Board Presidents Eleven
-
అయ్యో...రోహిత్
టీమిండియా టెస్టు జట్టులో సుస్థిర స్థానం ఆశిస్తూ... ఓపెనర్‌గా భారీ ప్రయోగానికి సిద్ధపడిన రోహిత్ శర్మకు తీవ్ర నిరాశ...! అందరి కళ్లూ తనపై ఉండగా... దాదాపు రోజంతా ఆడే అవకాశం ఉన్న స్థితిలో... క్రీజులోకి వచి్చన ఈ హిట్‌మ్యాన్... కేవలం రెండంటే రెండే బంతుల్లో డకౌట్‌గా వెనుదిరిగాడు. ఏ బలహీనత అయితే టెస్టు ఫార్మాట్‌కు తనను దూరం చేస్తోందో... దానికే మరోసారి అతడు వికెట్ పారేసుకున్నాడు. పరిస్థితుల రీత్యా... దక్షిణాఫ్రికాతో సన్నాహక మ్యాచ్‌లో బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవెన్ మిగతా బ్యాట్స్‌మెన్ ప్రదర్శన కంటే రోహిత్ వైఫల్యమే ఎక్కువ చర్చనీయాంశమైంది. ఇప్పటికే టీమిండియా తలుపు తడుతోన్న ఆంధ్ర వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ కోన శ్రీకర్ భరత్ అద్భుత బ్యాటింగ్‌తో మరోసారి సెలక్టర్ల దృష్టిలో పడటం విశేషం. సాక్షి ప్రతినిధి విజయనగరం: ముందున్న ఓపెనింగ్ పరీక్షను ఎదుర్కొనడానికి, టెస్టు శైలి బ్యాటింగ్ సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి సన్నాహక మ్యాచ్ రూపంలో దొరికిన అవకాశాన్ని రోహిత్ శర్మ (0) చేజార్చుకున్నాడు. దక్షిణాఫ్రికాతో శనివారం ఇక్కడ డ్రాగా ముగిసిన మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవెన్ కెప్టెన్ హోదాలో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన రోహిత్... ఫిలాండర్ బౌలింగ్‌లో సున్నాకే ఔటయ్యాడు. సంప్రదాయ ఫార్మాట్లో స్వింగ్ అయ్యే ఎరుపు బంతిని ఆడలేడన్న విమర్శకు తగ్గట్లే అతడు వికెట్ ఇచ్చేశాడు. అయితే, ఈ మ్యాచ్ యువ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ శ్రీకర్ భరత్ (57 బంతుల్లో 71; 7 ఫోర్లు, 5 సిక్స్‌లు)లోని దూకుడైన ఆటను మళ్లీ చాటింది. ప్రియాంక్ పాంచల్ (77 బంతుల్లో 60; 10 ఫోర్లు, సిక్స్); సిద్దేశ్ లాడ్ (89 బంతుల్లో 52 నాటౌట్; 7 ఫోర్లు, సిక్స్)లకు ఫామ్‌ను ప్రదర్శించే వీలు కలి్పంచింది. 64 ఓవర్ల ఆట అనంతరం బోర్డు జట్టు స్కోరు 265/8 వద్ద ఉండగా మ్యాచ్‌ను ‘డ్రా’గా ప్రకటించారు. నిలిచిన బవుమా; ఫిలాండర్ దూకుడు ఓవర్‌నైట్ స్కోరు 199/5తో ఆట కొనసాగించిన దక్షిణాఫ్రికా శనివారం మరో 14 ఓవర్లు ఆడి 80 పరుగులు జోడించి 279/6 వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ టెంబా బవుమా (127 బంతుల్లో 87 నాటౌట్; 14 ఫోర్లు, సిక్స్) నిలకడ చూపగా ఫిలాండర్ (49 బంతుల్లో 48; 6 ఫోర్లు, సిక్స్) ధాటిగా ఆడాడు. ధర్మేంద్ర జడేజా (3/66) బౌలింగ్‌లో అతడు ఔటయ్యాక దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. భరతం పట్టాడు భారీ స్కోరు చేయకున్నా... బోర్డు ఇన్నింగ్స్‌లో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (92 బంతుల్లో 39; 6 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. రోహిత్ ఔటయ్యాక వన్‌డౌన్‌లో వచి్చన అభిమన్యు ఈశ్వరన్ (13)ను రబడ బలిగొన్నాడు. మయాంక్, పాంచల్ మూడో వికెట్‌కు 62 పరుగులు జోడించారు. మయాంక్, కరుణ్ నాయర్ (19)లను కేశవ్ మహరాజ్ (3/35) పాంచల్‌ను ఫిలాండర్ (2/27) వరుసగా ఔట్ చేయడంతో జట్టు 136/5తో ఇబ్బందుల్లో పడింది. ఈ దశలో లాడ్, భరత్ 100 పరుగులు జోడించి ఆదుకున్నారు. ముఖ్యంగా భరత్ టి20 తరహాలో చెలరేగి ఆడాడు. ఆఫ్ స్పిన్నర్ డేన్ పీట్ (1/80)ను లక్ష్యంగా చేసుకుని సిక్స్‌లతో ప్రతాపం చూపాడు. సెంచరీ ఖాయంగా కనిపించిన అతడి దూకుడుకు కేశవ్ తెరదించాడు. జలజ్ సక్సేనా (2), ధర్మేంద్ర జడేజా (0) ఔటయ్యాక ఆట ముగిసింది. -
మార్క్రమ్ మెరుపు శతకం
సాక్షి ప్రతినిధి విజయనగరం: టీమిండియాతో టెస్టు సిరీస్‌కు ముందు దక్షిణాఫ్రికా ఓపెనర్ మార్క్రమ్ (118 బంతుల్లో 100 రిటైర్డ్ ఔట్; 18 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఫామ్ చాటుకున్నాడు. బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవెన్‌తో విజయనగరంలో జరుగుతున్న మూడు రోజుల సన్నాహక మ్యాచ్‌లో రెండో రోజు అతడు సెంచరీ కొట్టాడు. ఇటీవల భారత్ ‘ఎ’ జట్టుపై భారీ శతకం (160) బాదిన అతడు... ఈ మ్యాచ్‌లోనూ దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. మైదానం ఔట్ ఫీల్డ్ చిత్తడిగా ఉండటంతో శుక్రవారం మధ్యాహ్నం నుంచి మ్యాచ్ ప్రారంభమైంది. 50 ఓవర్ల అనంతరం వెలుతురు లేమి తో ముందే నిలిపివేశారు. కీలక బ్యాట్స్‌మెన్ టెంబా బవుమా (92 బంతుల్లో 55 నాటౌట్; 9 ఫోర్లు) అర్ధ సెంచరీతో రాణించడంతో సఫారీలు రోజు ముగిసే సరికి 5 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేశారు. దక్షిణాఫ్రికా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోగా... ఓపెనర్ డీన్ ఎల్గర్ (6)ను ఏడో ఓవర్లోనే ఉమేశ్ యాదవ్ వెనక్కు పంపాడు. డి బ్రుయెన్ (6)ను ఇషాన్ పొరెల్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఈ దశలో జుబయిర్ హమ్జా (22)తో కలిసి మార్క్రమ్ ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. సెంచరీ పూర్తయ్యాక మార్క్రమ్ రిటైర్డ్ ఔట్‌గా వెనుదిరిగాడు. కెపె్టన్ డు ప్లెసిస్ (9)ను ధర్మేంద్ర జడేజా ఎల్బీ చేశాడు. మ్యాచ్‌కు శనివారం చివరి రోజు. దక్షిణాఫ్రికా ఇదే స్కోరు వద్ద డిక్లేర్ చేసి బోర్డు జట్టు బ్యాటింగ్‌కు వీలు కల్పించనుంది. తద్వారా టీమిండియా హిట్‌మ్యాన్ రోహిత్‌శర్మ ఓపెనర్‌గా చూసే అవకాశం ఉంది. -
ఆట లేదు వానే..!
సాక్షి ప్రతినిధి విజయనగరం: బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవెన్–దక్షిణాఫ్రికా జట్ల మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌కు వరుణుడు అడ్డుతగిలాడు. గురువారం జల్లులతో ప్రారంభమైన వర్షం చాలాసేపు పడటంతో తొలి రోజు ఆటను నిర్వాహకులు పూర్తిగా రద్దు చేశారు. విజయనగరం సమీపంలోని డా. పీవీజీ రాజు ఏసీఏ స్పోర్ట్స్ కాంప్లెక్స్ మైదానం వేదికైన ఈ మ్యాచ్‌లో కనీసం టాస్ కూడా పడలేదు. వాతావరణ ప్రభావంతో మైదానాన్ని పూర్తిగా కవర్లతో కప్పి ఉంచారు. ఉదయం 8 గంటలకే చేరుకున్న ఇరు జట్ల క్రీడాకారులు చాలాసేపు వేచి చూశారు. చివరకు మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత విశాఖపట్నం తిరుగు ప్రయాణమయ్యారు. అంతర్జాతీయ స్థాయి క్రికెటర్ల ఆటను దగ్గరగా చూసేందుకు వచ్చిన అభిమానులు నిరాశగా వెనుదిరిగారు. అంతకుముందు ఉదయం 9.30 సమయంలో వరుణుడు కాస్త తెరపినివ్వడంతో ఆట ప్రారంభించే యత్నాలు చేశారు. అంతలోనే మళ్లీ వాన మొదలైంది. శుక్రవారం సైతం వర్షం కురిసే అవకాశం ఉంది. -
లెక్క సరిచేయాలని..
ముంబై: వన్డే సిరీస్‌లో పాల్గొనేందుకు భారత గడ్డపై అడుగు పెట్టిన న్యూజిలాండ్‌కు తొలి వార్మప్ మ్యాచ్‌లోనే వాస్తవ పరిస్థితి అర్థమైంది. భారత ద్వితీయ శ్రేణి జట్టులాంటి బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్ ఆటగాళ్లను కూడా సమర్థంగా ఎదుర్కోలేక కివీస్ చతికిల పడింది. ప్రధాన వన్డే సిరీస్‌కు ముందు ఆత్మవిశ్వాసం కూడగట్టుకునేందుకు ఆ జట్టుకు మరో అవకాశం లభించింది. అదే జట్టుతో నేడు జరిగే రెండో ప్రాక్టీస్ మ్యాచ్‌లోనైనా రాణించాలని కివీస్ పట్టుదలగా ఉంది. -
ఆసీస్‌కు సూపర్ ప్రాక్టీస్
బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్‌పై భారీ విజయం చెన్నై: టీమిండియాతో వన్డే సిరీస్ కోసం ఆస్ట్రేలియా జట్టు తమ సన్నాహాలను ఘనంగా ఆరంభించింది. తమ బ్యాట్స్‌మెన్‌కు ఫుల్ ప్రాక్టీస్ లభించడంతో మంగళవారం బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్‌తో జరిగిన ఏకైక వన్డే ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఆసీస్ 103 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ స్టొయినిస్ (60 బంతుల్లో 76; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. అతడికి తోడుగా ఆరంభంలో వార్నర్ (48 బంతుల్లో 64; 11 ఫోర్లు), స్మిత్ (68 బంతుల్లో 55; 4 ఫోర్లు, 1 సిక్స్), హెడ్ (63 బంతుల్లో 65; 5 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలు సాధించారు. దాంతో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ 50 ఓవర్లలో ఏడు వికెట్లకు 347 పరుగుల భారీ స్కోరు సాధించింది. స్టొయినిస్, మాథ్యూ వేడ్ (24 బంతుల్లో 45; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) విజృంభణకు ఆసీస్ చివరి 10 ఓవర్లలో 101 పరుగులు సాధించింది. వాషింగ్టన్ సుందర్, కుశంగ్ పటేల్ రెండేసి వికెట్లు తీశారు. ఆ తర్వాత భారీ లక్ష్య ఛేదనకు దిగిన బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్ 48.2 ఓవర్లలో 244 పరుగులకు ఆలౌట్ అయ్యింది. శ్రీవత్స్ గోస్వామి (43), మయాంక్ అగర్వాల్ (42) రాణించారు. వీరి మధ్య రెండో వికెట్‌కు 76 పరుగుల భాగస్వామ్యం నెలకొంది. లెఫ్టార్మ్ స్పిన్నర్ ఏస్టన్ అగర్‌కు 4 వికెట్లు దక్కాయి. -
తొలి పోరుకు దక్షిణాఫ్రికా సిద్ధం
నేడు బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్‌తో వార్మప్ మ్యాచ్ న్యూఢిల్లీ: భారత పర్యటనను విజయంతో ఆరంభించాలని భావిస్తున్న దక్షిణాఫ్రికా జట్టు తొలి పోరుకు సన్నద్ధమైంది. ఇక్కడి పాలం మైదానంలో మంగళవారం జరిగే టి20 వార్మప్ మ్యాచ్‌లో సఫారీలు, బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్‌తో తలపడనున్నారు. శుక్రవారం భారత్‌తో తొలి టి20 మ్యాచ్ ఆడనున్న నేపథ్యంలో ఈ ప్రాక్టీస్ గేమ్‌లో పూర్తి స్థాయి జట్టును బరిలోకి దించాలని దక్షిణాఫ్రికా భావి స్తోంది. ముఖ్యంగా ప్రధాన బ్యాట్స్‌మెన్ డివిలి యర్స్, కెప్టెన్ డు ప్లెసిస్, డుమిని, మిల్లర్ హిట్టింగ్ ప్రాక్టీస్‌కు ఈ మ్యాచ్ ఉపయోగపడుతుంది. సాధారణ గ్రౌండ్లతో పోలిస్తే పాలం మైదానం చిన్నది కావడం వల్ల భారీ షాట్ల మోత మోగవచ్చు. టి20 లకు స్టెయిన్, మోర్నీ మోర్కెల్ దూరమైనా... కైల్ అబాట్, మోరిస్, తాహిర్‌లు కీలక బౌలర్లు. మరోవైపు బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్ మరీ కుర్రాళ్లతో నిండి ఉంది. సీనియర్ జట్టు తర్వాత ప్రధాన టీమ్ అయిన ఇండియా ‘ఎ’, బంగ్లాదేశ్‌తో టెస్టులు ఆడుతుండటంతో ఈ మ్యాచ్‌లో ఐపీఎల్ ఆటగాళ్లే ఎక్కువ మంది ఉన్నారు. వీరు ప్రత్యర్థికి అంత పోటీ ఇచ్చే అవకాశమైతే లేదు. అయితే తమ ప్రతిభను నిరూపించుకునేందుకు కెప్టెన్ మన్దీప్, చహల్, కుల్దీప్, రిషి ధావన్‌లాంటి ఆటగాళ్లకు ఇది మంచి అవకాశం. ఇప్పటికే భారత్‌కు ఆడిన సంజూ శామ్సన్, మనీష్ పాండే కూడా బరిలో ఉన్నారు.