Latham
-
చిలీలో రూ.262 కోట్ల దోపిడీకి యత్నం
శాంటియాగో: చిలీ రాజధాని శాంటియాగోలో వందల కోట్ల నగదును దోచుకునేందుకు సాయుధ దుండగులు చేసిన ప్రయత్నం విఫలమైంది. ఈ ఘటనలో ఇద్దరు చనిపోయారు. అమెరికాలోని మియామి నుంచి శాంటియాగో విమానాశ్రయానికి బుధవారం చేరుకున్న విమానంలో 32 మిలియన్ డాలర్ల (రూ.262 కోట్ల) నగదు ఉంది. బ్యాంకుల్లో పంపిణీ చేయాల్సిన ఆ నగదును ట్రక్కులోకి తరలించేందుకు సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో, 10 మంది సాయుధ దుండగులు ఎయిర్‌పోర్టులోకి ప్రవేశించారు. పక్కా ప్రణాళికతో అక్కడికి చేరుకున్న దుండగులు నగదును ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించారు. అడ్డుకున్న భద్రతా సిబ్బందితో కొద్దిసేపు ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. కాల్పుల్లో భద్రతా సిబ్బంది ఒకరు, ఒక దుండగుడు చనిపోయారు. దుండగులు వెంటనే తమ వాహనంలో అక్కడి నుంచి పరారయ్యారు. అనంతరం ఆ ప్రాంతంలో పూర్తిగా కాలిపోయిన మరో రెండు వాహనాలు కనిపించాయి. భద్రతా సిబ్బంది సకాలంలో స్పందించి ఈ భారీ దోపిడీని అడ్డుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. నగదును తీసుకువచ్చిన లాతమ్ విమానంలోని ప్రయాణికులకు ఎటువంటి అపాయం కలగలేదన్నారు. ఇదే శాంటియాగో ఎయిర్‌పోర్టులో గతంలో రెండుసార్లు దోపిడీ దొంగలు తెగబడి మొత్తం 25 మిలియన్ డాలర్ల నగదును ఎత్తుకెళ్లారు. -
ఆలౌట్ చేసి... ఆలౌట్ దారిలో...
బౌలర్లు కష్టపడి ప్రత్యర్థిని తమకంటే తక్కువ స్కోరుకే ఆలౌట్ చేస్తే... మన బ్యాట్స్‌మెన్ మళ్లీ కష్టాలపాలు చేశారు. తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన కివీస్ టెయిలెండర్ జేమీసన్ చక్కగా 49 పరుగులు చేశాడు. కానీ రెండో ఇన్నింగ్స్‌లో మన స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్ పృథ్వీ షా (14), మయాంక్ అగర్వాల్ (3), కోహ్లి (14), రహానే (9)లు అంతా కలిసి 40 పరుగులు చేయడం టీమిండియా ‘పటిష్టమైన బ్యాటింగ్’ లైనప్ ముద్రకు పెను సవాల్ విసురుతోంది. క్రీజులో ఉన్న విహారి, రిషభ్ పంత్ మూడో రోజు భారీ ఇన్నింగ్స్ ఆడితే తప్పించి రెండో టెస్టులోనూ భారత్‌కు భంగపాటు తప్పేలా లేదు. క్రైస్ట్‌చర్చ్: భారత బౌలర్లు న్యూజిలాండ్ బ్యాటింగ్ జోరుకు కళ్లెం వేశారు. అయితే తొలి టెస్టులాగే టెయిలెండర్లను ఆపలేకపోయినా... మొత్తం మీద చెమటోడ్చి తమ తొలి ఇన్నింగ్స్ కంటే తక్కువ స్కోరుకే ప్రత్యర్థిని ఆలౌట్ చేశారు. కానీ బ్యాట్స్‌మెన్ మళ్లీ బాధ్యత మరిచారు. సమం చేసేందుకు పురోగమించే చోట సమర్పించుకునేందుకే తిరోగమించారు. 36వ ఓవర్ పూర్తవకముందే 6 కీలక వికెట్లను అప్పగించేశారు. రెండో టెస్టులో బౌలర్ల శ్రమతో పట్టు చిక్కినట్లే చిక్కి పేలవ బ్యాటింగ్‌తో భారత్ కష్టాల్లో పడింది. స్థూలంగా చెప్పాలంటే రెండో రోజు ఆటను ఇరు జట్ల బౌలర్లు శాసించారు. ఏకంగా 16 వికెట్లను పడేశారు. దీంతో ఈ టెస్టు నేడే ముగిసినా ఆశ్చర్యం లేదు. ఆదివారం మొదట 63/0 ఓవర్‌నైట్ స్కోరుతో ఆట కొనసాగించిన న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 73.1 ఓవర్లలో 235 పరుగుల వద్ద ఆలౌటైంది. ఓపెనర్ లాథమ్ (52; 5 ఫోర్లు) అర్ధ శతకం సాధించాడు. భారత బౌలర్లలో షమీ 4, బుమ్రా 3 వికెట్లు తీశారు. తర్వాత రెండో ఇన్నింగ్స్ ఆడిన భారత్ ఆట నిలిచే సమయానికి 36 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది. అవుటైన ఆరుగురితో పాటు క్రీజ్‌లో ఉన్న ఇద్దరు... మొత్తం 8 మందిలో ఏ ఒక్కరు చెప్పుకోదగ్గ స్కోరే చేయలేదు. బౌల్ట్ (3/12) భారత ఇన్నింగ్స్‌ను దెబ్బ తీశాడు. రాణించిన లాథమ్... ఆటమొదలైన కాసేపటికే న్యూజిలాండ్ రెండు కీలక వికెట్లను కోల్పోయింది. బ్లన్‌డెల్ (30; 4 ఫోర్లు)ను ఉమేశ్... కెప్టెన్ కేన్ విలియమ్సన్‌ను (3)ను బుమ్రా అవుట్ చేశాడు. జట్టు స్కోరు వంద పరుగులు దాటాక... షమీ విజృంభించాడు. దీంతో స్వల్ప వ్యవధిలో రాస్ టేలర్ (15; 1 ఫోర్), ఫిఫ్టీ పూర్తి చేసుకున్న లాథమ్, నికోల్స్ (14; 1 ఫోర్) పెవిలియన్ చేరారు. టేలర్‌ను జడేజా బోల్తా కొట్టించగా... లాథమ్, నికోల్స్‌లను షమీ అవుట్ చేశాడు. లంచ్ విరామానికి కివీస్ స్కోర్ 142/5. రెండో సెషన్లో కివీస్ పతనం కొనసాగింది. బుమ్రా ఒకే ఓవర్లో వాట్లింగ్ (0), సౌతీ (0)లను డకౌట్‌గా పంపాడు. ఈ దశలో గ్రాండ్‌హోమ్ (26; 4 ఫోర్లు), టెయిలెండర్ జేమీసన్ (49; 7 ఫోర్లు)తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దే పనిలో పడినప్పటికీ ఈ జోడీ ఎంతోసేపు నిలువలేదు. జడేజా... గ్రాండ్‌హోమ్‌ను బౌల్డ్ చేశాడు. 177 పరుగులకే 8 వికెట్లను కోల్పోయినా కూడా కివీస్ కథ అప్పుడే ముగిసిపోలేదు. జేమీసన్, వాగ్నర్ (21; 3 ఫోర్లు)తో కలిసి 9వ వికెట్‌కు 51 పరుగుల కీలక భాగస్వామ్యం అందించడంతో భారత్ భారీ ఆధిక్యానికి గండిపడింది. ఎట్టకేలకు షమీ తన వరుస ఓవర్లలో వాగ్నర్, జేమీసన్‌లను అవుట్ చేయడంతో 235 పరుగుల వద్ద కివీస్ ఇన్నింగ్స్‌కు తెరపడింది. కష్టాలతో రెండో ఇన్నింగ్స్... తమకన్నా తక్కువ స్కోరుకే ప్రత్యర్థిని కట్టడి చేశామన్న భారత్ ఆనందం ఆవిరయ్యేందుకు ఎంతోసేపు పట్టలేదు. తీరు మారని బ్యాటింగ్‌తో రెండో ఇన్నింగ్స్ కష్టాలతోనే మొదలైంది. రెండో ఓవర్లోనే బౌల్ట్ బౌలింగ్‌లో మయాంక్ (3) వికెట్ల ముందు దొరికిపోయాడు. మరో ఓపెనర్ పృథ్వీ షా (14) కాసేపే ఆడగలిగాడు. ఇతన్ని సౌతీ అవుట్ చేయగా... కెప్టెన్ కోహ్లి (14; 3 ఫోర్లు), పుజారా (24; 2 ఫోర్లు) జట్టు స్కోరును కష్టమ్మీద 50 పరుగులు దాటించారు. దీనికి మరో పరుగు జతయ్యాక విరాట్ కోహ్లి ఎల్బీగా పెవిలియన్ బాట పట్టాడు. తర్వాత రహానే (9) వచ్చినా... ఉమేశ్ (1)ను నైట్‌వాచ్‌మన్‌గా పంపించినా ఫలితం లేకపోయింది. కుదురుకుంటాడనుకున్న పుజారా కూడా బౌల్ట్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డవ్వడం భారత్ కష్టాల్ని మరింత పెంచింది. ఆట నిలిచే సమయానికి హనుమ విహారి (5 బ్యాటింగ్), రిషభ్ పంత్ (1 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం భారత్ ఓవరాల్ ఆధిక్యం 97 పరుగులకు చేరింది. సౌతీ, వాగ్నర్, గ్రాండ్‌హోమ్ తలా ఒక వికెట్ తీశారు. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 242; న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: లాథమ్ (బి) షమీ 52; బ్లన్‌డెల్ ఎల్బీడబ్ల్యూ (బి) ఉమేశ్ 30; విలియమ్సన్ (సి) పంత్ (బి) బుమ్రా 3; రాస్ టేలర్ (సి) ఉమేశ్ (బి) జడేజా 15; నికోల్స్ (సి) కోహ్లి (బి) షమీ 14; వాట్లింగ్ (సి) జడేజా (బి) బుమ్రా 0; గ్రాండ్‌హోమ్ (బి) జడేజా 26; సౌతీ (సి) పంత్ (బి) బుమ్రా 0; జేమీసన్ (సి) పంత్ (బి) షమీ 49; వాగ్నర్ (సి) జడేజా (బి) షమీ 21; బౌల్ట్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 24; మొత్తం (73.1 ఓవర్లలో ఆలౌట్) 235 వికెట్ల పతనం: 1–66, 2–69, 3–109, 4–130, 5–133, 6–153, 7–153, 8–177, 9–228, 10–235. బౌలింగ్: బుమ్రా 22–5–62–3, ఉమేశ్ యాదవ్ 18–2–46–1, షమీ 23.1–3–81–4, జడేజా 10–2–22–2. భారత్ రెండో ఇన్నింగ్స్: పృథ్వీ షా (సి) లాథమ్ (బి) సౌతీ 14; మయాంక్ ఎల్బీడబ్ల్యూ (బి) బౌల్ట్ 3; పుజారా (బి) బౌల్ట్ 24; కోహ్లి (ఎల్బీడబ్ల్యూ) (బి) గ్రాండ్‌హోమ్ 14; రహానే (బి) వాగ్నర్ 9; ఉమేశ్ (బి) బౌల్ట్ 1; విహారి (బ్యాటింగ్) 5, పంత్ (బ్యాటింగ్) 1; ఎక్స్‌ట్రాలు 19; మొత్తం (36 ఓవర్లలో 6 వికెట్లకు) 90. వికెట్ల పతనం: 1–8, 2–26, 3–51, 4–72, 5–84, 6–89. బౌలింగ్: సౌతీ 6–2–20–1, బౌల్ట్ 9–3–12–3, జేమీసన్ 8–4–18–0, గ్రాండ్‌హోమ్ 5–3–3–1, వాగ్నర్ 8–1–18–1. -
బౌల్ట్ ‘హ్యాట్రిక్’
అబుదాబి: న్యూజిలాండ్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ ‘హ్యాట్రిక్’తో చెలరేగడంతో పాకిస్తాన్‌తో తొలి వన్డేలో కివీస్ 47 పరుగుల తేడాతో గెలుపొందింది. అంతర్జాతీయ క్రికెట్లో బౌల్ట్‌కు ఇది తొలి ‘హ్యాట్రిక్’ కాగా వన్డేల్లో న్యూజిలాండ్ తరఫున మూడోది. గతంలో డానీ మోరిసన్ (భారత్‌పై 1999లో), షేన్ బాండ్ (ఆస్ట్రేలియాపై 2007లో) ఈ ఘనత సాధించారు. 3 వన్డేల సిరీస్‌లో భాగంగా బుధవారం జరిగిన తొలి వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 266 పరుగులు చేసింది. టేలర్ (112 బంతుల్లో 80; 5 ఫోర్లు), లాథమ్ (64 బంతుల్లో 68;5 ఫోర్లు) అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు. పాక్ బౌలర్లలో షాహిన్ అఫ్రిది (4/46), షాదాబ్ ఖాన్ (4/38) రాణించారు. అనంతరం 267 పరుగుల లక్ష్య ఛేదనకు బరిలో దిగిన పాకిస్తాన్‌కు 3వ ఓవర్లోనే గట్టి దెబ్బ తగిలింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ బౌల్ట్ (3/54) వరుస బంతుల్లో ఫఖర్ జమాన్ (1), బాబర్ ఆజమ్ (0), హఫీజ్ (0)లను వెనక్కి పంపడంతో ఆ జట్టు 8 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ సర్ఫరాజ్ (64; 7 ఫోర్లు), ఇమాద్ వసీం (50; 2 సిక్స్‌లు) ఏడో వికెట్‌కు 103 పరుగులు జోడించినా లాభం లేకపోయింది. చివర కు పాక్ 47.2 ఓవర్లలో 219 పరుగులకు ఆలౌటైంది. హఫీజ్ యాక్షన్‌పై రచ్చ... ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ స్పిన్నర్ మొహమ్మద్ హఫీజ్ బౌలింగ్ చేస్తున్న సమయంలో అతని బౌలింగ్ శైలి సరిగ్గా లేదని న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్ రాస్ టేలర్ బహిరంగంగా విమర్శించాడు. హఫీజ్ శైలిని అనుకరిస్తూ ‘చకింగ్’ చేస్తున్నట్లుగా సైగలు చేశాడు. ఈ అంశాన్ని సిరీయస్‌గా తీసుకున్న పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ విషయాన్ని అంపైర్ల దృష్టికి తీసుకెళ్లాడు. హఫీజ్ తన బౌలింగ్ యాక్షన్ కారణంగా గతంలో మూడుసార్లు సస్పెన్షన్‌కు గురయ్యాడు. -
కివీస్ ఘన విజయం..
-
కివీస్ ఘన విజయం.. కోహ్లీ స్పెషల్ సెంచరీ వృథా
ముంబయి : టీమిండియాతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్ లో పర్యాటక జట్టు న్యూజిలాండ్ శుభారంభం చేసింది. భారత్ నిర్దేశించిన 281 పరుగుల లక్ష్యాన్ని మరో 6 బంతులుండగానే ఛేదించింది. ఇక్కడి వాంఖడే స్టేడియంలో జరిగిన తొలి వన్డేలో న్యూజిలాండ్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. లాథమ్ (102 బంతుల్లో 103 నాటౌట్: 8 ఫోర్లు, 2 సిక్సర్లు), రాస్ టేలర్ (100 బంతుల్లో 95: 8 ఫోర్లు) భారీ ఇన్నింగ్స్ లతో నాలుగో వికెట్ కు డబుల్ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. మరోవైపు టీమిండియా బౌలర్లు తేలిపోవడంతో వారికి విజయం నల్లేరుపై నడక అయింది. చివర్లో ఒక్క పరుగు అవసరమైన సమయంలో టేలర్ ఔట్ కావడంతో క్రీజులోకొచ్చిన నికోల్స్ ఫోర్ కొట్టడంతో కివీస్ సంబరాలు మొదలయ్యాయి. భారత బౌలర్లలో పాండ్యా, బుమ్రా, కుల్దీప్, భువనేశ్వర్ తలో వికెట్ తీశారు. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌ను 4-1తో కైవసం చేసుకున్న కోహ్లీ సేన కివీస్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌ను మాత్రం ఓటమితో ఆరంభించింది. తొలుత టాస్ నెగ్గి బ్యాటింగ్ చేసిన ఆతిథ్య టీమిండియా నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 280 పరుగులు చేసింది. 200వ వన్డే ఆడుతున్న కెప్టెన్ విరాట్ కోహ్లీ శతకం (125 బంతుల్లో 121: 9 ఫోర్లు, 2 సిక్సర్లు)తో రాణించాడు. దినేష్ కార్తిక్ (37), ధోని(25)తో భాగస్వామ్యాలు నమోదు చేస్తూ జట్టుకు పరుగులు జోడించాడు కోహ్లీ. అయితే చివరి ఓవర్లలో భారత్ 8 రన్ రేట్ తో పరుగులు సాధిస్తూ వికెట్లు కోల్పోయింది. కివీస్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ 10 ఓవర్లు వేసి 35 పరుగులే ఇచ్చి ఓపెనర్లు సహా నాలుగు వికెట్లు తీశాడు. సౌథీ 3 వికెట్లు తీయగా, శాంట్నర్‌కు ఓ వికెట్ దక్కింది. ఇరుజట్ల మధ్య రెండో వన్డే 25న జరగనుంది. (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
బంగ్లాదేశ్‌కు ఆధిక్యం
వెల్లింగ్టన్: న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ 18.3 ఓవర్లలో 3 వికెట్లకు 66 పరుగులు చేసింది. దీంతో ప్రస్తుతం పర్యాటక జట్టు తొలి ఇన్నింగ్స్‌తో కలుపుకుని 122 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. అంతకుముందు న్యూజిలాండ్ జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లో 539 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీంతో బంగ్లాకు 56 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. కివీస్ జట్టులో లాథమ్ (177; 18 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీ చేశాడు. రహీమ్ స్థానంలో సబ్‌స్టిట్యూట్ వికెట్‌కీపర్‌గా వచ్చిన ఇమ్రుల్ కయేస్ ఒకే ఇన్నింగ్స్‌లో ఐదు క్యాచ్‌లు తీసుకొని ప్రపంచ రికార్డును సృష్టించాడు. -
దుమ్మురేపిన గుప్టిల్, లాథమ్
లక్ష్య ఛేదనలో కివీస్ కొత్త రికార్డు హరారే : ఓపెనర్లు మార్టిన్ గుప్టిల్ (138 బంతుల్లో 116 నాటౌట్; 11 ఫోర్లు, 1 సిక్స్), లాథమ్ (116 బంతుల్లో 110 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీలతో చెలరేగడంతో మంగళవారం జరిగిన రెండో వన్డేలో న్యూజిలాండ్ 10 వికెట్ల తేడాతో జింబాబ్వేపై ఘన విజయం సాధించింది. జింబాబ్వే నిర్దేశించిన 236 పరుగుల లక్ష్యాన్ని కివీస్ 42.2 ఓవర్లలో వికెట్లేమీ నష్టపోకుండా ఛేదించింది. దీంతో వికెట్లు నష్టపోకుండా అత్యధిక స్కోరును ఛేదించిన జట్టుగా కొత్త రికార్డును సృష్టించింది. గతంలో 2011 ప్రపంచకప్ క్వార్టర్స్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో లంక వికెట్ నష్టపోకుండా 231 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే 50 ఓవర్లలో 9 వికెట్లకు 235 పరుగులు చేసింది. సికిందర్ రజా (95 బంతుల్లో 100 నాటౌట్; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) చెలరేగి ఆడాడు. మూడు మ్యాచ్‌ల సిరీస్ ప్రస్తుతం 1-1తో సమంగా ఉంది. ఇరుజట్ల మధ్య రెండో వన్డే శుక్రవారం జరుగుతుంది. -
న్యూజిలాండ్ 297/8
ఇంగ్లండ్‌తో రెండో టెస్టు లీడ్స్ : లాథమ్ (180 బంతుల్లో 84; 13 ఫోర్లు), లూక్ రోంచీ (70 బంతుల్లో 88; 13 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించినా న్యూజిలాండ్ తడబడింది. ఇంగ్లండ్‌తో మొదలైన రెండో టెస్టులో తొలిరోజు శుక్రవారం కివీస్ 65 ఓవర్లలో 8 వికెట్లకు 297 పరుగులు చేసింది. క్రెయిగ్ (16), హెన్రీ (14) క్రీజులో ఉన్నారు. ఒక దశలో రెండు పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్ లాథమ్‌తో పాటు మెకల్లమ్ (28 బంతుల్లో 41; 6 ఫోర్లు, 1 సిక్సర్) రాణించడంతో కుదురుకుంది. అయితే ఇంగ్లండ్ బౌలర్లు చివరి సెషన్లో చకచకా వికెట్లు తీశారు. ఇంగ్లండ్ బౌలర్లలో బ్రాడ్ మూడు, అండర్సన్, వుడ్ రెండేసి వికెట్లు తీశారు. ఈ మ్యాచ్ ద్వారా అండర్సన్ 400 వికెట్లు తీసిన తొలి ఇంగ్లండ్ బౌలర్‌గా రికార్డు సాధించాడు.