
బాబర్ ఆజం (ఫైల్ ఫొటో)
New Zealand vs Pakistan, 1st T20I - Babar Azam Record: పాకిస్తాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ టీ20లలో అత్యధిక పరుగులు సాధించిన మూడో బ్యాటర్‌గా రికార్డులకెక్కాడు. తద్వారా కివీస్ బ్యాటర్ మార్టిన్ గఫ్టిల్‌ను అధిగమించాడు.
కెప్టెన్సీకి గుడ్‌బై
టీమిండియా స్టార్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మల తర్వాతి స్థానాన్ని ఆక్రమించాడు. న్యూజిలాండ్‌తో తొలి టీ20 సందర్భంగా బాబర్ ఆజం ఈ ఘనత సాధించాడు. కాగా వన్డే వరల్డ్‌కప్-2023లో పేలవ ప్రదర్శన తర్వాత పాక్ కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పిన బాబర్ ప్రస్తుతం కేవలం ఆటగాడిగానే కొనసాగుతున్నాడు.
ధనాధన్ ఇన్నింగ్స్
ఈ క్రమంలో టీ20 కొత్త సారథి షాహిన్ ఆఫ్రిది సారథ్యంలో న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లిన పాక్ జట్టులో భాగమయ్యాడు ఈ రైట్‌హ్యాండ్ బ్యాటర్. ఆక్లాండ్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో వన్‌డౌన్‌లో బ్యాటింగ్ చేసిన బాబర్ 35 బంతులు ఎదుర్కొని 6 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 57 పరుగులు సాధించాడు.
గప్టిల్ రికార్డు బద్దలు
ఈ నేపథ్యంలో బాబర్ ఆజం అంతర్జాతీయ టీ20లలో 3538 పరుగులు పూర్తి చేసుకున్నాడు. అత్యధిక పరుగుల వీరుల జాబితాలో మార్టిన్ గప్టిల్‌ను దాటి మూడోస్థానానికి ఎగబాకాడు. తన 105వ మ్యాచ్ సందర్భంగా ఈ ఘనత సాధించాడు. ఇక ఈ లిస్టులో విరాట్ కోహ్లి అగ్రస్థానంలో ఉండగా.. రోహిత్ శర్మ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. కాగా బాబర్ ఇంకో 316 పరుగులు సాధిస్తే రోహిత్‌ను కూడా దాటేస్తాడు!
అంతర్జాతీయ టీ20లలో అత్యధిక పరుగులు సాధించిన టాప్-5 క్రికెటర్లు:
1. విరాట్ కోహ్లి(ఇండియా)- 115 మ్యాచ్‌లలో- 4008 రన్స్
2. రోహిత్ శర్మ(ఇండియా)- 148 మ్యాచ్‌లలో- 3853 రన్స్
3. బాబర్ ఆజం(పాకిస్తాన్)- 105 మ్యాచ్‌లలో- 3538 రన్స్
4. మార్టిన్ గప్టిల్ (న్యూజిలాండ్)- 122 మ్యాచ్‌లలో- 3531 రన్స్
5. పాల్ స్టిర్లింగ్ (ఐర్లాండ్)- 134 మ్యాచ్‌లలో- 3438 రన్స్.
చదవండి: డారిల్ మిచెల్ ఊచకోత.. కివీస్ చేతిలో పాక్ చిత్తు! బాబర్ పోరాడినా..
చరిత్ర సృష్టించిన కివీస్ పేసర్: ప్రపంచంలోనే ఏకైక బౌలర్‌గా రికార్డు