రెండో టి20లో కివీస్ విజయం
సెంచూరియన్ : దక్షిణాఫ్రికాతో జరిగిన రెండు టి20ల సిరీస్‌ను న్యూజిలాండ్ జట్టు 1-1తో సమం చేసుకుంది. ఆదివారం సూపర్ స్పోర్ట్ పార్క్‌లో జరిగిన చివరి మ్యాచ్‌లో కివీస్ 32 పరుగులతో నెగ్గింది. తొలి మ్యాచ్‌లో సఫారీలు గెలిచారు. 19 నుంచి ఇరు జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ జరుగుతుంది. టాస్ నెగ్గి బ్యాటింగ్‌కు దిగిన ఆతిథ్య జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లకు 177 పరుగులు చేసింది. ఓపెనర్ గప్టిల్ (35 బంతుల్లో 60; 6 ఫోర్లు; 3 సిక్సర్లు), నీషమ్ (19 బంతుల్లో 28; 3 ఫోర్లు; 1 సిక్స్), విలియమ్సన్ (17 బంతుల్లో 25; 4 ఫోర్లు; 1 సిక్స్) వేగంగా ఆడి రాణించారు. రబడకు మూడు వికెట్లు దక్కాయి.
అనంతరం లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన ప్రోటీస్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడింది. చివరకు 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 145 పరుగులు చేసి ఓడింది. బెహర్డీన్ (27 బంతుల్లో 36; 3 ఫోర్లు; 1 సిక్స్), మిల్లర్ (20 బంతుల్లో 29; 2 ఫోర్లు; 1 సిక్స్) ఓ మాదిరిగా ఆడారు. నాథన్ మెకల్లమ్, మెక్లెనెగాన్, సోధిలకు రెండేసి వికెట్లు దక్కాయి.
సిరీస్ సమం
Published Mon, Aug 17 2015 1:58 AM | Last Updated on Sun, Sep 3 2017 7:33 AM
Advertisement
Advertisement