న్యూజిలాండ్ 398/5 | New Zealand 398/5 | Sakshi
Sakshi News home page

న్యూజిలాండ్ 398/5

Published Sat, Jun 13 2015 12:32 AM | Last Updated on Sun, Sep 3 2017 3:38 AM

New Zealand 398/5

ఇంగ్లండ్‌తో రెండో వన్డే

 లండన్ : తొలి వన్డేలో ఘోర ఓటమిని మూటగట్టుకున్న న్యూజిలాండ్ తొందరగానే తేరుకుంది. బ్యాటింగ్‌లో విశేషంగా రాణించడంతో ఇంగ్లండ్‌తో శుక్రవారం జరిగిన రెండో వన్డేలో భారీ స్కోరు చేసింది. రాస్ టేలర్ (96 బంతుల్లో 119 నాటౌట్; 10 ఫోర్లు, 4 సిక్సర్లు) సెంచరీకి తోడు విలియమ్సన్ (88 బంతుల్లో 93; 12 ఫోర్లు, 1 సిక్స్) చెలరేగడంతో కివీస్ 50 ఓవర్లలో 5 వికెట్లకు 398 పరుగులు చేసింది. కెన్నింగ్స్‌టన్ ఓవల్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి కివీస్ బ్యాటింగ్ ఎంచుకుంది.

ఓపెనర్లలో మెకల్లమ్ (39) విఫలమైనా.. గుప్టిల్ (54 బంతుల్లో 50; 6 ఫోర్లు, 1 సిక్స్) ఆకట్టుకున్నాడు. తర్వాత విలియమ్సన్ దూకుడుగా ఆడగా, టేలర్ కీలక భాగస్వామ్యాలతో ఇన్నింగ్స్‌కు వెన్నెముకగా నిలిచాడు. ఈ ఇద్ద రు మూడో వికెట్‌కు 121 పరుగులు జోడించారు. ఇలియట్ (32), రోంచి (33) ఓ మోస్తరుగా ఆడారు. స్టోక్స్ 2 వికెట్లు తీశాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement