మహిళల విజయం.. పురుషుల సంబరం | Emotions of The Bangladesh Mens Over Women Clinch the Asia Cup | Sakshi
Sakshi News home page

ఇప్పుడేసుకోండి నాగినీ డ్యాన్స్‌..

Published Sun, Jun 10 2018 4:22 PM | Last Updated on Sun, Jun 10 2018 4:37 PM

Emotions of The Bangladesh Mens Over Women Clinch the Asia Cup - Sakshi

హైదరాబాద్‌ : ఆసియాకప్‌  మహిళల టీ20 టైటిల్‌ను గెలిచి బంగ్లాదేశ్‌ చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఆదివారం భారత్‌తో జరిగిన ఉత్కంఠపోరులో చివరి బంతికి విజయాన్నందుకున్న బంగ్లాదేశ్‌ మహిళలు తొలిసారి ఆసియాకప్‌ టైటిల్‌ను గెలుచుకున్నారు. ఈ విజయానంతరం బంగ్లా మహిళా క్రికెటర్లంతా మైదానంలో చిందేయగా.. ఆ దేశ పురుష క్రికెటర్లు మాత్రం టీవీ ముందు సంబరాలు చేసుకున్నారు. 

ఆద్యంతం ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌ను టీవీలో చూసిన బంగ్లా పురుషుల జట్టు..విజయానంతరం తామే గెలిచినట్లు సంబరాలు చేసుకున్నారు. మైదానంలో ఉండి తమ జట్టుకు మద్దతు తెలుపుతున్నట్లే చప్పట్లు కొడుతూ.. విజయాన్ని ఆస్వాదించారు. దీనికి సంబంధించిన వీడియో  ప్రస్తుతం నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తోంది. ఈ వీడియోను బంగ్లా మాజీ టెస్టు కెప్టెన్‌, ఓపెనింగ్‌ బ్యాట్స్‌మన్‌ తమీమ్‌ ఇక్బాల్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. దీనికి క్యాఫ్షన్‌గా ‘ఈ ఏడాది మహిళలకు కలిసొచ్చింది.. పురుషులు కూడా ఇలానే విజయంసాధిస్తారు’ అని పేర్కొన్నాడు. అయితే అభిమానులు మాత్రం ఇక ‘ఇప్పుడేసుకోండి నాగినీ డ్యాన్స్‌..’ అంటూ కామెంట్‌ చేస్తున్నారు. ఇటీవల అఫ్గానిస్తాన్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో బంగ్లాదేశ్‌ పురుషుల జట్టు దారుణంగా క్లీన్‌ స్వీప్‌ అయిన విషయం తెలిసిందే. 

చదవండి: ఫైనల్లో భారత్‌కు చుక్కెదురు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement