స్వదేశంలో వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను ఆస్ట్రేలియా మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0 తేడాతో కైవసం చేసుకుంది. సిడ్నీ వేదికగా ఇవాళ (ఫిబ్రవరి 4) జరిగిన రెండో వన్డేలో ఆస్ట్రేలియా 83 పరుగుల తేడాతో విండీస్‌ను చిత్తు చేసింది. ఆసీస్ ఆటగాడు సీన్ అబాట్ ఆల్‌రౌండ్ షోతో (69 పరుగులు, 3 వికెట్లు) విండీస్‌ను ఓడించాడు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా.. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. ఎనిమిదో స్థానంలో వచ్చిన అబాట్ 63 బంతుల్లో 4 సిక్సర్లు, బౌండరీ సాయంతో 69 పరుగులు చేసి ఆసీస్‌కు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. ఆసీస్ ఇన్నింగ్స్‌లో గ్రీన్ (33), షార్ట్ (41), లబూషేన్ (26), ఆరోన్ హార్డీ (26) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. విండీస్ బౌలరల్లో గుడకేశ్ మోటీ 3 వికెట్లతో ఆసీస్ పతనాన్ని శాశించగా.. అల్జరీ జోసఫ్, రొమారియో షెపర్డ్ తలో 2 వికెట్లు, మాథ్యూ ఫోర్డ్, ఒషేన్ థామస్ చెరో వికెట్ పడగొట్టారు.
అనంతరం సాధారణ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన విండీస్.. సీన్ అబాట్ (3/40), జోష్ హాజిల్‌వుడ్ (3/43) విజృంభించడంతో 43.3 ఓవర్లలో 175 పరుగులకు కుప్పకూలింది. సదర్‌ల్యాండ్ 2, ఆరోన్ హార్డీ, ఆడమ్ జంపా తలో వికెట్ పడగొట్టారు. విండీస్ ఇన్నింగ్స్‌లో కీసీ కార్టీ (40) టాప్ స్కోరర్‌గా నిలువగా.. అలిక్ అథనాజ్ (11), షాయ్ హోప్ (29), రోస్టన్ చేజ్ (25), అల్జరీ జోసఫ్ (19) రెండంకెల స్కోర్ చేశారు.
ఈ సిరీస్‌లో జరిగిన తొలి వన్డేలో ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీనికి ముందు ఇరు జట్ల మధ్య జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ 1-1తో డ్రాగా ముగిసింది. వన్డే సిరీస్‌లో చివరిదైన మూడో వన్డే ఫిబ్రవరి 6న జరుగనుంది. వన్డే సిరీస్ అనంతరం ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కూడా జరుగనుంది. ఫిబ్రవరి 9, 11, 13 తేదీల్లో ఈ మ్యాచ్‌లు జరుగనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment