Martin Crowe
-
T20 World Cup: మార్టిన్ క్రో ఆత్మ శాంతించేదెప్పుడు?
Martin Crowe Dream Of ICC Trophy: న్యూజిలాండ్ దిగ్గజ క్రికెటర్ మార్టిన్ క్రో.. 2015 వన్డే వరల్డ్‌కప్ ఫైనల్ సందర్భంగా అందరీ చేత కన్నీళ్లు పెట్టించాడు. ‘మరో మ్యాచ్ చూసేందుకు నా జీవితం ఇక అనుమతించకపోవచ్చు. కానీ బతికేందుకు ఈ జ్ఞాపకాలు చాలు. రోజంతా కన్నీళ్లను మాత్రం బయటకు కనిపించనీయను’ అని అన్న మాటలు క్రికెట్ ప్రేమికులు ఇప్పటికీ తలుచుకుంటూ ఉంటారు. ఆ ఏడాది జరిగిన వరల్డ్‌కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా-న్యూజిలాండ్‌లు తలపడ్డాయి. ఆ మ్యాచ్‌ను ఎంతో ఆసక్తిగా తిలకించాడు మార్టిన్ క్రో. తన సారథ్యంలో తమ జట్టు సాధించలేని వరల్డ్‌కప్‌ను కివీస్ కైవసం చేసుకుంటుందని మార్టిన్ ఎంతగానో ఆశించాడు. కానీ మార్టిన్ క్రోకు నిరాశే ఎదురైంది. ఆ పోరులో న్యూజిలాండ్ ఘోర వైఫల్యంతో తొలిసారి వరల్డ్‌కప్ సాధించాలన్న కల తీరలేదు. ఆ తర్వాత ఏడాదికి మార్టిన్ క్రో కన్నుమూయగా, ఆపై న్యూజిలాండ్ రెండుసార్లు వరల్డ్‌కప్ ఫైనల్‌కు చేరింది. ఒకటి వన్డే వరల్డ్‌కప్‌లో(2019) అయితే, మరొకటి టీ20 వరల్డ్‌కప్(2021)లో కివీస్ తుదిపోరుకు అర్హత సాధించింది. 2019 వన్డే వరల్డ్‌కప్‌లో సూపర్ ఓవర్ రూపంలో కివీస్‌ను దురదృష్టం వెంటాడంతో రన్నరప్‌గానే సరిపెట్టుకుంది. ఆ ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ విజయం సాధించి వరల్డ్‌కప్‌ను ముద్దాడింది. ఆ మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారి తీసిన పరిస్థితులు అప్పట్లో వివాదంగా మారాయి. కానీ ఐసీసీ నిబంధనలు అప్పటికి అలానే ఉండటంతో కివీస్ చేసేది ఏమీ లేకపోయింది. క్రికెట్ ప్రేమికులు మాత్రం పాపం.. న్యూజిలాండ్ అనుకోవాల్సి వచ్చింది. మరి ఆ దేశం క్రికెట్ వరల్డ్‌కప్ కోసం ఎంతో ఎదురుచూసిన మార్టిన్ క్రో..అప్పటికి కన్నుమూసి నాలుగేళ్ల అయ్యింది. ఒకవేళ కివీస్ వరల్డ్‌కప్ గెలిస్తే ‘మనం వరల్డ్‌కప్ గెలిచాం.. ఒకసారి మేల్కొని మా చేతిలో ఉన్న ట్రోఫీని చూడు మార్టిన్ బ్రో’ అని కివీస్ ప్లేయర్లు గట్టిగా అరిచే చెప్పేవాళ్లు. చదవండి: వినండి పక్కనే వాళ్లు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో.. మరేం పర్లేదు కేన్.. మనసులు గెలిచారు! ఎందుకంటే ఏదొక రోజు తాము వరల్డ్‌కప్ గెలిచి మార్టిన్‌ను మేల్కొపు తామని మార్టిన్ మరణానంతరం ఒక కివీస్ క్రికెటర్ వ్యక్తం చేసిన ఆవేదన ఇది. ప్రస్తుతం స్వర్గంలో చిన్న నిద్ర తీసుకుంటున్న మార్టిన్.. తాము వరల్డ్‌కప్ గెలిస్తే కచ్చితంగా మేల్కొంటాడని చెప్పుకొచ్చాడు. తను జీవించినంత కాలం క్రికెటే శ్వాసగా బ్రతికిన మార్టిన్.. 1992 వన్డే వరల్డ్‌కప్‌లో సెమీకు చేరిన న్యూజిలాండ్ జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు. ఆ మెగా టోర్నీలో అంచనాలు లేకుండా దిగిన కివీస్.. లీగ్ దశలో అజేయంగా నిలిచి సెమీస్‌కు చేరింది. కానీ సెమీస్‌లో పాక్ రూపంలో కివీస్‌ను దురదృష్టం వెంటాడింది. కానీ మార్టిన్ మాత్రం 456 పరుగులతో ఆ టోర్నీ టాప్ స్కోరర్‌గా నిలిచి ప్లేయర్ ద వరల్డ్‌కప్ గెలిచాడు. ఆ వరల్డ్‌కప్‌ను ఇమ్రాన్ ఖాన్ సారథ్యంలోని పాక్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. కివీస్‌కు కొత్త కళ తెచ్చిన క్రికెటర్ సుమారు పదుమూడేళ్ల పాటు కివీస్‌కు ప్రాతినిధ్యం వహించిన క్రో వరుస గాయాలతో 33 ఏళ్లకే 1995లో రిటైర్మెంట్ ప్రకటించారు. 80ల్లో ప్రపంచంలోని అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొని భారీగా పరుగులు సాధించిన క్రో, నాడు న్యూజిలాండ్ చారిత్రక విజయాల్లో కీలక పాత్ర పోషించారు. న్యూజిలాండ్ తరఫున టెస్టుల్లో అత్యధిక పరుగుల రికార్డు చాలా ఏళ్లు క్రో పేరిటే ఉండగా, అత్యధిక సెంచరీల రికార్డు(17) కూడా సుదీర్ఘ కాలం అతని పేరిటే కొనసాగింది. మార్టిన్ క్రో అనగానే ఈతరం అభిమానులకు కూడా గుర్తొచ్చేది 1992 ప్రపంచకప్. బ్యాటింగ్‌లో అదరగొట్టడమే కాకుండా పించ్ హిట్టర్, స్పిన్నర్‌తో బౌలింగ్ ప్రారంభించడంలాంటి అపూర్వ వ్యూహాలతో టోర్నీకి ఆయన కొత్త కళ తెచ్చారు. (చదవండి :ఆసీస్‌కు అందిన ద్రాక్ష) కివీస్‌ను ఎంతో ఉన్నత శిఖరాల్లో నిలబెట్టిన మార్టిన్ క్రో కల ఇంకా అలానే ఉండిపోయింది. ఆ దేశం వరల్డ్‌కప్ సాధించాలనే ఆయన కలకు ఇప్పటికీ ముగింపు లభించలేదు. ఆసీస్ చేతిలో ఓటమి పాలు కావడంతో అయ్యో కివీస్ ఇంకెప్పుడు వరల్డ్‌కప్ సాధిస్తారని అనుకోవడం అభిమానుల వంతైంది. అటు వన్డే వరల్డ్‌కప్, ఇటు టీ20 వరల్డ్‌కప్‌ను ఇప్పటికీ సాధించకపోవడమే సగటు క్రికెట్ అభిమానికి ఇంకా నిరాశగానే ఉంది. భారత్, పాకిస్తాన్, ఇంగ్లండ్, వెస్టిండీస్(2సార్లు), శ్రీలంక, ఆస్ట్రేలియాలు టీ20 వరల్డ్‌కప్‌లు సాధించినా ఈ బ్లాక్ క్యాప్స్ మాత్రం.. ఇంకా బ్లాక్ హార్స్‌గా ఉండటం క్రికెట్ అభిమానులకు మింగుడు పడని అంశం. -
సెంచరీల రికార్డు సమం చేశాడు!
హామిల్టన్:న్యూజిలాండ్ తరపున అత్యధిక టెస్టు సెంచరీల రికార్డును వెటరన్ ఆటగాడు రాస్ టేలర్ సమం చేశాడు. వెస్టిండీస్‌తో హామిల్టన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో రాస్ టేలర్ (107: 198 బంతుల్లో11 ఫోర్లు) అద్భుత బ్యాటింగ్‌తో కెరీర్లో 17 శతకాన్ని పూర్తి చేసుకుని ఆ దేశం తరపున అత్యధిక టెస్టు సెంచరీలు నమోదు చేసిన ఆటగాడిగా నిలిచేందుకు అడుగుదూరంలో నిలిచాడు. ఇప్పటి వరకు న్యూజిలాండ్ తరఫున అత్యధిక టెస్టు శతకాల రికార్డు దిగ్గజ బ్యాట్స్‌మెన్ మార్టిన్ క్రో, కేన్ విలియమ్సన్ పేరిట ఉంది. 1995లో రిటైర్మెంట్ ప్రకటించిన క్రో.. కెరీర్లో 77 టెస్టులాడి 17 శతకాలు సాధించగా, విలియమ్సన్ కేవలం 66 టెస్టుల్లోనే ఈ ఫీట్ సాధించాడు. తాజాగా దాన్ని రాస్ టేలర్ సమం చేసి అరుదైన ఘనతను అందుకున్నాడు. వెస్టిండీస్‌తో రెండో టెస్టులో భాగంగా న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో టేలర్ శతకం నమోదు చేశాడు. 2007లో టెస్టు కెరీర్ ప్రారంభించిన టేలర్.. మూడో టెస్టులోనే శతకంతో ఆకట్టుకున్నాడు. సెడాన్ పార్క్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో టేలర్ తన తొలి టెస్టు సెంచరీ సాధించాడు. తన 10 ఏళ్ల సుదీర్ఘ అంతర్జాతీయ కెరీర్లో కివీస్ సాధించిన ఎన్నో విజయాల్లో టేలర్ పాలుపంచుకున్నాడు. -
‘కివీ’ని ఎగిరించిన కెప్టెన్!
క్రికెట్ మైదానంలో భీకర బౌలర్లను ఎదుర్కొని ఎన్నో స్ఫూర్తిదాయక ఇన్నింగ్స్ ఆడిన ఆ దిగ్గజం జీవన పోరాటంలో మాత్రం ఓడిపోయారు. చావు ఖాయమని, అది ముంచుకొస్తోందని తెలిసినప్పుడు మిగిలిన రోజులు బతకడం కూడా ఒక పోరాటంగా భావించిన ఆయన చివరకు తన ‘పాత స్నేహితుడు’ అని చెప్పుకున్న లింఫోమా చేతుల్లోనే తనువు చాలించారు. ‘మరో మ్యాచ్ చూసేందుకు నా జీవితం ఇక అనుమతించకపోవచ్చు. కానీ బతికేందుకు ఈ జ్ఞాపకాలు చాలు. రోజంతా కన్నీళ్లను మాత్రం బయటకు కనిపించనీయను’ అని గత వరల్డ్ కప్ ఫైనల్ సందర్భంగా అందరితో కన్నీళ్లు పెట్టించిన మార్టిన్ క్రో ఏడాది లోపే తన ‘ఆట’ను ముగించారు. కల్లమ్ చెప్పినట్లుగా న్యూజిలాండ్ క్రికెట్‌కు క్రో నిజంగా ‘ఆత్మ’లాంటి వ్యక్తి. 19 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్లోకి ప్రవేశించిన మార్టిన్ క్రో కొన్నాళ్లకే తనదైన ముద్ర వేశారు. కళాత్మక బ్యాటింగ్‌తో పాటు అటాకింగ్‌లోనూ, డిఫెన్స్‌లోనూ అత్యుత్తమ సాంకేతిక నైపుణ్యం ప్రదర్శించారు. 1985లో బ్రిస్బేన్‌లో ఆసీస్ బ్యాటింగ్ కుప్పకూలిన చోట ఎనిమిది గంటల పాటు నిలిచి చేసిన అద్భుత సెంచరీ, క్రైస్ట్‌చర్చ్‌లో బ్రూస్రీడ్ ధాటికి రక్తం కారేలా దెబ్బ తగిలినా పోరాడుతూ చేసిన 137 పరుగులు, 1987లో నలుగురు విండీస్ ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కొని పరుగుల వరద పారించిన సిరీస్ ఆయన బ్యాటింగ్ గొప్పతనానికి కొన్ని మచ్చుతునకలు. తన కెరీర్లో కివీస్ గెలిచిన 16 మ్యాచ్‌లలో క్రో 55.40 సగటుతో పరుగులు చేయడం ఆయన విలువేమిటో చూపిస్తుంది. సొంతగడ్డపై, విదేశాల్లో... పేస్, స్పిన్ ఇలా అన్ని పిచ్‌లపై ఆయన ప్రభావం చూపించారు. కెరీర్ హైలైట్ 1992 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌ను క్రో నడిపించిన తీరు ఆయనను ఒక్కసారిగా సూపర్ కెప్టెన్‌ను చేసింది. క్రో అనూహ్య వ్యూహాలను ఎదుర్కోలేక ప్రత్యర్థులు చిత్తయ్యారు. ఆ సమయంలో దిగ్గజ కెప్టెన్‌గా గుర్తింపు ఉన్న బోర్డర్ టోర్నీ తొలి మ్యాచ్‌లోనే క్రో ఆలోచనలకు బాధితుడయ్యారు. ఇన్నింగ్స్ ఆరంభంలో ఫీల్డింగ్ పరిమితులను ఉపయోగించుకునేందుకు గ్రేట్బ్యాచ్ను పించ్ హిట్టర్‌గా బరిలోకి దించి షాక్ ఇచ్చిన క్రో, ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేసేందుకు తొలి ఓవర్ ఆఫ్‌స్పిన్నర్ దీపక్ పటేల్‌తో వేయించి మరో సంచలనానికి తెరలేపారు. ఇవి విఫల ప్రయోగంగానే మిగిలిపోకుండా కివీస్‌కు వరుస విజయాలు దక్కడం, జట్టు సెమీస్ చేరడం విశేషం. ఆ వరల్డ్ కప్‌లో 114 సగటుతో 456 పరుగులు చేసి స్వయంగా ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’గా నిలిచిన క్రో బ్యాట్స్‌మన్‌గా కూడా తన స్థాయిని నిలబెట్టుకున్నారు. 1995లో భారత్‌లోనే క్రో తన చివరి టెస్టు, వన్డే సిరీస్ ఆడారు. నాగపూర్‌లో ఆయన ఆఖరి వన్డేలో స్టేడియం కూలి 9 మంది ప్రేక్షకులు మరణించడం తనను చాలా కాలం బాధించిందని క్రో చెప్పుకున్నారు. మార్టిన్ క్రో కెరీర్ రికార్డ్ మ్యా ప స సెం అ. సెం అ.స్కో టెస్టులు 77 5444 45.36 17 18 299 వన్డేలు 143 4704 38.55 4 34 107నాటౌట్ నోట్: మ్యా:మ్యాచ్‌లు; ప: పరుగులు; స: సగటు; సెం: సెంచరీలు; అ.సెం: అర్ధసెంచరీలు; అ.స్కో: అత్యధిక స్కోరు -
మార్టిన్ క్రో మరిలేరు
జననం: సెప్టెంబర్ 22, 1962 మరణం: మార్చి 3, 2016 ► లింఫోమా వ్యాధితో మరణించిన ► న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ ► 53 ఏళ్లకే కన్నుమూసిన దిగ్గజం ఆక్లాండ్: న్యూజిలాండ్ క్రికెట్ దిగ్గజం, అత్యుత్తమ కెప్టెన్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న మార్టిన్ క్రో కన్ను మూశారు. గత నాలుగేళ్లుగా ఆయన ప్రమాదకరమైన లింఫోమా (ఒక రకమైన క్యాన్సర్) వ్యాధితో బాధపడుతున్నారు. క్రో వయసు 53 ఏళ్లు. ‘కుటుంబ సభ్యుల మధ్య మార్టిన్ క్రో గురువారం తుది శ్వాస విడిచారు. ఈ విషాద వార్త చెప్పడానికి చింతిస్తున్నాం’ అని ఆయన సన్నిహితులు ప్రకటించారు. మార్టిన్‌కు భార్య లోరిన్, కుమార్తె ఎమ్మాతో పాటు మరో ఇద్దరు సవతి పిల్లలు (లోరిన్ పిల్లలు) ఉన్నారు. గత ఏడాది వన్డే ప్రపంచకప్ ఫైనల్ సందర్భంగా మైదానంలోకి వచ్చిన క్రో... కొద్ది రోజుల తర్వాత వెటోరి రిటైర్మెంట్ సందర్భంగా ఆఖరి సారిగా బయట కనిపించారు. ఆ తర్వాత ఆయన ఇంటికే పరిమితమయ్యారు. మార్చి 10న క్రో అంత్యక్రియలు జరుగుతాయి. న్యూజిలాండ్ తరఫున ఉత్తమం 13 ఏళ్ల పాటు కివీస్‌కు ప్రాతినిధ్యం వహించిన క్రో వరుస గాయాలతో 33 ఏళ్లకే 1995లో రిటైర్మెంట్ ప్రకటించారు. 80ల్లో ప్రపంచంలోని అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొని భారీగా పరుగులు సాధించిన క్రో, నాడు న్యూజిలాండ్ చారిత్రక విజయాల్లో కీలక పాత్ర పోషించారు. న్యూజిలాండ్ తరఫున టెస్టుల్లో అత్యధిక పరుగుల రికార్డు చాలా ఏళ్లు క్రో పేరిటే ఉండగా, అత్యధిక సెంచరీల రికార్డు (17) ఇంకా కొనసాగుతోంది. మార్టిన్ క్రో అనగానే ఈతరం అభిమానులకు కూడా గుర్తొచ్చేది 1992 ప్రపంచకప్. బ్యాటింగ్‌లో అదరగొట్టడమే కాకుండా పించ్ హిట్టర్, స్పిన్నర్‌తో బౌలింగ్ ప్రారంభించడంలాంటి అపూర్వ వ్యూహాలతో టోర్నీకి ఆయన కొత్త కళ తెచ్చారు. ఎవరూ ఊహించని విధంగా క్రో మార్గదర్శనంతో కివీస్ లీగ్‌లో టాప్‌గా నిలిచి సెమీస్ వరకు చేరడం ఒక సంచలనం. కెరీర్‌కు వీడ్కోలు పలికిన తర్వాత క్రికెట్ వ్యాఖ్యాతగా, రచయితగా, వేర్వేరు జట్లకు మెంటార్‌గా క్రికెట్‌తో తన అనుబంధాన్ని కొనసాగించారు. ‘క్రికెట్ మ్యాక్స్’ పేరుతో మార్టిన్ క్రో తొలిసారి కొత్త తరహాలో నిర్వహించిన క్రికెట్ వల్లే టి20ల ఆలోచన వచ్చింది. 2011లో 48 ఏళ్ల వయసులో క్లబ్ క్రికెట్ ఆడిన క్రో పునరాగమనం ఆ ఒక్క మ్యాచ్‌కే పరిమితమైంది. క్రికెట్ ప్రపంచం నివాళి నాతో పాటు ఎందరికో ఆయన స్ఫూర్తినిచ్చారు. మా దేశానికి నిజమైన దిగ్గజం - స్టీఫెన్ ఫ్లెమింగ్ క్రో కుటుంబం, అభిమానులకు నా సంతాపం. చివరి వరకు పోరాడిన గొప్ప క్రికెటర్ - సచిన్ టెండూల్కర్ న్యూజిలాండ్ తరఫునే కాకుండా ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లో ఒకడు. ఆటతోనే కాకుండా తన వ్యక్తిత్వంతో ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు - ఐసీసీ సీఈ రిచర్డ్సన్ టెస్టుల్లో మార్టిన్ క్రో అత్యధిక స్కోరు 299. వెల్లింగ్టన్లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఆయన ఈ ఘనత సాధించారు. ఐదో రోజు ఆఖరి ఓవర్ మూడో బంతికి కీపర్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యారు. ప్రపంచ క్రికెట్లో 299 పరుగుల వద్ద అవుటైన ఏకైక బ్యాట్స్‌మన్ క్రో. 23 ఏళ్ల పాటు కివీస్ తరఫున ఇదే అత్యధిక స్కోరు. ‘ఎవరెస్ట్‌ను దాదాపుగా ఎక్కేసి కాలు పట్టేయడంతో ఆఖరి అడుగు వేయలేనివాడిగా నా పరిస్థితి కనిపించింది’ అని మ్యాచ్ అనంతరం తన ఇన్నింగ్స్ గురించి క్రో వ్యాఖ్యానించారు. -
భారత్ కోసం ఫాస్ట్ పిచ్‌లు సిద్ధం చే యాలి: మార్టిన్ క్రో
నేపియర్: శక్తివంతమైన భారత క్రికెట్ జట్టును మట్టికరిపించాలంటే పేసర్లకు అనుకూలించేలా పిచ్‌లు తయారుచేయాలని న్యూజిలాండ్ మాజీ ఆటగాడు మార్టిన్ క్రో సూచించారు. ఇలా అయితే వన్డే సిరీస్‌తో పాటు టెస్టు సిరీస్‌ను కూడా కివీస్ జట్టు దక్కించుకుంటుందని అభిప్రాయపడ్డారు. 2009 అనంతరం భారత జట్టు ఇక్కడ పర్యటిస్తోంది. టెస్టు జట్టులో ధోని, జహీర్, ఇషాంత్ మినహా అందరికీ ఇది తొలి పర్యటనే. ‘దాదాపు అందరి ఆటగాళ్లకు ఇక్కడ ఆడిన అనుభవం పెద్దగా లేదు. టిమ్ సౌతీ, ట్రెంట్ బౌల్ట్, నీల్ వాగ్నర్ భారత టాప్-6 ఆటగాళ్లను లక్ష్యంగా చేసుకోవాలి. పిచ్‌లు పూర్తి పచ్చికతో కూడి ఉండాలి. ఇటీవల ఇలాంటి పిచ్‌లు అంతగా కనిపించడం లేదు. ఇరు జట్ల మధ్య ర్యాంకింగ్స్‌లో భారీ తేడానే ఉన్నా మైదానంలో అదేమంత ప్రభావం చూపదు’ అని క్రో పేర్కొన్నారు.