
భారత సంతతి స్పిన్నర్ అజాజ్ పటేల్
వెల్లింగ్టన్ : భారత సంతతికి చెందిన స్పిన్నర్ అజాజ్ పటేల్ న్యూజిలాండ్ టెస్టు జట్టుకు ఎంపికయ్యాడు. అక్టోబర్‌లో దుబాయ్ వేదికగా పాకిస్తాన్‌తో జరిగే మూడుటెస్టుల సిరీస్ కోసం న్యూజిలాండ్ సెలక్టర్లు 15 మంది సభ్యులు గల జట్టును ప్రకటించారు. ఈ జట్టులో అజాజ్‌కు చోటు దక్కింది. ముంబైలో పుట్టిన అజాజ్.. చిన్నతనంలోనే న్యూజిలాండ్‌కు వెళ్లాడు. అక్కడి డొమెస్టిక్ క్రికెట్‌లో అద్భుతంగా రాణించడంతో అజాజ్‌కు ఈ అవకాశం దక్కింది.
మిచెల్ సాంట్నర్ గాయపడటంతో అతని స్థానంలో అజాజ్‌ను తీసుకున్నట్లు చీఫ్ సెలక్టర్ గావిన్ లార్సెన్ తెలిపారు. సాంట్నర్ స్థానంలో అజాజ్ సరైనవాడని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక కివీస్ డొమెస్టిక్ క్రికెట్‌లో అజాజ్ 48 వికెట్లు పడగొట్టి డొమెస్టిక్ ప్లేయర్ ఆఫ్ ఇయర్ 2017గా నిలిచాడు. జట్టులోకి అజాజ్‌తో పాటు టామ్ బ్లండేల్, బ్యాకప్ వికెట్ కీపర్‌గా బీజే వాట్లింగ్‌లను కూడా తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment