దక్షిణాఫ్రికా ‘క్లీన్‌స్వీప్’ | South Africa Twenty20 series Clean sweep | Sakshi
Sakshi News home page

దక్షిణాఫ్రికా ‘క్లీన్‌స్వీప్’

Published Wed, Jul 8 2015 1:07 AM | Last Updated on Sun, Sep 3 2017 5:04 AM

దక్షిణాఫ్రికా ‘క్లీన్‌స్వీప్’

దక్షిణాఫ్రికా ‘క్లీన్‌స్వీప్’

- రెండో టి20లోనూ బంగ్లాదేశ్‌పై విజయం
మిర్పూర్:
బంగ్లాదేశ్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను దక్షిణాఫ్రికా క్లీన్‌స్వీప్ చేసింది. ఆల్‌రౌండ్ నైపుణ్యంతో అదరగొట్టిన సఫారీ జట్టు... మంగళవారం జరిగిన రెండో టి20లో 31 పరుగుల తేడాతో బంగ్లాపై విజయం సాధించింది. షేర్ ఎ బంగ్లా జాతీయ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో... టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 4 వికెట్లకు 169 పరుగులు చేసింది. డికాక్ (31 బంతుల్లో 44; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), డివిలియర్స్ (34 బంతుల్లో 40; 6 ఫోర్లు), మిల్లర్ (28 బంతుల్లో 30 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్), రోసోవ్ (6 బంతుల్లో 19 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్సర్లు) రాణించారు.  తర్వాత బంగ్లా 19.2 ఓవర్లలో 138 పరుగులకు ఆలౌటైంది. సౌమ్య సర్కార్ (21 బంతుల్లో 37; 6 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్.  అబాట్, లీ, ఫాంగిసో తలా మూడు వికెట్లు తీశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
Advertisement