కోహ్లి, గేల్ డ్యాన్స్ డ్యాన్స్... | Virat Kohli, Chris Gayle groove with carefree abandon, Shane Watson takes over vocals | Sakshi
Sakshi News home page

కోహ్లి, గేల్ డ్యాన్స్ డ్యాన్స్...

Published Fri, Apr 29 2016 12:52 AM | Last Updated on Sun, Sep 3 2017 10:58 PM

కోహ్లి, గేల్ డ్యాన్స్ డ్యాన్స్...

కోహ్లి, గేల్ డ్యాన్స్ డ్యాన్స్...

వాట్సన్ గిటార్ మోత
 
బెంగళూరు: ఐపీఎల్‌లో ఎన్ని జట్లున్నా సరదాల విషయంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తర్వాతే ఎవరైనా. మైదానంలో మ్యాచ్ ఫలితాలు ఎలా ఉన్నా... ఒక్కసారిగా హోటల్ చేరగానే వారంతా ‘కళాకారులు’ అయిపోతారు. అసలు ఆర్‌సీబీ జట్టు సభ్యులైన తర్వాతే ఆటగాళ్లకూ జోష్ వస్తుందేమో! ఇలాంటి వాటిలో ముందుండే క్రిస్ గేల్‌కు సూపర్ స్టార్ విరాట్ కోహ్లి కూడా జత కలిశాడు. జట్టు ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో వీరిద్దరు కలిసి కదంతొక్కారు. తమ నైపుణ్యాన్నంతా చూపెడుతూ సూపర్ డ్యాన్స్‌లతో చెలరేగారు. వీరి నృత్య ప్రదర్శనతో అక్కడి వేదిక దద్దరిల్లింది.

కోహ్లి, గేల్ తమ నాట్యంతో ఆకట్టుకుంటే... మరో ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్ తన సంగీత నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. 2011నాటి డేవిడ్ గ్వెట్టా సూపర్ హిట్ సాంగ్ ‘టైటానియం’ను పాడుతూ, మరోవైపు చక్కగా గిటార్ మోగిస్తూ ద్విపాత్రాభినయం చేశాడు. ఆర్‌సీబీ టీమ్‌లో మరో స్టార్ డివిలియర్స్ ఈ షో లో భాగం కాకపోయినా...అతని భార్య డేనియల్లె డివిలియర్స్ తన మధుర గాత్రంతో వాట్సన్‌తో గొంతు కలపడం మరో విశేషం. మొత్తంగా బెంగళూరు ఆటగాళ్లు ఎప్పటిలాగే తమ ఐపీఎల్ సీజన్‌ను కలర్‌ఫుల్‌గా మార్చుకుంటున్నారు. శనివారం సన్‌రైజర్స్ జట్టుతో తలపడేందుకు బెంగళూరు జట్టు  గురువారం హైదరాబాద్‌కు చేరుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement