‘టాప్’ క్లాస్ కివీస్
► వరుసగా నాలుగో విజయం
► గ్రూప్-2లో అగ్రస్థానం
► 75 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ చిత్తు
కోల్‌కతా: టి20 ప్రపంచకప్‌లో టాప్‌క్లాస్ ఆటతీరుతో చెలరేగుతున్న న్యూజిలాండ్ జట్టు లీగ్ దశను అగ్రస్థానంతో ముగించింది. నాణ్యమైన బౌలింగ్‌తో చెలరేగి వరుసగా నాలుగో మ్యాచ్‌లో గెలిచింది. శనివారం ఈడెన్‌గార్డెన్స్‌లో జరిగిన మ్యాచ్‌లో 75 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 145 పరుగులు చేసింది. విలియమ్సన్ (32 బంతుల్లో 42; 5 ఫోర్లు, 1 సిక్స్), మున్రో (33 బంతుల్లో 35; 1 ఫోర్, 2 సిక్సర్లు) నిలకడగా ఆడారు. టేలర్ (24 బంతుల్లో 28; 2 ఫోర్లు, 1 సిక్స్) ఆకట్టుకున్నారు. అయితే ముస్తాఫిజుర్ (5/22) సంచలన బౌలింగ్‌తో కివీస్ ఓ మాదిరి స్కోరుకే పరిమితమయింది.
తర్వాత బంగ్లాదేశ్ 15.4 ఓవర్లలో 70 పరుగులకే ఆలౌటయింది. శువగత (17 బంతుల్లో 16 నాటౌట్; 2 ఫోర్లు) టాప్ స్కోరర్. ఎలియట్ (3/12), సోధి (3/21)ల అద్భుత బౌలింగ్‌కు తోడు కివీస్ ఫీల్డింగ్‌లో చురుగ్గా వ్యవహరించింది. విలియమ్సన్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
స్కోరు వివరాలు: న్యూజిలాండ్ ఇన్నింగ్స్: నికోలస్ (బి) ముస్తాఫిజుర్ 7; విలియమ్సన్ (బి) ముస్తాఫిజుర్ 42; మున్రో (బి) అల్ అమిన్ 35; టేలర్ (సి) మిథున్ (బి) అల్ అమిన్ 28; అండర్సన్ (బి) మోర్తజా 0; ఎలియట్ (సి) శువగత (బి) ముస్తాఫిజుర్ 9; రోంచి నాటౌట్ 9; సాంట్నర్ (బి) ముస్తాఫిజుర్ 3; మెకల్లమ్ (బి) ముస్తాఫిజుర్ 0; మెక్లీంగన్ నాటౌట్ 6; ఎక్స్‌ట్రాలు: 6; మొత్తం: (20 ఓవర్లలో 8 వికెట్లకు) 145.
వికెట్ల పతనం: 1-25; 2-57; 3-99; 4-100; 5-122; 6-127; 7-139; 8-139.
బౌలింగ్: మోర్తజా 3-0-21-1; శువగత 3-0-16-0; షకీబ్ 4-0-33-0; ముస్తాఫిజుర్ 4-0-22-5; అల్ అమిన్ 4-0-27-2; మహ్మదుల్లా 2-0-21-0.
బంగ్లాదేశ్ ఇన్నింగ్స్: తమీమ్ రనౌట్ 3; మిథున్ (బి) మెక్లీంగన్ 11; షబ్బీర్ (సి) సాంట్నర్ (బి) మెకల్లమ్ 12; షకీబ్ (సి) మెకల్లమ్ (బి) సాంట్నర్ 2; సౌమ్య (స్టం) రోంచి (బి) సోధి 6; మహ్మదుల్లా (బి) సోధి 5; ముష్ఫికర్ (బి) ఎలియట్ 0; శువగత నాటౌట్ 16; మోర్తజా ఎల్బీడబ్ల్యు (బి) ఎలియట్ 3; ముస్తాఫిజుర్ (సి) రోంచి (బి) ఎలియట్ 6; అల్ అమిన్ (బి) సోధి 0; ఎక్స్‌ట్రాలు: 6; మొత్తం: (15.4 ఓవర్లలో ఆలౌట్) 70.
వికెట్ల పతనం: 1-4; 2-29; 3-31; 4-38; 5-43; 6-44; 7-48; 8-59; 9-65; 10-70.
బౌలింగ్: నాథన్ మెకల్లమ్ 2-0-6-1; అండర్సన్ 2-0-7-0; సాంట్నర్ 3-0-16-1; మెక్లీంగన్ 1-0-3-1; ఎలియట్ 4-0-12-3; సోధి 3.4-0-21-3.