
చెన్నైలో చెస్ ఒలింపియాడ్ సందడి మొదలైంది. ఈ నెల 28నుంచి 10 ఆగస్టు వరకు టోర్నీ జరుగుతోంది. ప్రచారంలో భాగంగా నగరంలోని నేపియర్ బ్రిడ్జ్‌కు అధికారులు ఇలా చదరంగ గళ్ల రూపు ఇచ్చారు. అయితే చెస్ ఆటగాళ్ల ప్రస్తావనే లేకుండా సిద్ధమైన టోర్నీ థీమ్ సాంగ్‌పై పలు విమర్శలు వస్తున్నాయి. ఇందులో ముఖ్యమంత్రి స్టాలిన్, ఏఆర్ రహమాన్ ప్రముఖంగా కనిపిస్తుండగా, కనీసం చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ కూడా లేకుండా వీడియో రూపొందింది. భారత్‌నుంచి ఇప్పటి వరకు 74 మంది చెస్ గ్రాండ్‌మాస్టర్లు రాగా, అందులో 26 మంది తమిళనాడుకు చెందినవారే కావడం విశేషం.