శక్తివంతమైన భారత క్రికెట్ జట్టును మట్టికరిపించాలంటే పేసర్లకు అనుకూలించేలా పిచ్‌లు తయారుచేయాలని న్యూజిలాండ్ మాజీ ఆటగాడు మార్టిన్ క్రో సూచించారు.
నేపియర్: శక్తివంతమైన భారత క్రికెట్ జట్టును మట్టికరిపించాలంటే పేసర్లకు అనుకూలించేలా పిచ్‌లు తయారుచేయాలని న్యూజిలాండ్ మాజీ ఆటగాడు మార్టిన్ క్రో సూచించారు. ఇలా అయితే వన్డే సిరీస్‌తో పాటు టెస్టు సిరీస్‌ను కూడా కివీస్ జట్టు దక్కించుకుంటుందని అభిప్రాయపడ్డారు. 2009 అనంతరం భారత జట్టు ఇక్కడ పర్యటిస్తోంది. టెస్టు జట్టులో ధోని, జహీర్, ఇషాంత్ మినహా అందరికీ ఇది తొలి పర్యటనే.
‘దాదాపు అందరి ఆటగాళ్లకు ఇక్కడ ఆడిన అనుభవం పెద్దగా లేదు. టిమ్ సౌతీ, ట్రెంట్ బౌల్ట్, నీల్ వాగ్నర్ భారత టాప్-6 ఆటగాళ్లను లక్ష్యంగా చేసుకోవాలి. పిచ్‌లు పూర్తి పచ్చికతో కూడి ఉండాలి. ఇటీవల ఇలాంటి పిచ్‌లు అంతగా కనిపించడం లేదు. ఇరు జట్ల మధ్య ర్యాంకింగ్స్‌లో భారీ తేడానే ఉన్నా మైదానంలో అదేమంత ప్రభావం చూపదు’ అని క్రో పేర్కొన్నారు.