పాకిస్తాన్‌దే టి20 సిరీస్ | Victory in the second match against Zimbabwe | Sakshi
Sakshi News home page

పాకిస్తాన్‌దే టి20 సిరీస్

Published Wed, Sep 30 2015 12:32 AM | Last Updated on Sat, Mar 23 2019 7:58 PM

పాకిస్తాన్‌దే టి20 సిరీస్ - Sakshi

పాకిస్తాన్‌దే టి20 సిరీస్

రెండో మ్యాచ్‌లోనూ జింబాబ్వేపై విజయం
 

హరారే: జింబాబ్వేతో 2 మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను పాకిస్తాన్ చేజిక్కించుకుంది. ఆదివారం తొలి టి20లో నెగ్గిన పాక్, మంగళవారం జరిగిన రెండో మ్యాచ్‌లో 15 పరుగుల తేడాతో జింబాబ్వేను ఓడించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పాక్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 136 పరుగులు చేసింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ ఉమర్ అక్మల్ (28 బంతుల్లో 38 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) టాప్‌స్కోరర్‌గా నిల వగా, మఖ్సూద్ (25 బంతుల్లో 26; 3 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు.

జాంగ్వే, పన్యగారా చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం జింబాబ్వే 20 ఓవర్లలో 7 వికెట్లకు 121 పరుగులు మాత్రమే చేయగలిగింది. సీన్ విలియమ్స్ (36 బంతుల్లో 40 నాటౌట్; 4 ఫోర్లు), సికందర్ రజా (36 బంతుల్లో 36; 1 ఫోర్) ఐదో వికెట్‌కు 60 పరుగులు జోడించినా జట్టును గెలిపించలేకపోయారు. ఇర్ఫాన్, ఇమ్రాన్ చెరో 2 వికెట్లు తీశారు. ఇమాద్ వసీంకు ‘మ్యాన్ ఆఫ్ ద సిరీ స్’ అవార్డు దక్కింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement