![Australia Beat West Indies By 11 Runs In 1st T20I - Sakshi](/styles/webp/s3/article_images/2024/02/9/Untitled-9.jpg.webp?itok=Mt_rDavo)
మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా హోబర్ట్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఆతిథ్య ఆస్ట్రేలియా 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారీ లక్ష్య ఛేదనలో విండీస్ చివరివరకు అద్భుతంగా పోరాడింది. వెస్టిండీస్ బ్యాటింగ్ లైనప్ చూస్తే ఎంతటి భారీ స్కోర్‌లనైనా ఛేదిస్తుందని అనిపించింది. జట్టులో దాదాపుగా అందరూ బ్యాట్‌తో మెరుపులు మెరిపించగల సమర్ధులే. ఇంతటి విధ్వంసకర బ్యాటింగ్ లైనప్ ఉన్నా విండీస్ ఆసీస్ చేతిలో ఓటమిపాలైంది.
మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. కెరీర్‌లో వందో మ్యాచ్ ఆడుతున్న డేవిడ్ వార్నర్ (70) విజృంభించడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 213 పరుగుల భారీ స్కోర్ చేసింది. జోష్ ఇంగ్లిస్ (39), టిమ్ డేవిడ్ (37 నాటౌట్), వేడ్ (21) వేగంగా పరుగులు సాధించగా.. మిచెల్ మార్ష్ (16), మ్యాక్స్‌వెల్ (10), స్టోయినిస్ (9), అబాట్ (0) నిరాశపరిచారు. విండీస్ బౌలరల్లో రసెల్ 3 వికెట్లు, అల్జరీ జోసఫ్ 2, హోల్డర్, షెపర్డ్ తలో వికెట్ పడగొట్టారు.
అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన విండీస్.. నిర్ణీత ఓవర్లలో 202 పరుగులకు పరిమితమై (8 వికెట్లు కోల్పోయి) 11 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. విండీస్ ఓపెనర్లు బ్రాండన్ కింగ్ (53), జాన్సన్ చార్లెస్ (42) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడి తొలి వికెట్‌కు 89 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసినప్పటికీ.. ఆతర్వాత వచ్చివారు తుస్సుమనిపించడంతో విండీస్ చేతులెత్తేసింది.
ఆఖర్లో జేసన్ హోల్డర్ (34 నాటౌట్) విధ్వంసకర ఇన్నింగ్స్‌తో విరుచుకుపడి విండీస్ శిబిరంలో ఆశలు రేకెత్తించాడు. పూరన్ (18), పావెల్ (14), హోప్ (16), రసెల్ (1), రూథర్‌ఫోర్డ్ (7), షెపర్డ్ (2) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. ఆసీస్ బౌలర్లలో జంపా 3, స్టోయినిస్ 2, బెహ్రెన్‌డార్ఫ్, మ్యాక్స్‌వెల్, అబాట్ తలో వికెట్ పడగొట్టారు. రెండో టీ20 ఫిబ్రవరి 11న అడిలైడ్‌లో జరుగనుంది.
Comments
Please login to add a commentAdd a comment