West Indies womens cricket team
-
వెస్టిండీస్ స్టార్ క్రికెటర్ సంచలన నిర్ణయం.. రిటైర్మెంట్ వెనక్కి
వెస్టిండీస్ క్రికెట్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. విండీస్ మహిళ క్రికెట్ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ డియాండ్రా డాటిన్ తన రిటైర్మెంట్ను వెనక్కి తీసుకుంది. వెస్టిండీస్ క్రికెట్ అధికారులతో చర్చలు జరిపిన అనంతరం తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు డాటిన్ తెలిపింది. కాగా 2022లో జట్టులో అంతర్గత విభేదాలు వల్ల డాటిన్ అంతర్జాతీయ విడ్కోలు పలికింది.అయితే ఈ ఏడాది ఆక్టోబర్‌లో బంగ్లాదేశ్ వేదికగా జరగనున్న మహిళల టీ20 వరల్డ్‌కప్ దృష్ట్యా.. డాటిన్ తన రిటైర్మెంట్పై యూటర్న్ తీసుకుంది. "అంతర్జాతీయ క్రికెట్లో వెస్టిండీస్‌కు ప్రాతినిధ్యం వహించడం ఎల్లప్పుడూ గర్వంగానే భావిస్తాను. క్రికెట్ వెస్టిండీస్ ప్రెసిడెంట్ డాక్టర్. కిషోర్ షాలోతో చర్చలు అనంతరం నా నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాను. తిరిగి విండీస్ జెర్సీని ధరించేందుకు సిద్దమయ్యాను. మళ్లీ జట్టులో తిరిగి చేరేందుకు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నాను.వెస్టిండీస్ మహిళల జట్టుకు అన్ని ఫార్మాట్లలో నా వంతు సహకారం అందించేందుకు ప్రయత్నిస్తాను. నా నిర్ణయం తక్షణమే అమలులోకి వస్తుందని డాటిన్ ఓ ప్రకటనలో పేర్కొంది. ఇక 2008లో డాటిన్ విండీస్ తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేసింది. ఇప్పటి వరకు తన అంతర్జాతీయ కెరీర్లో 146 వన్డేలు, 126 టీ20ల్లో విండీస్‌కు ప్రాతినిధ్యం వహించింది. అదే విధంగా తొలి టీ20 ప్రపంచకప్ గెలిచిన విండీస్ జట్టులో డాటిన్ భాగంగా ఉంది. -
ఇంగ్లండ్ మహిళల జోరు
డెర్బీ: వెస్టిండీస్ మహిళలతో జరుగుతోన్న ఐదు టి20 మ్యాచ్‌ల సిరీస్‌లో ఆతిథ్య ఇంగ్లండ్ మహిళల జట్టు ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. బుధవారం అర్ధరాత్రి ముగిసిన రెండో టి20 మ్యాచ్‌లో ఇంగ్లండ్ 47 పరుగుల తేడాతో వెస్టిండీస్‌పై విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. సారా గ్లెన్ (26; 4 ఫోర్లు), ఆమీ జోన్స్ (25; 1 ఫోర్, 1 సిక్స్), టామ్సిన్ బ్యూమోంట్ (21; 4 ఫోర్లు) రాణించారు. ప్రత్యర్థి బౌలర్లలో షకీరా సెల్మన్, స్టెఫానీ టేలర్ చెరో 2 వికెట్లు దక్కించుకున్నారు. అనంతరం సాధారణ లక్ష్యఛేదనలో వెస్టిండీస్ తడబడింది. బౌలర్లు సోఫీ ఎకెల్‌స్టోన్ (2/19), సారా గ్లెన్ (2/24), మ్యాడీ విలియర్స్ (2/10) కట్టుదిట్టంగా బంతులేయడంతో వెస్టిండీస్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 104 పరుగులే చేసి పరాజయం పాలైంది. డాటిన్ (40 బంతుల్లో 38; 4 ఫోర్లు, 1 సిక్స్), కెప్టెన్ స్టెఫానీ టేలర్ (31 బంతుల్లో 28; 4 ఫోర్లు) మినహా మిగతా బ్యాట్స్‌మెన్ సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు. ఇరు జట్ల మధ్య మూడో టి20 మ్యాచ్ శనివారం జరుగనుంది. ఆరు నెలల తర్వాత ఈ రెండు జట్ల మధ్య టి20 సిరీస్‌తో అంతర్జాతీయ మహిళల క్రికెట్ పునః ప్రారంభమైంది. -
టి20 సిరీస్ విండీస్‌దే
రెండో మ్యాచ్‌లోనూ భారత్ ఓటమి విజయవాడ స్పోర్ట్స: వన్డే సిరీస్‌ను 0-3తో కోల్పోరుున వెస్టిండీస్ మహిళల క్రికెట్ జట్టు టి20 సిరీస్‌లో మాత్రం రాణిస్తోంది. భారత జట్టుతో ఆదివారం జరిగిన రెండో టి20 మ్యాచ్‌లో ప్రపంచ చాంపియన్ వెస్టిండీస్ 31 పరుగుల ఆధిక్యంతో గెలిచింది. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను 2-0తో సొంతం చేసుకుంది. 138 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 18.1 ఓవర్లో 106 పరుగులకే ఆలౌటై ఓటమి పాలైంది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (37 బంతుల్లో 43 పరుగులు; 3 సిక్స్‌లు, 1 ఫోరు) మినహా మిగతావారు విఫలమయ్యారు. అంతకుముందు వెస్టిండీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. చివరి టి20 మ్యాచ్ ఇదే గ్రౌండ్లో ఈనెల 22న జరుగనుంది.