హామిల్టన్:న్యూజిలాండ్ తరపున అత్యధిక టెస్టు సెంచరీల రికార్డును వెటరన్ ఆటగాడు రాస్ టేలర్ సమం చేశాడు. వెస్టిండీస్‌తో హామిల్టన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో రాస్ టేలర్ (107: 198 బంతుల్లో11 ఫోర్లు) అద్భుత బ్యాటింగ్‌తో కెరీర్‌లో 17 శతకాన్ని పూర్తి చేసుకుని ఆ దేశం తరపున అత్యధిక టెస్టు సెంచరీలు నమోదు చేసిన ఆటగాడిగా నిలిచేందుకు అడుగుదూరంలో నిలిచాడు.
ఇప్పటి వరకు న్యూజిలాండ్ తరఫున అత్యధిక టెస్టు శతకాల రికార్డు దిగ్గజ బ్యాట్స్‌మెన్ మార్టిన్ క్రో, కేన్ విలియమ్సన్ పేరిట ఉంది. 1995లో రిటైర్మెంట్ ప్రకటించిన క్రో.. కెరీర్‌లో 77 టెస్టులాడి 17 శతకాలు సాధించగా, విలియమ్సన్ కేవలం 66 టెస్టుల్లోనే ఈ ఫీట్ సాధించాడు. తాజాగా దాన్ని రాస్ టేలర్ సమం చేసి అరుదైన ఘనతను అందుకున్నాడు. వెస్టిండీస్‌తో రెండో టెస్టులో భాగంగా న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో టేలర్ శతకం నమోదు చేశాడు. 2007లో టెస్టు కెరీర్ ప్రారంభించిన టేలర్.. మూడో టెస్టులోనే శతకంతో ఆకట్టుకున్నాడు. సెడాన్ పార్క్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో టేలర్ తన తొలి టెస్టు సెంచరీ సాధించాడు. తన 10 ఏళ్ల సుదీర్ఘ అంతర్జాతీయ కెరీర్‌లో కివీస్ సాధించిన ఎన్నో విజయాల్లో టేలర్ పాలుపంచుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment