ఆస్ట్రేలియా వెటరన్ ఆటగాడు డేవిడ్ వార్నర్ అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లలో 100కు పైగా మ్యాచ్‌లు ఆడిన మూడో ఆటగాడిగా, తొలి ఆస్ట్రేలియా ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పాడు.
మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా హోబర్ట్ వేదికగా వెస్టిండీస్‌తో ఇవాళ (ఫిబ్రవరి 9) జరుగుతున్న తొలి మ్యాచ్ వార్నర్ టీ20 కెరీర్‌లో 100వది. ఇటీవలే వన్డే, టెస్ట్ ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన 37 ఏళ్ల వార్నర్ ఇప్పటివరకు 112 టెస్ట్‌లు, 161 వన్డేలు, 100 టీ20లు ఆడాడు.
వార్నర్‌కు ముందు ఈ ఘనత న్యూజిలాండ్ మాజీ ఆటగాడు రాస్ టేలర్, టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి మాత్రమే సాధించారు. రాస్ టేలర్ 112 టెస్ట్‌లు, 236 వన్డేలు, 102 టీ20లు ఆడగా.. కోహ్లి 113 టెస్ట్‌లు, 292 వన్డేలు, 117 టీ20లు ఆడాడు.
ఇదిలా ఉంటే, వార్నర్ తన 100వ టీ20లో ఆకాశమే హద్దుగా చెలరేగి ఆసీస్ భారీ స్కోర్ సాధించేందకు గట్టి పునాది వేశాడు. ఈ మ్యాచ్‌లో కేవలం 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసిన వార్నర్.. మొత్తంగా 36 బంతులు ఎదుర్కొని 12 ఫోర్లు, సిక్సర్ సాయంతో 70 పరుగులు చేసి అల్జరీ జోసఫ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.
వార్నర్ ఔటయ్యాక ఆసీస్ వరసగా వికెట్లు కోల్పోవడంతో స్కోర్ వేగం మందగించింది. 17 ఓవర్ల తర్వత ఆ జట్టు స్కోర్ 173/5గా ఉంది. వార్నర్, జోష్ ఇంగ్లిస్ (39), మిచెల్ మార్ష్ (16), మ్యాక్స్‌వెల్ 10), స్టోయినిస్ (9) ఔట్ కాగా.. టిమ్ డేవిడ్ (18), మాథ్యూ వేడ్ (6) క్రీజ్‌లో ఉన్నారు. విండీస్ బౌలరల్లో అల్జరీ జోసఫ్ 2, జేసన్ హోల్డర్, ఆండ్రీ రసెల్, రొమారియో షెపర్డ్ తలో వికెట్ పడగొట్టారు.
ఇదిలా ఉంటే, 2 టెస్ట్‌లు, 3 వన్డేలు, 3 టీ20ల సిరీస్‌ల కోసం వెస్టిండీస్ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంది. టెస్ట్ సిరీస్ 1-1తో సమం కాగా.. వన్డే సిరీస్‌ను ఆసీస్ క్లీన్‌స్వీప్ (3-0) చేసింది. రెండు, మూడు టీ20లు ఫిబ్రవరి 11, 13 తేదీల్లో అడిలైడ్, పెర్త్ వేదికలుగా జరుగనున్నాయి
Comments
Please login to add a commentAdd a comment