కరాచీ : ఆరేళ్ల విరామం తర్వాత పాకిస్తాన్ దేశంలో అంతర్జాతీయ క్రికెట్ నిర్వహణకు దారులు తెరచుకున్నాయి. 2009 మార్చిలో లాహోర్‌లో శ్రీలంక జట్టుపై తీవ్రవాదుల దాడి తర్వాత అన్ని దేశాలు తమ జట్లను పాక్‌లో ఆడించరాదని నిర్ణయించాయి. ఇప్పుడు జింబాబ్వే జట్టు ఆ దేశంలో పర్యటించే అవకాశం ఉంది. ఇటీవల ఇరు బోర్డుల మధ్య చర్చల అనంతరం వన్డే, టి20 సిరీస్‌లు దాదాపుగా ఖరారు అయ్యాయి. దీని ప్రకారం పాక్, జింబాబ్వే మధ్య 3 వన్డేలు, 2 టి20 మ్యాచ్‌లు జరుగుతాయి. ‘మ్యాచ్‌ల వివరాలను ఇప్పటికే జింబాబ్వే బోర్డుకు పంపించాం. వారు కోరినట్లుగా భద్రతా వివరాలు కూడా అందించాం. ఇక అధికారిక అనుమతి రావడమే మిగిలి ఉంది. సిరీస్‌లు జరుగుతాయని ఆశిస్తున్నాం’ అని పాక్ బోర్డు సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు.