టి-20 సిరీస్ ఓడిన భారత్ | Newzealand women beats india in 2nd t-20 | Sakshi
Sakshi News home page

టి-20 సిరీస్ ఓడిన భారత్

Published Mon, Jul 13 2015 3:28 PM | Last Updated on Wed, Oct 17 2018 4:43 PM

టి-20 సిరీస్ ఓడిన భారత్ - Sakshi

టి-20 సిరీస్ ఓడిన భారత్

బెంగళూరు: న్యూజిలాండ్తో మూడు టి-20ల సిరీస్లో భారత్ అమ్మాయిలకు వరుసగా రెండో ఓటమి ఎదురైంది. దీంతో భారత్ మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ను 0-2తో కోల్పోయింది. సోమవారం జరిగిన రెండో టి-20లో భారత్ 6 వికెట్లతో తేడాతో కివీస్ చేతిలో ఓడిపోయింది.

ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లకు 136 పరుగులు చేసింది. వనిత 41,  హర్మన్ ప్రీత్ కౌర్ 30, వేద కృష్ణమూర్తి 29 పరుగులు చేశారు. అనంతరం న్యూజిలాండ్ మరో 13 బంతులు మిగిలుండగా 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సాధించింది. రెచల్ ప్రీస్ట్ (60) హాఫ్ సెంచరీతో రాణించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement