లక్ష్య ఛేదనలో కివీస్ కొత్త రికార్డు
హరారే : ఓపెనర్లు మార్టిన్ గుప్టిల్ (138 బంతుల్లో 116 నాటౌట్; 11 ఫోర్లు, 1 సిక్స్), లాథమ్ (116 బంతుల్లో 110 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీలతో చెలరేగడంతో మంగళవారం జరిగిన రెండో వన్డేలో న్యూజిలాండ్ 10 వికెట్ల తేడాతో జింబాబ్వేపై ఘన విజయం సాధించింది. జింబాబ్వే నిర్దేశించిన 236 పరుగుల లక్ష్యాన్ని కివీస్ 42.2 ఓవర్లలో వికెట్లేమీ నష్టపోకుండా ఛేదించింది. దీంతో వికెట్లు నష్టపోకుండా అత్యధిక స్కోరును ఛేదించిన జట్టుగా కొత్త రికార్డును సృష్టించింది. గతంలో 2011 ప్రపంచకప్ క్వార్టర్స్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో లంక వికెట్ నష్టపోకుండా 231 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది.
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే 50 ఓవర్లలో 9 వికెట్లకు 235 పరుగులు చేసింది. సికిందర్ రజా (95 బంతుల్లో 100 నాటౌట్; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) చెలరేగి ఆడాడు. మూడు మ్యాచ్‌ల సిరీస్ ప్రస్తుతం 1-1తో సమంగా ఉంది. ఇరుజట్ల మధ్య రెండో వన్డే శుక్రవారం జరుగుతుంది.
దుమ్మురేపిన గుప్టిల్, లాథమ్
Published Wed, Aug 5 2015 12:52 AM | Last Updated on Sun, Sep 3 2017 6:46 AM
Advertisement