న్యూజిలాండ్ 297/8 | New Zealand 297/8 | Sakshi
Sakshi News home page

న్యూజిలాండ్ 297/8

Published Sat, May 30 2015 1:01 AM | Last Updated on Wed, Oct 17 2018 4:43 PM

న్యూజిలాండ్ 297/8 - Sakshi

న్యూజిలాండ్ 297/8

ఇంగ్లండ్‌తో రెండో టెస్టు
 లీడ్స్ : లాథమ్ (180 బంతుల్లో 84; 13 ఫోర్లు), లూక్ రోంచీ (70 బంతుల్లో 88; 13 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించినా న్యూజిలాండ్ తడబడింది. ఇంగ్లండ్‌తో మొదలైన రెండో టెస్టులో తొలిరోజు శుక్రవారం కివీస్ 65 ఓవర్లలో 8 వికెట్లకు 297 పరుగులు చేసింది. క్రెయిగ్ (16), హెన్రీ (14) క్రీజులో ఉన్నారు. ఒక దశలో రెండు పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్ లాథమ్‌తో పాటు మెకల్లమ్ (28 బంతుల్లో 41; 6 ఫోర్లు, 1 సిక్సర్) రాణించడంతో కుదురుకుంది.

అయితే ఇంగ్లండ్ బౌలర్లు చివరి సెషన్‌లో చకచకా వికెట్లు తీశారు.  ఇంగ్లండ్ బౌలర్లలో బ్రాడ్ మూడు, అండర్సన్, వుడ్ రెండేసి వికెట్లు తీశారు. ఈ మ్యాచ్ ద్వారా అండర్సన్ 400 వికెట్లు తీసిన తొలి ఇంగ్లండ్ బౌలర్‌గా రికార్డు సాధించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement