మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఆస్ట్రేలియా మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0 తేడాతో కైవసం చేసుకుంది. అడిలైడ్ వేదికగా ఇవాళ (ఫిబ్రవరి 11) జరిగిన రెండో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 34 పరుగుల తేడాతో విజయం సాధించింది. మ్యాక్స్‌వెల్ విధ్వంకర శతకంతో (55 బంతుల్లో 120; 12 ఫోర్లు, 8 సిక్సర్లు) విరుచుకుపడటంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 241 పరుగుల భారీ స్కోర్ చేసింది.
ఆసీస్ ఇన్నింగ్స్‌లో టిమ్ డేవిడ్ (14 బంతుల్లో 31 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), డేవిడ్ వార్నర్ (19 బంతుల్లో 22; 3 ఫోర్లు, సిక్స్), కెప్టెన్ మిచెల్ మార్ష్ (12 బంతుల్లో 29; 3 ఫోర్లు, 2 సిక్సర్లు)మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. జోష్ ఇంగ్లిస్ (4) విఫలం కాగా.. స్టోయినిస్ 15 బంతుల్లో 2 ఫోర్ల సాయంతో 16 పరుగులు చేశాడు. విండీస్ బౌలర్లలో జేసన్ హొల్డర్ 2, అల్జరీ జోసఫ్, రొమారియో షెపర్డ్ తలో వికెట్ పడగొట్టారు.
అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన వెస్టిండీస్ చివరి వరకు పోరాడినప్పటికీ విజయం సాధించలేకపోయింది. ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 207 పరుగులు చేయగలిగింది. విండీస్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ రోవ్‌మన్ పావెల్ (63) అర్దసెంచరీతో రాణించగా.. ఆండ్రీ రసెల్ (37), జేసన్ హోల్డర్ (28 నాటౌట్), జాన్సన్ చార్లెస్ (24) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు.
విండీస్ ఇన్నింగ్స్‌లో అందరూ తలో చేయి వేసినా లక్ష్యం పెద్దది కావడంతో ఓటమి తప్పలేదు. ఆసీస్ బౌలర్లలో స్టోయినిస్ 3 వికెట్లతో చెలరేగగా.. హాజిల్‌వుడ్, స్పెన్సర్ జాన్సన్ చెరో 2 వికెట్లు, బెహ్రెన్‌డార్ఫ్, జంపా తలో వికెట్ పడగొట్టారు. నామమాత్రపు మూడో టీ20 ఫిబ్రవరి 13న జరుగనుంది.
Comments
Please login to add a commentAdd a comment