల్నె నాటౌట్ 2; ఎక్స్‌ట్రాలు: 6; మొత్తం: (20 ఓవర్లలో 8 వికెట్లకు) 142. వికెట్ల పతనం: 1-61; 2-66; 3-76; 4-97; 5-117; 6-133; 7-140; 8-142. బౌలింగ్: కోల్టర్‌నీల్ 4-0-33-0; వాట్సన్ 4-0-22-1; అగర్ 1-0-18-0; ఫాల్క్‌నర్ 3-0-18-2; జంపా 1-0-3-0; మ్యాక్స్‌వెల్ 3-0-18-2; మిచెల్ మార్ష్ 4-0-26-1. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: ఖవాజ రనౌట్ 38; వాట్సన్ (సి) విలియమ్సన్ (బి) మెక్లీంగన్ 13; స్మిత్ (స్టంప్డ్) రోంచి (బి) సాంట్నెర్ 6; వార్నర్ (సి) గప్టిల్ (బి) సాంట్నెర్ 6; మ్యాక్స్‌వెల్ (సి) విలియమ్సన్ (బి) సోధి 22; మార్ష్ (సి) మిల్నె (బి) మెక్లీంగన్ 24; అగర్ (సి) టేలర్ (బి) మెక్లీంగన్ 9; ఫాల్క్‌నర్ (సి) గప్టిల్ (బి) అండర్సన్ 2; కోల్టర్‌నీల్ (బి) అండర్సన్ 1; నెవిల్ నాటౌట్ 7; జంపా నాటౌట్ 2; ఎక్స్‌ట్రాలు: 4; మొత్తం: (20 ఓవర్లలో 9 వికెట్లకు) 134. వికెట్ల పతనం: 1-44; 2-51; 3-62; 4-66; 5-100; 6-121; 7-123; 8-124; 9-132. బౌలింగ్: అండర్సన్ 4-0-29-2; మిల్నె 2-0-22-0; ఇలియట్ 2-0-17-0; మెక్లీంగన్ 3-0-17-3; సాంట్నెర్ 4-0-30-2; విలియమ్సన్ 1-0-3-0; సోధి 4-0-14-1. కివీస్ మహిళలు కూడా... మరోవైపు న్యూజిలాండ్ మహిళల జట్టు కూడా రెండో విజయాన్ని నమోదు చేసింది. ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో కివీస్ 93 పరుగుల తేడాతో గెలిచింది. తొలుత కివీస్ మూడు వికెట్లకు 177 పరుగులు చేయగా... ఐర్లాండ్ 83 పరుగులు మాత్రమే సాధించింది. మరో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఆరు వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించింది. 103 పరుగుల విజయలక్ష్యాన్ని ఆస్ట్రేలియా నాలుగు వికెట్లు కోల్పోయి అధిగమించింది. -
‘ప్రాక్టీస్’లో ఓడిన ఆస్ట్రేలియా
3 వికెట్లతో నెగ్గిన వెస్టిండీస్ హాజెల్‌వుడ్ హ్యాట్రిక్ వృథా కోల్‌కతా: కెప్టెన్ డారెన్ స్యామీ (28 బంతుల్లో 50 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్) బ్యాటింగ్‌లో దుమ్మురేపడంతో... ఆదివారం జరిగిన టి20 ప్రపంచకప్ ప్రాక్టీస్ మ్యాచ్‌లో వెస్టిండీస్ 3 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై విజయం సాధించింది. ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 161 పరుగులు చేసింది. వాట్సన్ (39 బంతుల్లో 60; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), స్మిత్ (29 బంతుల్లో 36; 1 ఫోర్), ఫించ్ (24 బంతుల్లో 33; 6 ఫోర్లు) రాణించారు. డ్వేన్ బ్రేవో 4, బెన్ 3 వికెట్లు తీశారు. తర్వాత వెస్టిండీస్ 19.5 ఓవర్లలో 7 వికెట్లకు 162 పరుగులు చేసింది. నాలుగో ఓవర్లోనే హాజెల్‌వుడ్... హోల్డర్ (6), శామ్యూల్స్ (0), బ్రేవో (0)లను అవుట్ చేసి హ్యాట్రిక్ సాధించినా... చివర్లో స్యామీ ధాటికి కంగారూలు చేతులెత్తేశారు. -
ఆసీస్‌దే టి20 సిరీస్ ఆఖరి మ్యాచ్‌లో ఓడిన దక్షిణాఫ్రికా
కేప్ టౌన్: లక్ష్య ఛేదనలో చెలరేగిన ఆస్ట్రేలియా... దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. కెప్టెన్ స్మిత్ (26 బంతుల్లో 44; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), వాట్సన్ (27 బంతుల్లో 42; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) వీరవిహారం చేయడంతో బుధవారం అర్ధరాత్రి జరిగిన ఆఖరి మ్యాచ్‌లోనూ కంగారులు 6 వికెట్ల తేడాతో సఫారీలపై విజయం సాధించారు. న్యూలాండ్స్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 4 వికెట్లకు 178 పరుగులు చేసింది. హషీమ్ ఆమ్లా (62 బంతుల్లో 97 నాటౌట్; 8 ఫోర్లు, 4 సిక్సర్లు) దుమ్మురేపాడు. కోల్టర్‌నీల్ 2 వికెట్లు తీశాడు. తర్వాత ఆసీస్ 19.2 ఓవర్లలో 4 వికెట్లకు 181 పరుగులు చేసింది. వార్నర్ (27 బంతుల్లో 33; 3 ఫోర్లు), మ్యాక్స్‌వెల్ (10 బంతుల్లో 19 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. -
మనోళ్ళే ముద్దు
♦ దేశవాళీ క్రికెటర్లపై కాసుల వర్షం స్టార్ క్రికెటర్లకు తగ్గిన రేటు ♦ ఐపీఎల్ వేలంలో అమ్ముడైన 94 మంది క్రికెటర్లు ♦ యువరాజ్ కంటే పవన్ నేగీకి ఎక్కువమొత్తం ♦ అందరికంటే ఎక్కువగా వాట్సన్‌కు రూ.9.5 కోట్లు గత ఏడాది వరకూ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వేలం అంటే కాసుల వర్షం... పేరున్న ప్రతి క్రికెటర్‌కూ భారీగా డబ్బులు వచ్చేవి. కానీ ఈసారి ట్రెండ్ మారింది. ఫ్రాంచైజీలు ఆచితూచి డబ్బు ఖర్చు చేశాయి. కోట్లు పోసి విదేశీ క్రికెటర్లను తెచ్చి బెంచ్‌లపై కూర్చోబెట్టడం అనవసరమనే భావనతో వ్యవహరించాయి. దేశవాళీ క్రికెట్లో కొద్దోగొప్పో ఆడేవాళ్లపై కూడా కాసుల వర్షం కురిపించారు. అనామకులైనప్పటికీ నైపుణ్యం ఉందని భావించిన వాళ్లకోసం కోట్లు ఖర్చు చేశారు. మొత్తం మీద ఈసారి వేలంలో గతంతో పోలిస్తే స్టార్ క్రికెటర్లకు నిరాశ ఎదురైనా... దేశవాళీ ఆటగాళ్ల జేబులు నిండాయి. బెంగళూరు: గత రెండు సీజన్ల వేలంతో పోలిస్తే ఈసారి ఐపీఎల్ వేలంలో స్టార్ క్రికెటర్లందరికీ నిరాశే మిగిలింది. రెండేళ్ల క్రితం బెంగళూరు రూ. 14 కోట్లు... ఏడాది క్రితం వేలంలో ఢిల్లీ రూ. 16 కోట్లు ఇచ్చి కొనుక్కున్న యువరాజ్‌ను... ఈసారి కేవలం రూ.7 కోట్లకే హైదరాబాద్ సన్‌రైజర్స్ జట్టు సొంతం చేసుకుంది. గత ఏడాది ఏకంగా రూ. 12 కోట్లు దక్కించుకున్న దినేశ్ కార్తీక్ ఈసారి కేవలం రూ. 2 కోట్ల 30 లక్షలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఏ క్రికెటర్ కోసమూ భారీగా వెచ్చించడం అనవసరమనే భావనలో ఫ్రాంచైజీలు ఆచితూచి వ్యవహరించాయి. వేలానికి వచ్చే సమయానికే ప్రతి జట్టులోనూ కావలసినంత మంది స్టార్ క్రికెటర్లు ఉన్నారు. కాబట్టి విదేశీ స్టార్ల కోసం వెంపర్లాడే బదులు... దేశవాళీ క్రికె ట్లో నిలకడగా ఆడిన, సంచలనాలు సృష్టించిన ఆటగాళ్లకు అన్ని ఫ్రాంచైజీలు పెద్ద పీట వేశాయి. ఇప్పటివరకూ భారత్ తరఫున ఒక్క మ్యాచ్ కూడా ఆడని పవన్ నేగీకి ఏకంగా రూ. 8.5 కోట్లు లభించాయి. ఇది యువరాజ్ సింగ్ కంటే ఎక్కువ కావడం చెప్పుకోదగ్గ విశేషం. అలాగే సంజు శామ్సన్ (రూ. 4.2 కోట్లు), కరుణ్ నాయర్ (రూ. 4 కోట్లు), దీపక్ హుడా లాంటి దేశవాళీ క్రికెటర్లు జాక్‌పాట్ కొట్టారు. ముస్తాక్ అలీ టి20 టోర్నీలో చక్కగా బౌలింగ్ చేసిన తమిళనాడు లెగ్ స్పిన్నర్ మురుగన్ అశ్విన్‌కు ఏకంగా రూ. 4.5 కోట్లు దక్కడం విశేషం. వేలం హైలైట్స్ రెండేళ్ల నుంచి ఐపీఎల్‌కు దూరంగా ఉన్న కెవిన్ పీటర్సన్ మొదట వేలంలోకి వచ్చాడు. ఇతనికోసం పుణే, గుజరాత్ మాత్రమే పోటీపడ్డాయి. డ్వేన్ స్మిత్, ఇషాంత్ శర్మల కోసం కూడా గుజరాత్, పుణేలు పోటీపడినా.. మధ్యలో వేరే ఫ్రాంచైజీలు రావడంతో ధర కాస్త పెరిగింది. టెస్టులకు గుడ్‌బై చెప్పిన ఆసీస్ ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్ నాలుగో ఆటగాడిగా వేలంలోకి వచ్చాడు. ఇక అన్ని ఫ్రాంచైజీలు ఈ ఆల్‌రౌండర్ కోసం హోరాహోరీగా తలపడ్డాయి. బెంగళూరు రూ. ఐదున్నర కోట్లకు తీసుకెళ్లడంతో పుణే వెనక్కితగ్గింది. అయితే ముంబై రాకతో రేట్ అమాంతం పెరిగింది. చివరకు బెంగళూరు రికార్డు ధరకు కొనుగోలు చేసింది. యువరాజ్ వేలానికి వచ్చినప్పుడు ఫ్రాంచైజీలు బాగా తటపటాయించాయి. అయితే 2 కోట్లతో ముంబై వేలాన్ని ప్రారంభించగా, ఆ తర్వాత ఫ్రాంచైజీలు పోటీపడ్డాయి. రూ. 5 కోట్ల తర్వాత బెంగళూరు పక్కకు తప్పుకోగా ముంబై దాన్ని ఇంకా పైకి తీసుకెళ్లింది. చివరకు రూ. 6 కోట్ల వద్ద ఆలస్యంగా వేలంలోకి వచ్చిన హైదరాబాద్ మరింత పెంచి సొంతం చేసుకుంది. ♦ ఆసీస్ టి20 కెప్టెన్ ఆరోన్ ఫించ్‌ను మొదట వేలంలో ఎవరూ తీసుకోలేదు. కానీ రెండోసారి రావడంతో రూ. 1 కోటి బేస్‌ప్రైస్‌కే గుజరాత్ లయన్స్ దక్కించుకుంది. ♦ గతేడాది కోట్లలో పలికిన స్పిన్నర్ అమిత్ మిశ్రా పరిస్థితి ఈసారి ఘోరంగా మారింది. ఫ్రాంచైజీలు ఆసక్తి చూపకపోవడంతో బేస్ ప్రైస్‌కే అమ్ముడుపోయాడు. ♦ మొత్తం 351 మంది క్రికెటర్లు అందుబాటులో ఉంటే... ఫ్రాంచైజీలు 94 మందిని మాత్రమే తీసుకున్నాయి. ఓవరాల్‌గా 257 మందికి నిరాశ ఎదురైంది. ♦ భారత అండర్-19 జట్టు కోచ్ రాహుల్ ద్రవిడ్.. ఢిల్లీ డేర్‌డెవిల్స్ మెంటార్‌గా పని చేసే అవకాశాలు ఉన్నాయి. ఇంకా తుది నిర్ణయాన్ని ప్రకటించలేదు. ♦ ఓవరాల్‌గా వేలంలో తీసుకున్న ఆటగాళ్లలో భారత్‌కు ఆడిన ప్లేయర్లు 15, దేశవాళీ క్రికెటర్లు 51, ఆసీస్ నుంచి 13, దక్షిణాఫ్రికా నుంచి 4, వెస్టిండీస్ నుంచి 4, ఇంగ్లండ్ నుంచి ముగ్గురు, న్యూజిలాండ్ నుంచి ఇద్దరు, శ్రీలంక, బంగ్లాదేశ్ నుంచి ఒక్కో ఆటగాడు ఉన్నారు. ♦ అండర్-19 ప్రపంచకప్‌లో ఆడుతున్న ఆటగాళ్ల వైపు కూడా ఫ్రాంచైజీలు బాగానే మొగ్గు చూపాయి. రూ. 10 లక్షల బేస్‌ప్రైస్‌తో వచ్చిన ఇషాన్ కిషన్‌ను రూ. 35 లక్షలకు గుజరాత్ కొనుగోలు చేసింది. ఇక రిషబ్ పంత్‌ను ఏకంగా రూ. 1.9 కోట్లకు ఢిల్లీ చేజిక్కించుకుంది. ♦ సెలబ్రిటీలు నీతా అంబానీ (ముంబై), ప్రీతి జింతా (పంజాబ్), విజయ్ మాల్యా (బెంగళూరు), మాజీ ఆటగాళ్లు రికీ పాంటింగ్, ఫ్లెమింగ్, లక్ష్మణ్, మూడీ, బ్రాడ్ హాడ్జ్, వెటోరి తమ ఫ్రాంచైజీల తరఫున వేలంలో పాల్గొన్నారు. తమ్ముడికి రెండు కోట్లు! ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తమ్ముడు క్రునాల్ హిమాన్షు పాండ్యా, కర్ణాటక ఆటగాడు కిశోర్ కామత్ కోసం ఫ్రాంచైజీలు ఊహించని రీతిలో డబ్బుల వర్షం కురిపిం చాయి. రూ. 10 లక్షల బేస్‌ప్రైస్‌తో వచ్చిన ఈ ఇద్దరి కోసం ముంబై, ఢిల్లీలు హోరాహోరీగా పోటీపడ్డాయి. చివరకు క్రునాల్‌ను రూ. 2 కోట్లకు, కామత్‌ను రూ. 1.4 కోట్లకు ముంబై సొంతం చేసుకుంది. గుజరాత్‌కు చెందిన 24 ఏళ్ల క్రునాల్ భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యా తమ్ముడు. ఐపీఎల్ లెక్కల ప్రకారం ముంబై ఇండియన్స్ హార్దిక్‌కు రూ.10 లక్షలు చెల్లిస్తుండగా... అదే ముంబై క్రునాల్‌కు రూ.2 కోట్లు ఇవ్వబోతోంది. మరోవైపు కిశోర్ కర్ణాటక ప్రీమియర్ లీగ్ మాత్రమే ఆడాడు. రాష్ట్ర జట్టుకుగానీ, అండర్-17, 19 జట్లకుగానీ ప్రాతినిధ్యం వహించలేదు. -
క్లీన్ స్వీప్ పై భారత్ దృష్టి
♦ నేడు ఆసీస్‌తో ఆఖరి టి20 ♦ జోరుమీదున్న ధోనిసేన ♦ ఒత్తిడిలో కంగారూలు 2014 నవంబర్ 9 తర్వాత ఆస్ట్రేలియా ఒక్క టి20 మ్యాచ్ కూడా గెలవకపోవడం విశేషం. ఆస్ట్రేలియాకు టి20ల్లో 9వ కెప్టెన్ వాట్సన్. సిడ్నీ: వన్డేల్లో ఎదురైనా పరాభవానికి టి20 సిరీస్ గెలుపుతో గట్టి సమాధానం చెప్పిన భారత జట్టు ఇప్పుడు క్లీన్‌స్వీప్‌పై దృష్టిపెట్టింది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో నెగ్గి ఆస్ట్రేలియాకు షాకిచ్చిన టీమిండియా ఆఖరి టి20లోనూ గెలిచి పర్యటనకు ఘనమైన ముగింపు ఇవ్వాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలో నేడు (ఆదివారం) సిడ్నీలో ఇరుజట్ల మధ్య ఈ మ్యాచ్ జరగనుంది. టి20 ప్రపంచ కప్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ మ్యాచ్‌లో భారత్ ఏమైనా ప్రయోగాలు చేస్తుందా? లేదా? అన్నది ప్రస్తుతం తేలాల్సిన అంశం. అయితే గెలిచే జట్టును మార్చడానికి ఇష్టపడని ధోని గత రెండు మ్యాచ్‌ల్లో ఆడిన టీమ్‌నే కొనసాగించే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఇదే జరిగితే టి20ల కోసమే ఎంపిక చేసిన యువరాజ్, హార్దిక్ పాండ్యాలకు ఇప్పటి వరకు బ్యాటింగ్ అవకాశం రాలేదు. కాబట్టి మిడిలార్డర్లో వీళ్లకు అవకాశం కల్పించాల్సిన అవసరం చాలా ఉంది. ఇక టాప్ ఆర్డర్లో రోహిత్, ధావన్, కోహ్లి సూపర్ ఫామ్‌లో ఉం డటం భారత్‌కు కలిసొచ్చే అంశం. రైనాకు పెద్దగా అవకాశం రాకపోయినా... స్లాగ్ ఓవర్లలో ధోని ఫినిషిం గ్‌తో టీమిండియా భారీ స్కోరు చేయగలుగుతుంది. బౌలింగ్‌లో నెహ్రా, ఉమేశ్‌లు పరుగులు నిరోధించాల్సిన అవసరం ఉంది. బుమ్రా, హార్దిక్ పాండ్యా, యువరాజ్ అంచనాలకు అనుగుణంగా రాణిస్తున్నారు. వీళ్లకు తోడు ప్రధాన స్పిన్నర్లు అశ్విన్, జడేజాలు కీలక సమయంలో వికెట్లు తీస్తుండటం బలంగా మారింది. అయితే రాబోయే సీజన్ మొత్తం ఉపఖండంలో ఆడాల్సి ఉంది కాబట్టి రిజర్వ్ బెంచ్‌లో ఉన్న హర్భజన్‌ను మూడో స్పిన్నర్‌గా పరీక్షిస్తే బాగుంటుంది. ఆసీస్ సారథిగా వాట్సన్ మరోవైపు ఇప్పటికే సిరీస్ చేజారడంతో ఆసీస్ పూర్తి ఒత్తిడిలో పడింది. దీనికి తోడు కెప్టెన్ ఫించ్ మోకాలి కండర గాయంతో ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. అతని స్థానంలో ఉస్మాన్ ఖాజా బరిలోకి దిగుతున్నాడు. సీనియర్ ఆటగాడు వాట్సన్‌కు కెప్టెన్సీ అప్పగించారు. కీలక ఆటగాళ్లు వార్నర్, స్మిత్ లేకపోవడం కూడా లోటుగా కనిపిస్తోంది. భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో మంచి భాగస్వామ్యాలు ఏర్పర్చలేకపోవడం ఆందోళన కలిగించే అంశం. డేంజర్ మ్యాన్ మ్యాక్స్‌వెల్, ఆల్‌రౌండర్ ఫాల్క్‌నర్, వాట్సన్, మార్ష్‌లపైనే ఈ మ్యాచ్ విజయం ఆధారపడి ఉంది. జట్లు (అంచనా) భారత్: ధోని (కెప్టెన్), రోహిత్, ధావన్, కోహ్లి, రైనా, యువరాజ్, హార్దిక్ పాండ్యా, జడేజా, అశ్విన్, బుమ్రా, నెహ్రా. ఆస్ట్రేలియా: వాట్సన్ (కెప్టెన్), మార్ష్, లిన్, మ్యాక్స్‌వెల్, ఉస్మాన్ ఖాజా / హెడ్, బ్యాంక్రాఫ్ట్, ఫాల్క్‌నర్, టై, లయోన్ / బాయ్సీ, బోలాండ్, టెయిట్. పిచ్, వాతావరణం బ్యాటింగ్‌కు అనుకూలం. మరోసారి భారీ స్కోర్లు నమోదు కావొచ్చు. ఆకాశం మేఘావృతమైనా వర్షం పడే అవకాశాల్లేవు. మ. గం. 2.08 నుంచి స్టార్‌స్పోర్ట్స్-1లో ప్రత్యక్ష ప్రసారం మహిళలదీ అదే లక్ష్యం ఆసీస్ గడ్డపై తొలిసారి టి20 సిరీస్ గెలిచి మహిళల జట్టు కూడా వైట్‌వాష్‌పై దృష్టిపెట్టింది. ఇదే మైదానంలో నేడు జరగనున్న ఆఖరి మ్యాచ్‌ల్లో ఎలాగైనా గెలిచి తీరాలని భావిస్తోంది. జట్టు మొత్తం ఫామ్‌లో ఉండటం భారత్‌కు అనుకూలాంశమైతే... ఆసీస్ ఇందుకు విరుద్ధంగా కనిపిస్తోంది. అయితే కనీసం ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి, పోయిన పరువును తెచ్చుకోవాలని కంగారూలు భావిస్తున్నారు. ఉ. గం. 9 నుంచి స్టార్‌స్పోర్ట్స్-1లో ప్రత్యక్ష ప్రసారం -
స్పిన్నర్ లియోన్‌కు పిలుపు
► చివరి రెండు వన్డేలకు ఆసీస్ జట్టు ► టి20లకు టెయిట్, వాట్సన్ మెల్బోర్న్: భారత్‌తో మిగిలిన రెండు వన్డేలు ఆడే ఆస్ట్రేలియా జట్టులో స్పిన్నర్ నాథన్ లియోన్‌కు చోటు దక్కింది. పేసర్ పారిస్ స్థానంలో లియోన్ 13 మంది సభ్యుల జట్టులోకి వచ్చాడు. 2014లో చివరిసారి వన్డే ఆడిన లియోన్... ప్రస్తుత సీజన్ బిగ్‌బాష్‌లో అద్భుతంగా బౌలింగ్ చేయడంతో తిరిగి జాతీయ జట్టులోకి వచ్చాడు. 20, 23 తేదీల్లో చివరి రెండు వన్డేలు జరుగుతాయి. వన్డే జట్టులో స్థానం కోల్పోయిన షేన్ వాట్సన్‌తో పాటు షాన్ టెయిట్ కూడా ఆస్ట్రేలియా టి20 జట్టులోకి ఎంపికయ్యారు. భారత్‌తో సిరీస్‌కు అనేక మంది కొత్త ఆటగాళ్లను ఎంపిక చేసిన సెలక్టర్లు బెయిలీ, మిషెల్ మార్ష్‌లను ఎంపిక చేయలేదు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌కు ఏకంగా 17 మందితో జట్టును ప్రకటించడం విశేషం. ఆస్ట్రేలియా టి20 జట్టు: ఫించ్ (కెప్టెన్), బోలాండ్, బోయ్స్, ఫాల్క్‌నర్, హేస్టింగ్స్, హెడ్, నాథన్ లియోన్, క్రిస్ లిన్, మ్యాక్స్‌వెల్, షాన్ మార్ష్, స్టీవ్ స్మిత్, కేన్ రిచర్డ్సన్, షాన్ టెయిట్, ఆండ్రూ టై, మ్యాథ్యూ వేడ్, డేవిడ్ వార్నర్, షేన్ వాట్సన్. -
వాట్సన్ వీడ్కోలు
లండన్ : యాషెస్ సిరీస్ అనంతరం ఆస్ట్రేలియా జట్టుకు మరో స్టార్ ఆటగాడు దూరమయ్యాడు. ఇప్పటికే మైకేల్ క్లార్క్, క్రిస్ రోజర్స్ రిటైర్మెంట్ ప్రకటించగా... తాజాగా సీనియర్ ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్ టెస్టు ఫార్మాట్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. యాషెస్ తొలి టెస్టులో విఫలమైన 34 ఏళ్ల వాట్సన్‌కు మిగిలిన మ్యాచ్ ల్లో చోటు దక్కలేదు. దీనికి తోడు నిరంతరం వెంటాడుతున్న గాయాల కారణంగా తన పదేళ్ల టెస్టు కెరీర్‌కు గుడ్‌బై చెప్పాలని నిర్ణయించుకున్నాడు. ఇంగ్లండ్‌తో శనివా రం జరిగిన రెండో వన్డేలో వాట్సన్ గాయపడడంతో ఈ సిరీస్ నుంచి కూడా తప్పుకోవాల్సి వచ్చింది. ‘టెస్టులకు గుడ్‌బై చెప్పాల్సిన సమయమిదేనని నాకు తెలుసు. ఈ నిర్ణయం అంత సులువుగా తీసుకోలేదు. గత నెలంతా దీర్ఘంగా ఆలోచించాను. అయితే వన్డే, టి20 ఫార్మాట్లో మాత్రం కొనసాగుతాను. ఇన్నాళ్లుగా జట్టు కోసం నా శాయశక్తులా సేవలందిం చాను’ అని క్రికెట్ ఆస్ట్రేలియా వెబ్సైట్లో పేర్కొన్నాడు. వన్డేల్లో విలువైన ఆటగాడిగా పేరు తెచ్చుకున్నా సుదీర్ఘ ఫార్మాట్లో వాట్సన్ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. 2005లో అరంగేట్రం చేసిన తను 59 టెస్టులు ఆడాడు. ఓ టెస్టుకు కెప్టెన్‌గా వ్యవహరిం చాడు. 3,731 పరుగుల్లో నాలుగు సెంచరీలుండగా, బౌలింగ్‌లోనూ రాణించి 75 వికెట్లు తీశాడు. -
వాట్సన్‌పై వేటు
నేటి నుంచి ఆసీస్, ఇంగ్లండ్ రెండో టెస్టు లండన్ : బ్యాటింగ్‌లో నిలకడలేమితో యాషెస్ తొలి టెస్టులో అనూహ్యంగా ఓటమిపాలైన ఆస్ట్రేలియా రెండో మ్యాచ్ కోసం సిద్ధమైంది. నేడు (గురువారం) లార్డ్స్‌లో ప్రారంభం కానున్న రెండో టెస్టులో ఇంగ్లండ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఇప్పటికే సిరీస్‌లో 0-1తో వెనుకబడ్డ ఆసీస్ ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్‌పై వేటు పడింది. తొలి టెస్టు రెండు ఇన్నింగ్స్‌ల్లో వాట్సన్ ఎల్బీగా అవుటయ్యాడు. దాంతో పాటు వికెట్లు తీయలేకపోయినా... క్లార్క్ ఎక్కువగా అతనికే బౌలింగ్ ఇవ్వడం విమర్శలకు దారితీసింది. ఈ నేపథ్యంలో వాట్సన్ స్థానంలో మిచెల్ మార్ష్‌ను తీసుకునేందుకు మేనేజ్మెంట్ సిద్ధమైంది. కుటుంబ కారణాల వల్ల వికెట్ కీపర్ బ్రాడ్ హాడిన్ కూడా ఈ మ్యాచ్ నుంచి వైదొలిగాడు. ఇతని స్థానంలో పీటర్ నివిల్ టెస్టుల్లో అరంగేట్రం చేయనున్నాడు. మరోవైపు తొలి టెస్టు గెలుపుతో ఇంగ్లండ్ పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంది. బ్యాటింగ్‌లో రూట్, స్టోక్స్, బెల్ ఫామ్‌లో ఉన్నారు. బౌలింగ్‌లో అందరూ సమష్టిగా తొలి టెస్టులో రాణించారు. అయితే ప్రధాన స్పిన్నర్ పాత్ర పోషిస్తున్న మొయిన్ అలీ ఈ మ్యాచ్‌కు గాయం కారణంగా అందుబాటులో ఉండటం లేదు. దీంతో ఆదిల్ రషీద్ ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగుతాడు. ఇంగ్లండ్ జట్టుతో అర్జున్ టెండూల్కర్ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ ఇంగ్లండ్ జట్టుతో కలిసి లార్డ్స్ మైదానంలో ప్రాక్టీస్ చేశాడు. బుధవారం ఇంగ్లండ్ జట్టు ప్రాక్టీస్ సెషన్లో సుదీర్ఘంగా బౌలింగ్ చేశాడు. భారత జట్టు, ముంబై ఇండియన్స్ జట్టుతో పాటు గతంలో అనేకసార్లు ప్రాక్టీస్ చేసిన అర్జున్ ఈసారి ఇంగ్లండ్ జట్టు యాషెస్ సెషన్లో ప్రాక్టీస్ చేయడం విశేషమే. ప్రస్తుతం సచిన్ కుటుంబసమేతంగా లండన్‌లో ఉన్నాడు. -
వాట్సన్‌కు తప్పిన ప్రమాదం
మెల్బోర్న్: ఆస్ట్రేలియా క్రికెటర్ 'ఫిలిప్ హ్యూస్ విషాద మరణం' ఆ జట్టును వెంటాడుతోంది. ఆసీస్ ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్‌కు పెద్ద ప్రమాదం తప్పింది. ప్రాక్టీస్ సెషన్ సందర్భంగా ఆసీస్ పేసర్ జేమ్స్ ప్యాటిన్సన్ వేసిన బౌన్సర్ వాట్సన్ హెల్మెట్‌కు బలంగా తాకింది. ఈ దెబ్బకు విలవిలలాడిపోయిన వాట్సన్ మోకాళ్లపై కూలబడ్డాడు. హెల్మెట్ పక్కనపడేసి తలను రెండు చేతులతో పట్టుకుని కొన్ని నిమిషాల పాటు అలాగే ఉండిపోయాడు. వెంటనే డాక్టర్ వచ్చి వాట్సన్‌కు చికిత్స చేశాడు. వాట్సన్ ప్రాక్టీస్ మానేసి వెళ్లిపోయాడు. ఈ ఘటనతో బిత్తరపోయిన ప్యాటిన్సన్ విచారవదనంతో కనిపించాడు. అతనూ నెట్స్ నుంచి వెళ్లిపోగా, ఇతర ఆసీస్ క్రికెటర్లు, అధికారులు అదే బాటపట్టారు. మంగళవారం మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో ఈ సంఘటన జరిగింది. వాట్సన్‌కు పెద్ద ప్రమాదం తప్పిందని జట్టు సభ్యులు చెప్పారు. దేశవాళీ మ్యాచ్‌లో బౌన్సర్ తగిలి హ్యూస్ మరణించిన సంగతి తెలిసిందే. వాట్సన్ గాయపడిన సందర్భంగా ఆసీస్ క్రికెటర్లకు మరోసారి ఈ పీడకల గుర్తుకువచ్చింది.