విశాఖపట్నం: భారత మహిళలతో మూడు టి-20ల సిరీస్ను శ్రీలంక మహిళల జట్టు 2-1తో కైవసం చేసుకుంది. మంగళవారం ఇక్కడి వైఎస్ రాజశేఖర రెడ్డి క్రికెట్ స్టేడియంలో జరిగిన చివరి, మూడో టి-20లో శ్రీలంక జట్టు ఆరు వికెట్లతో విజయం సాధించింది.
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్కు దిగిన భారత్ నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 117 పరుగులు చేసింది. జట్టులో పూనమ్ రౌత్ (38) టాప్ స్కోరర్. రౌత్తో పాటు జులాన్ గోస్వామి (37 నాటౌట్), ఏక్తా బిస్త్ (15) మినహా ఇతర బ్యాట్స్వుమెన్ రెండంకెల స్కోరు సాధించలేకపోయారు. లక్ష్యఛేదనలో శ్రీలంక నాలుగు వికెట్లు కోల్పోయి మరో ఏడు బంతులు మిగిలుండగా విజయతీరాలకు చేరింది. లంక కెప్టెన్ సిరివర్దనె (46 నాటౌట్) రాణించింది. భారత బౌలర్లలో ఏక్తా బిస్త్ రెండు, సోనియా డబీర్ వికెట్ తీశారు.
మూడో టి-20లో భారత మహిళల ఓటమి
Published Tue, Jan 28 2014 1:26 PM | Last Updated on Fri, Nov 9 2018 6:43 PM
Advertisement
Advertisement