
విజయోత్సాహంలో ఆసీస్ ఆటగాళ్లు
ఆక్లాండ్ : డక్‌వర్త్-లూయిస్ పద్ధతిలో ట్రాన్స్-టాస్మన్ టీ20 ట్రై-సిరీస్ ఫైనల్లో కివీస్‌పై ఆసీస్ 19 పరుగుల తేడాతో గెలిచింది. మొదట బ్యాటింగ్ చేపట్టిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. రాస్ టేలర్(43) ఓ మాత్రంగా రాణించాడు. ఆసీస్ బౌలర్లలో అస్టన్ అగర్‌కు 3 వికెట్లు, రిచర్డ్‌సన్‌కు 2 వికెట్లు, టైకు 2 వికెట్లు దక్కాయి. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన ఆసీస్ 14.4 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది.
అప్పటికి వర్షం మొదలు కావడంతో మ్యాచ్‌ని నిలిపివేశారు. వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో డక్‌వర్త్-లూయిస్ నిబంధనలు ప్రకారం ఆసీస్ 19 పరుగులతో గెలిచినట్లు డిక్లేర్ చేశారు. కీలక సమయంలో వికెట్లు తీసిని అస్టన్ అగర్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు, సిరీస్ ఆసాంతం రాణించిన గ్లెన్ మాక్స్‌వెల్‌కు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు దక్కాయి.
Comments
Please login to add a commentAdd a comment