మూడు టెస్టుల్లో ఘన విజయం, ఆ తర్వాత తొలి వన్డేలోనూ భారీ తేడాతో గెలుపు... న్యూజిలాండ్ జట్టు మన గడ్డపై అడుగు పెట్టిననాటినుంచి వరుస విజయాలతో పండుగ చేసుకున్న భారత జట్టు జోరుకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. సాధారణ లక్ష్యాన్ని ఛేదించడంలో మన బ్యాట్స్‌మెన్ విఫలం కావడంతో భారత గడ్డపై కివీస్ బోణీ చేసింది. తక్కువ స్కోర్ల మ్యాచ్ చివరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగినా... చివరకు విలియమ్సన్ సేనదే పైచేరుు అరుుంది.