‘ప్రాక్టీస్’లో ఓడిన ఆస్ట్రేలియా | 'Practice' match defeat in Australia | Sakshi
Sakshi News home page

‘ప్రాక్టీస్’లో ఓడిన ఆస్ట్రేలియా

Published Mon, Mar 14 2016 12:57 AM | Last Updated on Tue, Aug 14 2018 3:47 PM

‘ప్రాక్టీస్’లో ఓడిన ఆస్ట్రేలియా - Sakshi

‘ప్రాక్టీస్’లో ఓడిన ఆస్ట్రేలియా

3 వికెట్లతో నెగ్గిన వెస్టిండీస్  హాజెల్‌వుడ్ హ్యాట్రిక్ వృథా

కోల్‌కతా: కెప్టెన్ డారెన్ స్యామీ (28 బంతుల్లో 50 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్) బ్యాటింగ్‌లో దుమ్మురేపడంతో... ఆదివారం జరిగిన టి20 ప్రపంచకప్ ప్రాక్టీస్ మ్యాచ్‌లో వెస్టిండీస్ 3 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై విజయం సాధించింది. ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 161 పరుగులు చేసింది.

వాట్సన్ (39 బంతుల్లో 60; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), స్మిత్ (29 బంతుల్లో 36; 1 ఫోర్), ఫించ్ (24 బంతుల్లో 33; 6 ఫోర్లు) రాణించారు. డ్వేన్ బ్రేవో 4, బెన్ 3 వికెట్లు తీశారు. తర్వాత వెస్టిండీస్ 19.5 ఓవర్లలో 7 వికెట్లకు 162 పరుగులు చేసింది. నాలుగో ఓవర్‌లోనే హాజెల్‌వుడ్... హోల్డర్ (6), శామ్యూల్స్ (0), బ్రేవో (0)లను అవుట్ చేసి హ్యాట్రిక్ సాధించినా... చివర్లో స్యామీ ధాటికి కంగారూలు చేతులెత్తేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement