భారత్‌లో నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక 44వ చెస్ ఒలింపియాడ్‌కు టీమిండియా మాజీ క్రికెటర్ ఎంఎస్ ధోని హాజరవ్వనున్నాడు. అయితే ఒక ప్లేయర్‌గా కాదులెండి.. ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా మాత్రమే. ఆగస్టు 28న చెస్ ఒలింపియాడ్ ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీని ముఖ్య అతిథిగా ఆహ్వానించిన నిర్వాహకులు.. ముగింపు వేడుకలు కూడా అంతే ఘనంగా ఉండాలని ధోనికి ఆహ్వానం పంపింది. కాగా ముగింపు వేడుకల ఇవాళ(మంగళవారం) సాయంత్రమే జరగనున్నాయి. ధోని రాక కోసం చెన్నై అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.
ఇక తలైవాకు చెన్నైతో విడదీయరాని అనుబంధం ఉంది. ఐపీఎల్ ప్రారంభమైనప్పటికి నుంచి ధోని సీఎస్‌కేకు ప్రాతినిధ్యం వహిస్తూనే ఉన్నాడు. ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా పేరు సంపాదించిన ధోని సీఎస్‌కే నాలుగుసార్లు చాంపియన్‌గా నిలిపాడు. కాగా ఈ సీజన్ ప్రారంభంలో ధోని తప్పుకోవడంతో జడేజాను కెప్టెన్‌గా నియమించింది. కానీ కెప్టెన్సీ భారాన్ని తగ్గించుకునేందుకు జడేజా నాయకత్వ బాధ్యతల నుంచి మధ్యలోనే వైదొలిగాడు. మరోసారి ధోని కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్నప్పటికి నిరాశపర్చిన సీఎస్‌కే పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో నిలిచింది. ఇక వచ్చే ఏడాది ఐపీఎల్‌లోనూ ధోనినే సీఎస్‌కేను నడిపించనున్నాడు.
ఇక తొలిసారి భారత్‌కు వచ్చిన చెస్ ఒలింపియాడ్‌లో భారత ఆటగాళ్లు సహా ఇతర దేశాల చెస్ క్రీడాకారులు విరివిగా పాల్గొన్నారు. వాస్తవానికి 44వ చెస్ ఒలింపియడ్‌ను ఉక్రెయిన్‌లో నిర్వహించాల్సింది. కానీ రష్యా మిలటరీ దాడుల నేపథ్యంలో ఆఖరి నిమిషంలో చెస్ గవర్నింగ్ బాడీ ఫిడే(అంతర్జాతీయ చెస్ ఫెడరషన్ సమాఖ్య) భారత్‌లోని చెన్నై సిటీని హోస్ట్‌గా ఎంపిక చేసి గేమ్స్‌ను తరలించింది.
దీంతో చెస్ ఒలింపియాడ్ నిర్వహించే సువర్ణవకాశం భారత్‌కు దక్కింది. చెస్ ఒలింపియాడ్ మహిళల విభాగంలో కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, వైశాలి, తానియా సచ్‌దేవ్, భక్తి కులకర్ణిలతో కూడిన భారత ‘ఎ’ జట్టు పతకం రేసులో నిలిచింది. పదో రౌండ్ తర్వాత భారత్ ‘ఎ’ 17 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. పదో రౌండ్‌లో భారత్ ‘ఎ’ 3.5–0.5తో కజకిస్తాన్‌పై నెగ్గింది. ఓపెన్ విభాగంలో భారత్ ‘ఎ’ మూడో స్థానంలో... భారత్ ‘బి’ నాలుగో స్థానంలో ఉన్నాయి. నేడు చివరిదైన 11వ రౌండ్ జరుగుతుంది.
చదవండి: ఈ స్వర్ణం కోసం ఎంతో నిరీక్షించాను.. ఎట్టకేలకు: సింధు
Comments
Please login to add a commentAdd a comment