ఆఫ్ఘనిస్తాన్, న్యూజిలాండ్ మధ్య ఏకైక టెస్ట్ మ్యాచ్ ఇవాల్టి (సెప్టెంబర్ 9) నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. ఆఫ్ఘనిస్తాన్ టెస్ట్ క్రికెట్‌కు ఆతిథ్యమిచ్చే పరిస్థితులు లేకపోవడంతో భారత్ వారికి నోయిడా గ్రౌండ్‌ను హోం గ్రౌండ్‌గా ఆఫర్ చేసింది. ఈ వేదికపైనే ఆఫ్ఘనిస్తాన్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ ఇవాల్టి ఉదయమే ప్రారంభం కావాల్సి ఉన్నా.. తడి ఔట్ ఫీల్డ్ కారణంగా ఆలస్యమైంది. టాస్ కూడా ఇంకా పడలేదు. తుది జట్లను ప్రకటించాల్సి ఉంది.
కాగా, ఈ మ్యాచ్‌కు ముందు న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు కేన్ విలియమ్సన్‌ను ఓ భారీ రికార్డు ఊరిస్తుంది. ఈ మ్యాచ్‌లో కేన్ మామ మరో 72 పరుగులు చేస్తే.. న్యూజిలాండ్ తరఫున అత్యధిక పరుగులు (అన్ని ఫార్మాట్లలో) చేసిన ఆటగాడిగా అవతరిస్తాడు. ప్రస్తుతం న్యూజిలాండ్ తరఫున అత్యధిక పరుగుల రికార్డు రాస్ టేలర్ పేరిట ఉంది. రాస్ టేలర్ మూడు ఫార్మాట్లలో 450 మ్యాచ్‌లు ఆడి 18199 పరుగులు చేయగా.. కేన్ మామ 358 మ్యాచ్‌ల్లో 18128 పరుగులు చేశాడు. ప్రస్తుత తరం న్యూజిలాండ్ క్రికెటర్లలో కేన్ దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు.
ఫాబ్ ఫోర్‌లో ప్రధముడిగా చెప్పుకునే కేన్ ఇటీవలి కాలంలో టెస్ట్‌ల్లో సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఇటీవలే 100వ టెస్ట్ ఆడిన కేన్.. తన చివరి 20 టెస్ట్‌ల్లో ఏకంగా 2267 పరుగులు సాధించాడు. ఇందులో 11 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఫాబ్ ఫోర్‌లో (జో రూట్, కేన్ విలియమ్సన్, స్టీవ్ స్మిత్, విరాట్ కోహ్లి) ఎవరూ ఇన్ని పరుగులు చేయలేదు. కేన్‌కు మించి ఫామ్‌లో ఉన్న రూట్ సైతం గత 20 టెస్ట్‌ల్లో 6 సెంచరీలు, 9 హాఫ్ సెంచరీ సాయంతో 1761 పరుగులే చేశాడు. ప్రస్తుతం కేన్ టెస్ట్‌ల్లో న్యూజిలాండ్ తరఫున లీడింగ్ రన్ స్కోరర్‌గా (8743) ఉన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment