భారత్ తో టి20 సిరీస్ కు శ్రీలంక జట్టు | Fast bowler Dilhara Fernando picked in Sri Lanka T20 squad for India series | Sakshi
Sakshi News home page

భారత్ తో టి20 సిరీస్ కు శ్రీలంక జట్టు

Published Fri, Jan 29 2016 12:28 AM | Last Updated on Sun, Sep 3 2017 4:29 PM

Fast bowler Dilhara Fernando picked in Sri Lanka T20 squad for India series

కొలంబో: భారత్‌తో జరిగే టి20 సిరీస్ కోసం శ్రీలంక 15 మంది ఆటగాళ్లతో కూడిన జట్టును ప్రకటించింది. వచ్చే నెల 9 నుంచి 14 వరకు భారత్‌లో జరిగే సిరీస్‌కు చండిమాల్ లంకకు సారథ్యం వహిస్తాడు. మలింగ గాయంతో బాధపడుతుండడంతో దిల్హార ఫెర్నాండో జట్టులోకి వచ్చాడు. తొలి మ్యాచ్ 9న పుణేలో, రెండో మ్యాచ్ 12న ఢిల్లీలో, చివరి మ్యాచ్ 14న విశాఖలో జరుగుతాయి. గాయం కారణంగా మాథ్యూస్ కూడా ఈ సిరీస్‌లో ఆడటం లేదు.

 శ్రీలంక జట్టు: చండిమాల్ (కెప్టెన్), దిల్షాన్, ప్రసన్న, సిరివర్ధన, గుణతిలక, పెరీరా, షనక, గుణరత్నే, కపుగెడెర, చమీర, ఫెర్నాండో, రజిత, బినుర ఫెర్నాండో, సేనానాయకే, వాండర్సే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement