టి20 సిరీస్ విండీస్‌దే | India's defeat in the second match | Sakshi
Sakshi News home page

టి20 సిరీస్ విండీస్‌దే

Published Sun, Nov 20 2016 11:34 PM | Last Updated on Mon, Sep 4 2017 8:38 PM

India's defeat in the second match

రెండో మ్యాచ్‌లోనూ భారత్ ఓటమి 

విజయవాడ స్పోర్‌‌ట్స: వన్డే సిరీస్‌ను 0-3తో కోల్పోరుున వెస్టిండీస్ మహిళల క్రికెట్ జట్టు టి20 సిరీస్‌లో మాత్రం రాణిస్తోంది. భారత జట్టుతో ఆదివారం జరిగిన రెండో టి20 మ్యాచ్‌లో ప్రపంచ చాంపియన్ వెస్టిండీస్ 31 పరుగుల ఆధిక్యంతో గెలిచింది. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను 2-0తో సొంతం చేసుకుంది.

138 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 18.1 ఓవర్లో 106 పరుగులకే ఆలౌటై ఓటమి పాలైంది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (37 బంతుల్లో 43 పరుగులు; 3 సిక్స్‌లు, 1 ఫోరు) మినహా మిగతావారు విఫలమయ్యారు. అంతకుముందు వెస్టిండీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. చివరి టి20 మ్యాచ్ ఇదే గ్రౌండ్‌లో ఈనెల 22న జరుగనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement