కౌలాలంపూర్ : ఆసియాకప్ మహిళల టీ20 క్రికెట్ టోర్నీలో భారత మహిళల జట్టు జైత్రయాత్రకు బ్రేక్ పడింది. గురువారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిఫెండింగ్ చాంపియన్ హర్మన్ ప్రీత్ సేన చిత్తుగా ఓడింది. టాస్ గెలిచిన భారత మహిళలు తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నారు. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 37 బంతుల్లో 6 ఫోర్లతో అజేయంగా 42 పరుగులు సాధించగా దీప్తీ శర్మ(32), వస్త్రాకర్(20)లు రాణించడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లకు 7 వికెట్లు నష్టపోయి 141 పరుగులు చేసింది.
ఫర్గానా అజేయ హాఫ్ సెంచరీ..
142 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ మహిళలు సునాయసంగా విజయాన్నందుకుని చరిత్ర సృష్టించారు. మహిళల ఆసియా కప్ చరిత్రలో భారత్‌పై నెగ్గిన తొలి జట్టుగా బంగ్లాదేశ్ రికార్డు సృష్టించింది. బంగ్లాదేశ్ మహిళల్లో ఓపెనర్ షమిమా సుల్తానా(33) శుభారంభం అందించగా.. ఫర్గానా హోక్ (52 నాటౌట్) హాఫ్ సెంచరీ, రుమానా అహ్మద్ (42)లు చెలరేగారు. దీంతో బంగ్లాదేశ్ కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి రెండు బంతులు మిగిలి ఉండగానే విజయాన్నందుకుంది. పోరాడే లక్ష్యమైనా భారత బౌలర్లు విఫలమవ్వడంతో విజయం చేజారింది. భారత బౌలర్లలో వస్త్రాకర్, గైక్వాడ్, పూనమ్ యాదవ్‌లు తలో వికెట్ తీశారు. ఈ టోర్నీలో థాయ్‌లాండ్, మలేషియాలను చిత్తుగా ఓడించిన భారత్.. బంగ్లా చేతిలో చిత్తయింది.
Comments
Please login to add a commentAdd a comment