Napier
-
రోడ్డా.. చెస్ బోర్డా..?
చెన్నైలో చెస్ ఒలింపియాడ్ సందడి మొదలైంది. ఈ నెల 28నుంచి 10 ఆగస్టు వరకు టోర్నీ జరుగుతోంది. ప్రచారంలో భాగంగా నగరంలోని నేపియర్ బ్రిడ్జ్‌కు అధికారులు ఇలా చదరంగ గళ్ల రూపు ఇచ్చారు. అయితే చెస్ ఆటగాళ్ల ప్రస్తావనే లేకుండా సిద్ధమైన టోర్నీ థీమ్ సాంగ్‌పై పలు విమర్శలు వస్తున్నాయి. ఇందులో ముఖ్యమంత్రి స్టాలిన్, ఏఆర్ రహమాన్ ప్రముఖంగా కనిపిస్తుండగా, కనీసం చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ కూడా లేకుండా వీడియో రూపొందింది. భారత్‌నుంచి ఇప్పటి వరకు 74 మంది చెస్ గ్రాండ్‌మాస్టర్లు రాగా, అందులో 26 మంది తమిళనాడుకు చెందినవారే కావడం విశేషం. -
దీనిని 'క్యాచ్ ఆఫ్ ది సమ్మర్' అనొచ్చా..
నేపియర్ : న్యూజిలాండ్, పాకిస్తాన్ల మధ్య మంగళవారం జరిగిన మూడో టీ20లో కివీస్ సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్ డారెల్ మిచెల్ ఒంటిచేత్తో అందుకున్న క్యాచ్ హైలెట్‌గా నిలిచింది. 6వ ఓవర్ వేసిన కుగ్గెలీజ్న్ బౌలింగ్‌లో పాక్ బ్యాట్స్‌మెన్ హైదర్ అలీ కవర్‌డ్రైవ్ మీదుగా షాట్ ఆడాడు. గ్యాప్‌లో వేచి ఉన్న మిచెల్ కొన్ని గజాలు వెనుకకు పరిగెత్తి అమాంతం గాల్లోకి ఎగిరి ఒకపక్కగా డైవ్‌చేస్తూ అందుకున్నాడు. వాస్తవానికి అంతకముందు ఓవర్లో హైదర్ అలీ కొట్టిన షాట్ మార్టిన్ గప్టిల్ క్యాచ్ అందుకునే ప్రయత్నంలో గాయపడ్డాడు. దీంతో అతని స్థానంలో వచ్చిన మిచెల్ ఈ క్యాచ్‌ను అందుకున్నాడు. ఇంకో విశేషమేంటంటే.. సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన డారెల్ మిచెల్ మూడు క్యాచ్‌లు అందుకోగా.. ఆ మూడు వికెట్లు కుగ్గెలీజ్న్ బౌలింగ్‌లోనే రావడం విశేషం. ఈ వీడియోనూ ఐసీసీ తన ట్విటర్లో షేర్ చేసింది. మిచెల్ అందుకున్నది 'క్యాచ్ ఆఫ్ ది సమ్మర్ అవునా.. కాదా మీరే చెప్పండి' అంటూ క్యాప్షన్ జత చేసింది. (చదవండి : ప్రేయసితో యువ క్రికెటర్ పెళ్లి) IS THAT THE CATCH OF THE SUMMER? Daryl Mitchell is on as sub-fielder for one ball and takes this special grab to remove Pakistan opener Haider Ali. Catch the run-chase live pic.twitter.com/fJqbirs0Hu — Spark Sport (@sparknzsport) December 22, 2020 ఇక మ్యాచ్ విషయానికి వస్తే పాకిస్తాన్ కివీస్‌పై 4 వికెట్ల తేడాతో గెలిచి క్లీన్‌స్వీప్ నుంచి తప్పించుకుంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించిన న్యూజిలాండ్ సిరీస్‌ను 2–1తో దక్కించుకుంది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 173 పరుగులు చేసింది. డేవన్ కాన్వే (45 బంతుల్లో 63; 7 ఫోర్లు, సిక్స్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ జట్టులో.. తాత్కాలిక కెప్టెన్ మొహమ్మద్ రిజ్వాన్ (59 బంతుల్లో 89; 10 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుపు బ్యాటింగ్‌కు తోడూ హఫీజ్ (29 బంతుల్లో 41; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించడంతో 19.4 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. కాగా రెండు జట్ల మధ్య ఈనెల 26 నుంచి తొలి టెస్టు జరుగుతుంది. (చదవండి : ఒక్క ఓవర్.. ఐదు వికెట్లు.. సూపర్ కదా) -
చివర్లో చేతులెత్తేశారు
వన్డే ప్రపంచకప్‌కు తొలి సన్నాహకంగా మొదలుపెట్టిన న్యూజిలాండ్ పర్యటనలో భారత్ శుభారంభం చేయలేకపోయింది. బౌలర్లు ఫర్వాలేదనిపించినా... కోహ్లి, ధోని, శిఖర్ ధావన్ మినహా మిగతా బ్యాట్స్‌మెన్ నిరాశపర్చడంతో ఓటమి తప్పలేదు. సమష్టిగా రాణించిన కివీస్ తొలి వన్డేలో గెలిచి సిరీస్‌లో ఆధిక్యాన్ని సంపాదించింది. నేపియర్: ఓపెనర్లు శుభారంభం అందించకపోవడం... మధ్యలో విరాట్ కోహ్లి (111 బంతుల్లో 123; 11 ఫోర్లు, 2 సిక్సర్లు), ధోని (46 బంతుల్లో 40; 2 ఫోర్లు, 2 సిక్సర్లు)ల దూకుడు... చివర్లో లోయర్ ఆర్డర్ నిరాశ... స్థూలంగా చెప్పాలంటే న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో భారత్ ఆటతీరు ఇది. బౌన్సీ పిచ్‌లపై అనుభవాన్ని కూడగట్టుకోవాలనుకున్న కుర్రాళ్లు ఒక్కొక్కరే పెవిలియన్‌కు క్యూ కట్టడంతో టీమిండియాకు భంగపాటు తప్పలేదు. దీంతో మెక్లారెన్ పార్క్‌లో ఆదివారం జరిగిన తొలి వన్డేలో న్యూజిలాండ్ 24 పరుగుల తేడాతో భారత్‌పై విజయం సాధించింది. ఫలితంగా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 292 పరుగులు చేసింది. విలియమ్సన్ (88 బంతుల్లో 71; 7 ఫోర్లు), రాస్ టేలర్ (82 బంతుల్లో 55; 1 ఫోర్), అండర్సన్ (40 బంతుల్లో 68 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధసెంచరీలు సాధించారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భారత్ 48.4 ఓవర్లలో 268 పరుగులకు ఆలౌటై ఓడింది. కోహ్లి ఒంటరిపోరాటం చేయగా, ధోని, ధావన్ (46 బంతుల్లో 32; 3 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. అర్ధ సెంచరీ చేయడంతోపాటు రెండు కీలక వికెట్లు తీసిన అండర్సన్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఇరుజట్ల మధ్య రెండో వన్డే హామిల్టన్‌లో బుధవారం జరుగుతుంది. అండర్సన్ అదుర్స్ ఆరంభంలో వెంటవెంటనే రెండు వికెట్లు పడ్డా... విలియమ్సన్, టేలర్ సమయోచితంగా ఆడారు. భారీ షాట్లకు పోకుండా స్ట్రయిక్ రొటేట్ చేస్తూ పరుగులు రాబట్టారు. వీరిద్దరు మూడో వికెట్‌కు 121 పరుగులు జోడించి స్వల్ప వ్యవధిలో అవుటయ్యారు. తర్వాత వచ్చిన మెకల్లమ్ (25 బంతుల్లో 30; 4 ఫోర్లు) ఉన్నంతసేపు వేగంగా ఆడాడు. కానీ అండర్సన్, రోంచీ (18 బంతుల్లో 30; 2 ఫోర్లు, 2 సిక్సర్లు)ల బ్యాటింగ్‌తో మ్యాచ్ స్వరూపం మారిపోయింది. స్లాగ్ ఓవర్లలో భారత బౌలర్ల దుమ్ము దులుపుతూ భారీ సిక్సర్లు, బౌండరీలతో విరుచుకుపడ్డారు. ఇషాంత్ బౌలింగ్‌లో రెండు, అశ్విన్, షమీ చెరో సిక్సర్‌ను కొట్టిన అండర్సన్ చివరి వరకు అదే దూకుడును కనబర్చాడు. రోంచీ కూడా జడేజా బౌలింగ్‌లో రెండు సిక్సర్లు సాధించాడు. వీరిద్దరు 37 బంతుల్లోనే 66 పరుగులు జోడించారు. షమీ 4 వికెట్లు తీశాడు. ఒంటరిపోరాటం కివీస్ తరహాలోనే భారత్ ఇన్నింగ్స్ మొదలైనా... మిడిలార్డర్ విఫలం కావడం దెబ్బతీసింది. కోహ్లి ఒక్కడే ఇన్నింగ్స్ ఆసాంతం ఒంటరిపోరాటం చేశాడు. ఓ ఎండ్‌లో సహచరులు రహానే (7), రైనా (18) వెనుదిరిగినా... తడబడకుండా ఇన్నింగ్స్‌ను కొనసాగించాడు. ధోనితో కలిసి కివీస్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నాడు. తన ట్రేడ్ మార్క్ షాట్లతో పేసర్ల బౌలింగ్‌లో వీలైనన్ని బౌండరీలు కొట్టాడు. నాథన్ మెకల్లమ్ బౌలింగ్‌లో రెండు భారీ సిక్సర్లు సంధించాడు. 95 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద సౌతీ బౌలింగ్‌లో కోహ్లి కొట్టిన భారీ షాట్‌ను రైడర్ సరిగా అంచనా వేయలేక అందుకోలేకపోయాడు. తర్వాతి బంతినే బౌండరీకి తరలించిన ఈ ఢిల్లీ ప్లేయర్ కెరీర్లో 18వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆరంభంలో నెమ్మదిగా ఆడిన ధోని... అండర్సన్, నాథన్‌కు రెండు మెరుపు సిక్సర్ల రుచి చూపెట్టాడు. ఐదో వికెట్‌కు కోహ్లితో కలిసి 95 పరుగులు జోడించిన కెప్టెన్ వేగంగా ఆడే ప్రయత్నంలో అవుటయ్యాడు. మెక్లీనగన్ 4, అండర్సన్ 2 వికెట్లు తీశారు. టర్నింగ్ పాయింట్ ఓ దశలో భారత్ విజయ లక్ష్యం 48 బంతుల్లో 70 పరుగులు... కోహ్లి, ధోని నిలకడగా ఆడుతున్నారు. వీరిద్దరి బ్యాటింగ్‌తో భారత్ కచ్చితంగా గెలుస్తుందనే భావించారు. కానీ మెక్లీనగన్ ఆరు బంతుల తేడాలో 3 వికెట్లు తీసి మ్యాచ్‌ను కివీస్ వైపు తిప్పాడు. 43వ ఓవర్ మూడో బంతికి ధోనిని, ఆరో బంతికి జడేజాను... 45వ ఓవర్లో రెండో బంతికి కోహ్లిని మెక్లీనగన్ పెవిలియన్‌కు పంపడంతో భారత్ కోలుకోలేకపోయింది. పెరుగుతున్న రన్‌రేట్‌కు అనుగుణంగా లోయర్ ఆర్డర్లో ఎవరూ భారీ షాట్లు ఆడలేకపోయారు. నిలకడ కావాలి ‘స్వల్ప వ్యవధిలో మూడు వికెట్లు కోల్పోవడం దెబ్బతీసింది. నేను, జడేజా, కోహ్లిలో ఒక్కరం ఉన్నా పరిస్థితి వేరేగా ఉండేది. చివర్లో వేగంగా పరుగులు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. కానీ దానిని సాధించలేకపోయాం. మా బ్యాటింగ్‌లో ఇంకా నిలకడ రావాలి. నాలుగు, ఐదు స్థానాల్లో వచ్చే బ్యాట్స్‌మెన్ వీలైనంత ఎక్కువసేపు క్రీజులో ఉండాలి.’ -ధోని (భారత కెప్టెన్) ధోని రికార్డు వన్డేల్లో 300 క్యాచ్‌లు అందుకున్న భారత తొలి వికెట్ కీపర్‌గా ధోని కొత్త రికార్డు సృష్టించాడు. కివీస్ బ్యాట్స్‌మన్ రాస్ టేలర్ క్యాచ్ అందుకోవడం ద్వారా ఈ ఘనతను సాధించాడు. అతను 239 మ్యాచ్‌ల్లో ఈ మైలురాయిని సాధించాడు. స్కోరు వివరాలు న్యూజిలాండ్ ఇన్నింగ్స్: గుప్టిల్ (సి) అశ్విన్ (బి) షమీ 8; రైడర్ (బి) షమీ 18; విలియమ్సన్ (సి) రహానే (బి) జడేజా 71; టేలర్ (సి) ధోని (బి) షమీ 55; బ్రెండన్ మెకల్లమ్ (సి) ధోని (బి) భువనేశ్వర్ 30; అండర్సన్ నాటౌట్ 68; రోంచీ (సి) భువనేశ్వర్ (బి) ఇషాంత్ 30; నాథన్ మెకల్లమ్ (సి) అండ్ (బి) షమీ 2; సౌతీ నాటౌట్ 3; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం: (50 ఓవర్లలో 7 వికెట్లకు) 292 వికెట్ల పతనం: 1-22; 2-32; 3-153; 4-171; 5-213; 6-279; 7-284 బౌలింగ్: భువనేశ్వర్ 10-0-38-1; షమీ 9-0-55-4; ఇషాంత్ 9-0-72-1; జడేజా 9-0-61-1; అశ్విన్ 10-0-52-0; కోహ్లి 3-0-13-0. భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) సౌతీ (బి) మెక్లీనగన్ 3; ధావన్ (సి) టేలర్ (బి) అండర్సన్ 32; కోహ్లి (సి) రైడర్ (బి) మెక్లీనగన్ 123; రహానే (సి) నాథన్ మెకల్లమ్ (బి) అండర్సన్ 7; రైనా (సి) సౌతీ (బి) మిల్న్ 18; ధోని (సి) రోంచీ (బి) మెక్లీనగన్ 40; జడేజా (సి) రోంచీ (బి) మెక్లీనగన్ 0; అశ్విన్ (సి) సౌతీ (బి) విలియమ్సన్ 12; భువనేశ్వర్ రనౌట్ 6; ఇషాంత్ (బి) సౌతీ 5; షమీ నాటౌట్ 7; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం: (48.4 ఓవర్లలో ఆలౌట్) 268 వికెట్లపతనం: 1-15; 2-73; 3-84; 4-129; 5-224; 6-224; 7-237; 8-244; 9-259; 10-268 బౌలింగ్: సౌతీ 9.4-2-43-1; మెక్లీనగన్ 10-0-68-4; మిల్న్ 7.3-0-40-1; అండర్సన్ 10-0-51-2; నాథన్ మెకల్లమ్ 10-0-54-0; విలియమ్సన్ 1.3-0-9-1. 1 ఛేజింగ్‌లో కోహ్లి సెంచరీ చేసినప్పుడు భారత్ ఓడటం ఇదే తొలిసారి. 12 సార్లు సెంచరీ చేస్తే 11 మ్యాచ్‌ల్లో భారత్ గెలిచింది. -
ప్రయోగాలు చేయం
ఉదయం గం. 6.30 నుంచి సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం వన్డే ప్రపంచకప్‌కు సన్నాహకంగా భావిస్తున్న న్యూజిలాండ్ పర్యటనలో ప్రయోగాలు చేసేందుకు భారత కెప్టెన్ ధోని ఆసక్తి కనబర్చడం లేదు. వీలైనంతగా ఈ టూర్ నుంచి యువకులు మంచి అనుభవాన్ని సంపాదించాలని మాత్రం కోరుకుంటున్నాడు. రాబోయే వరల్డ్‌కప్ ఆసీస్, కివీస్ గడ్డపై జరగనున్న నేపథ్యంలో యువ ఆటగాళ్లు కుదురుకుంటే ఇక ఢోకా ఉండదని భావిస్తున్నాడు. నేటి నుంచి జరగబోయే ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌పై ధోని మీడియాతో వివిధ అంశాలపై మాట్లాడాడు. నేపియర్: బ్యాటింగ్‌లో నాలుగో నంబర్లో ఎవరు ఆడతారనే అంశంపై ఇంకా ఆలోచించలేదని ధోని చెప్పాడు. పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామన్నాడు. ఆసీస్ పర్యటనలో ఘోరంగా విఫలమైన రైనాను ఈ స్థానానికి ప్రమోట్ చేయడంపై కెప్టెన్ ఎలాంటి స్పందన కనబర్చలేదు. ‘ఏది మంచి అనుకుంటే ఆ దిశగా ముందుకెళ్తాం. చాపెల్ శకం తర్వాత మేం పెద్దగా ప్రయోగాలు చేయడం లేదు. అవకాశం ఇచ్చిన కొంత మంది ఆటగాళ్లు తమ సత్తా నిరూపించుకున్నారు. సవాళ్లనూ అధిగమించారు’ అని ధోని వ్యాఖ్యానించాడు. గాలివాటం కీలకం కివీస్‌లో గాలివాటం కీలక పాత్ర పోషిస్తుంది. బంతి దిశపై ఇది చాలా ప్రభావం చూపిస్తుంది. జట్టులోకి వచ్చిన కొత్త బౌలర్లకు ఇక్కడ ఆడిన అనుభవం కావాలి. 2015 ప్రపంచకప్‌కు ఆతిథ్యమిచ్చే వేదికలపై ఆడిన అనుభవం మా జట్టులోకి ఇద్దరు, ముగ్గురికే ఉంది. ఏదేమైనా ఈ టూర్ మాకు అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. డ్రాపింగ్ పిచ్ కాదు... తొలి వన్డే జరిగే మెక్లీన్ పార్క్‌లో ఉన్నది డ్రాపింగ్ పిచ్ కాదు. రగ్బీ సీజన్ లేకపోవడంతో షెడ్యూల్ కంటే ముందే వికెట్‌ను సిద్ధం చేశారు. కాబట్టి వన్డేలకు సరిపోయే విధంగా ఉంది. వికెట్ పొడిగా, కఠినంగా ఉంది. పేసర్లకు ఎక్స్ట్రా బౌన్స్ లభిస్తుంది. ‘పేస్’తో కొడతాం: మెకల్లమ్ తొలి వన్డేలో భారత్‌ను పేస్‌తో దెబ్బతీస్తామని న్యూజిలాండ్ కెప్టెన్ బ్రెండన్ మెకల్లమ్ హెచ్చరించాడు. ఐదుగురు పేసర్లతో తమ సత్తా ఏంటో రుచి చూపిస్తామని చెప్పాడు. ‘మా పేసర్లు మంచి ఫామ్‌లో ఉన్నారు. తొలి వన్డేలోనే పేస్‌తో అటాక్ చేసి ఫలితాన్ని సాధిస్తాం. మా బౌలర్లు భారత బ్యాట్స్‌మెన్ దెబ్బతీసినా ఈ మ్యాచ్‌లో భారీ స్కోర్లు నమోదు కావొచ్చు. కొత్త బంతితో మిల్స్, సౌతీ కూడా మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నారు. మొత్తానికి మా పేస్ అటాక్ మంచి దూకుడు మీదుంది’ అని మెకల్లమ్ వ్యాఖ్యానించాడు. భారత బౌలింగ్‌ను బట్టి తమ బ్యాటింగ్ తీరు ఉంటుందన్నాడు. స్లో, టర్నింగ్ ట్రాక్‌లపై ఎక్కువగా ఆడే ధోనిసేనకు ఇక్కడి వికెట్లపై ఇబ్బందులు తప్పవన్నాడు. -
భారత్ కోసం ఫాస్ట్ పిచ్‌లు సిద్ధం చే యాలి: మార్టిన్ క్రో
నేపియర్: శక్తివంతమైన భారత క్రికెట్ జట్టును మట్టికరిపించాలంటే పేసర్లకు అనుకూలించేలా పిచ్‌లు తయారుచేయాలని న్యూజిలాండ్ మాజీ ఆటగాడు మార్టిన్ క్రో సూచించారు. ఇలా అయితే వన్డే సిరీస్‌తో పాటు టెస్టు సిరీస్‌ను కూడా కివీస్ జట్టు దక్కించుకుంటుందని అభిప్రాయపడ్డారు. 2009 అనంతరం భారత జట్టు ఇక్కడ పర్యటిస్తోంది. టెస్టు జట్టులో ధోని, జహీర్, ఇషాంత్ మినహా అందరికీ ఇది తొలి పర్యటనే. ‘దాదాపు అందరి ఆటగాళ్లకు ఇక్కడ ఆడిన అనుభవం పెద్దగా లేదు. టిమ్ సౌతీ, ట్రెంట్ బౌల్ట్, నీల్ వాగ్నర్ భారత టాప్-6 ఆటగాళ్లను లక్ష్యంగా చేసుకోవాలి. పిచ్‌లు పూర్తి పచ్చికతో కూడి ఉండాలి. ఇటీవల ఇలాంటి పిచ్‌లు అంతగా కనిపించడం లేదు. ఇరు జట్ల మధ్య ర్యాంకింగ్స్‌లో భారీ తేడానే ఉన్నా మైదానంలో అదేమంత ప్రభావం చూపదు’ అని క్రో పేర్కొన్నారు. -
తేలిగ్గా తీసుకోవట్లేదు!
నేపియర్: న్యూజిలాండ్ జట్టును వారి సొంతగడ్డపై ఎదుర్కోవడం సులభం కాదని భారత క్రికెట్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని వ్యాఖ్యానించాడు. వారిని తేలిగ్గా తీసుకుంటే ప్రతికూల ఫలితం ఎదురయ్యే ప్రమాదం ఉందని అతను అభిప్రాయపడ్డాడు. ‘న్యూజిలాండ్ అద్భుతమైన జట్టు. ఆ జట్టులో మంచి బౌలర్లు ఉన్నారు. ఇటీవల వారి ప్రదర్శన కూడా చాలా బాగుంది. అన్నింటికీ మించి కివీస్‌లోని పరిస్థితులపై వారికి అవగాహన ఉంది. ముఖ్యంగా గతంలో ఇక్కడ ఆడని మా ఆటగాళ్లకు పెద్ద సవాల్‌లాంటిదే’ ధోని విశ్లేషించాడు. ఐదు వన్డేలు, రెండు టెస్టుల సిరీస్ కోసం న్యూజిలాండ్ చేరుకున్న అనంతరం భారత కెప్టెన్ ఇక్కడ మీడియాతో మాట్లాడాడు. ‘మేం ప్రత్యర్థిని తేలిగ్గా తీసుకోవడం లేదు. మేం వారికి తగిన గౌరవం ఇస్తాం. ఒంటిచేత్తో విజయాన్ని అందించగల సత్తా ఉన్న అనుభవజ్ఞులు కొంత మంది ఆ జట్టులో ఉన్నారు’ అని ధోని అన్నాడు. బౌలర్లు రాణిస్తారు... వచ్చే ఏడాది జరిగే వన్డే ప్రపంచకప్ కోసం ఈ సిరీస్ తమ జట్టులోని యువ ఆటగాళ్లకు సన్నాహకంగా ఉపయోగపడుతుందని భారత కెప్టెన్ అభిప్రాయపడ్డాడు. ‘ఇది మా కుర్రాళ్లకు మంచి అవకాశం. ఇక్కడి మైదానాలు ఇతర దేశాల్లో వాటికంటే భిన్నంగా ఉంటాయి. ఫీల్డింగ్ స్థానాలు కూడా అదే తరహాలో అనిపిస్తాయి. అందుకే ప్రత్యేకంగా ఫీల్డింగ్ స్థానాలు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ పర్యటన సరికొత్త అనుభవంగా మిగులుతుంది’ అని ధోని అన్నాడు. భారత జట్టు బౌలర్లు రాణించగలరని కెప్టెన్ విశ్వాసం వ్యక్తం చేశాడు. ‘బౌలర్లు బాగా ఆడతారని నేను నమ్ముతున్నా. అయితే ఇది కూడా పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. వికెట్ ఫాస్ట్ బౌలింగ్‌కు అనుకూలిస్తే దానిని ఉపయోగించుకోగల సత్తా మా బౌలర్లలో ఉంది’ అని ధోని వ్యాఖ్యానించాడు. వన్డే సిరీస్‌కు వెటోరి దూరం! వెన్నునొప్పితో బాధ పడుతున్న కివీస్ సీనియర్ ఆటగాడు డానియెల్ వెటోరి భారత్‌తో జరిగే వన్డే సిరీస్‌కు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సిరీస్ కోసం బుధవారం జట్టును ఎంపిక చేయనున్న సెలక్షన్ కమిటీ అతని పేరును పరిశీలించే అవకాశం లేదని సమాచారం. న్యూజిలాండ్ కోచ్ మైక్ హెసన్ ఈ విషయాన్ని సూత్రప్రాయంగా వెల్లడించారు. సుదీర్ఘ కాలంగా వెన్నునొప్పితో బాధపడుతున్న వెటోరి త్వరలోనే తన కెరీర్‌ను కూడా ముగించవచ్చని వార్తలు వస్తున్నాయి. అందులో భాగంగానే అతను ఐపీఎల్లో బెంగళూరు జట్టు కోచ్‌గా బాధ్యతలు చేపట్టినట్లు అతని సన్నిహిత వర్గాలు భావిస్తున్నాయి. -
న్యూజిలాండ్ చేరుకున్న ధోని సేన
నేపియర్: భారత క్రికెట్ జట్టు న్యూజిలాండ్ చేరుకుంది. ఐదు వన్డేల సిరీస్‌తో పాటు రెండు టెస్టులను ఆడేందుకు ధోని నేతృత్వంలోని భారత క్రికెట్ జట్టు ఇక్కడికి చేరుకుంది. ఆహ్లాదక వాతావరణం, ఉల్లాపరిచే పరిసరాలు నేపియర్ తమకు స్వాగతం పలికిందని ఇక్కడికి చేరుకున్న తర్వాత విరాట్ కోహ్లి ట్వీట్ చేశాడు. మైదానంలో దిగేందుకు ఉవ్విళ్లూరుతున్నామని పేర్కొన్నాడు. టీమిండియా సభ్యులు ముంబై నుంచి ఆక్లాండ్ చేరుకుని అక్కడి నుంచి నాపియర్కు వచ్చారు. ఈనెల 19 నుంచి 31 వరకు జరిగే వన్డే సిరీస్‌లో నేపియర్, వెల్లింగ్టన్, హామిల్టన్, ఆక్లాండ్ వేదికల్లో మ్యాచ్‌లు జరుగుతాయి. వచ్చే నెల 6 నుంచి టెస్టు సిరీస్ ప్రారంభమవుతుంది. దీనికి ముందు రెండు రోజుల వార్మప్ మ్యాచ్ ఉంటుంది. అయితే బ్యాట్స్‌మెన్ చతేశ్వర్ పుజారా, మురళీ విజయ్, పేస్ బౌలర్లు జహీర్ ఖాన్, ఉమేశ్ యాదవ్ మరో వారం తర్వాత కివీస్‌కు వెళ్లనున్నారు. 2008-09 అనంతరం భారత జట్టు తొలిసారిగా న్యూజిలాండ్ పర్యటనకు వెళుతుండగా ఓవరాల్‌గా ఇది తొమ్మిదోసారి. -
నేపియర్‌లో తొలి వన్డే
వెల్లింగ్టన్: వచ్చే ఏడాది న్యూజిలాండ్‌లో భారత్ పర్యటన షెడ్యూల్‌ను కివీస్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. జనవరి 19 నుంచి ఫిబ్రవరి 18 వరకు ఈ టూర్ సాగుతుంది. ఇందులో భాగంగా భారత్-న్యూజిలాండ్ మధ్య ఐదు వన్డేలు, 2 టెస్టు మ్యాచ్‌లు జరుగుతాయి. నేపియర్‌లో జరిగే తొలి వన్డేతో భారత పర్యటన ప్రారంభమవుతుంది. షెడ్యూల్ వివరాలు తొలి వన్డే : జనవరి 19 (నేపియర్) రెండో వన్డే : జనవరి 22 (హామిల్టన్) మూడో వన్డే : జనవరి 25 (ఆక్లాండ్) నాలుగో వన్డే : జనవరి 28 (హామిల్టన్) ఐదో వన్డే : జనవరి 31 (వెల్లింగ్టన్) తొలి టెస్టు : ఫిబ్రవరి 6-10 (ఆక్లాండ్) రెండో టెస్టు : ఫిబ్రవరి 14-18 (వెల్లింగ్టన్)