కౌలాలంపూర్: మహిళల ఆసియాకప్‌లో భాగంగా భారత్‌తో జరుగుతున్న టీ20 మ్యాచ్‌లో శ్రీలంక 108 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక జట్టులో యశోదా మెండిస్(27), హసిని పెరీరా(46 నాటౌట్) మినహా ఎవరూ రాణించలేదు. ఏడుగురు క్రీడాకారిణులు సింగిల్ డిజిట్‌కే పరిమితం కావడంతో శ్రీలంక సాధారణ స్కోరుకే పరిమితమైంది. భారత బౌలర్లలో ఏక్తా బిస్త్ రెండు వికెట్లు సాధించగా, గోస్వామి, అనుజా పటేల్, పూనమ్ యాదవ్‌లు తలో వికెట్ తీశారు.
ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంకకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ హన్సిక(2) నాల్గో ఓవర్‌లోనే పెవిలియన్ చేరి నిరాశపరిచింది. ఆ తరుణంలో యశోదా మెండిస్- హసిని పెరీరా ద్వయం ఇన్నింగ్స్‌ను నడిపించింది. వీరిద్దరూ 38 పరుగుల భాగస్వామ్యాన్ని జత చేసిన తర్వాత యశోద పెవిలియన్ చేరింది. ఆపై స్వల్ప వ్యవధిలో శ్రీలంక వికెట్లు కోల్పోవడంతో నెమ్మదిగా బ్యాటింగ్ చేసింది. దాంతో లంక మహిళలు నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 107 పరుగులు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment