
ముంబై: వన్డే సిరీస్‌లో పాల్గొనేందుకు భారత గడ్డపై అడుగు పెట్టిన న్యూజిలాండ్‌కు తొలి వార్మప్ మ్యాచ్‌లోనే వాస్తవ పరిస్థితి అర్థమైంది. భారత ద్వితీయ శ్రేణి జట్టులాంటి బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్ ఆటగాళ్లను కూడా సమర్థంగా ఎదుర్కోలేక కివీస్ చతికిల పడింది.
ప్రధాన వన్డే సిరీస్‌కు ముందు ఆత్మవిశ్వాసం కూడగట్టుకునేందుకు ఆ జట్టుకు మరో అవకాశం లభించింది. అదే జట్టుతో నేడు జరిగే రెండో ప్రాక్టీస్ మ్యాచ్‌లోనైనా రాణించాలని కివీస్ పట్టుదలగా ఉంది.