Tamim
-
బంగ్లాదేశ్‌దే సిరీస్
బాసెటెర్ (వెస్టిండీస్): విండీస్ గడ్డపై 2009 తర్వాత బంగ్లాదేశ్ మళ్లీ సిరీస్ గెలుచుకుంది. తాజా మూడు వన్డేల సిరీస్‌ను 2–1తో నెగ్గింది. చివరి వన్డేలో తమీమ్ ఇక్బాల్ (124 బంతుల్లో 103; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీతో కదంతొక్కడంతో బంగ్లాదేశ్ 18 పరుగుల తేడాతో గెలిచింది. మొదట బంగ్లా 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 301 పరుగులు చేసింది. తర్వాత విండీస్ 6 వికెట్ల నష్టానికి 283 పరుగులు చేసి ఓడింది. గేల్ (73; 6 ఫోర్లు, 5 సిక్సర్లు), పావెల్ (74 నాటౌట్; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) ధాటిగా ఆడారు. హోప్ (64; 5 ఫోర్లు) అర్ధసెంచరీ సాధించాడు. తమీమ్ ఇక్బాల్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’తో పాటు ‘సిరీస్’ అవార్డులు లభించాయి. -
కుదురుకున్న బంగ్లాదేశ్
ఢాకా: ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో బంగ్లాదేశ్ కుదురుకుంది. రెండో రోజు శనివారం ఆట ముగిసే సమయానికి బంగ్లా రెండో ఇన్నింగ్సలో 31 ఓవర్లలో మూడు వికెట్లకు 152 పరుగులు చేసింది. తమీమ్ (40), మహ్మదుల్లా (47) రాణించారు. కేయస్ (59 బ్యాటింగ్) అజేయ అర్ధసెంచరీతో కీలక ఇన్నింగ్స ఆడాడు. అంతకుముందు ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్సలో 81.3 ఓవర్లలో 244 పరుగులకు ఆలౌటరుుంది. ఒక దశలో 144 పరుగులకు ఎనిమిది వికెట్లు కోల్పోరుునా... వోక్స్ (46), రషీద్ (44 నాటౌట్) కలిసి తొమ్మిదో వికెట్‌కు 99 పరుగులు జోడించి జట్టును ఆదుకున్నారు. బంగ్లా బౌలర్ మెహదీ హసన్ ఆరు వికెట్లు తీశాడు. తొలి ఇన్నింగ్సలో ఇంగ్లండ్‌కు 24 పరుగుల ఆధిక్యం లభించింది. ఓవరాల్‌గా ప్రస్తుతం బంగ్లాదేశ్ 128 పరుగుల ఆధిక్యంలో ఉంది. చేతిలో ఏడు వికెట్లు ఉన్నారుు. -
‘టాప్’ క్లాస్ కివీస్
► వరుసగా నాలుగో విజయం ► గ్రూప్-2లో అగ్రస్థానం ► 75 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ చిత్తు కోల్‌కతా: టి20 ప్రపంచకప్‌లో టాప్‌క్లాస్ ఆటతీరుతో చెలరేగుతున్న న్యూజిలాండ్ జట్టు లీగ్ దశను అగ్రస్థానంతో ముగించింది. నాణ్యమైన బౌలింగ్‌తో చెలరేగి వరుసగా నాలుగో మ్యాచ్‌లో గెలిచింది. శనివారం ఈడెన్‌గార్డెన్స్‌లో జరిగిన మ్యాచ్‌లో 75 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 145 పరుగులు చేసింది. విలియమ్సన్ (32 బంతుల్లో 42; 5 ఫోర్లు, 1 సిక్స్), మున్రో (33 బంతుల్లో 35; 1 ఫోర్, 2 సిక్సర్లు) నిలకడగా ఆడారు. టేలర్ (24 బంతుల్లో 28; 2 ఫోర్లు, 1 సిక్స్) ఆకట్టుకున్నారు. అయితే ముస్తాఫిజుర్ (5/22) సంచలన బౌలింగ్‌తో కివీస్ ఓ మాదిరి స్కోరుకే పరిమితమయింది. తర్వాత బంగ్లాదేశ్ 15.4 ఓవర్లలో 70 పరుగులకే ఆలౌటయింది. శువగత (17 బంతుల్లో 16 నాటౌట్; 2 ఫోర్లు) టాప్ స్కోరర్. ఎలియట్ (3/12), సోధి (3/21)ల అద్భుత బౌలింగ్‌కు తోడు కివీస్ ఫీల్డింగ్‌లో చురుగ్గా వ్యవహరించింది. విలియమ్సన్కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. స్కోరు వివరాలు: న్యూజిలాండ్ ఇన్నింగ్స్: నికోలస్ (బి) ముస్తాఫిజుర్ 7; విలియమ్సన్ (బి) ముస్తాఫిజుర్ 42; మున్రో (బి) అల్ అమిన్ 35; టేలర్ (సి) మిథున్ (బి) అల్ అమిన్ 28; అండర్సన్ (బి) మోర్తజా 0; ఎలియట్ (సి) శువగత (బి) ముస్తాఫిజుర్ 9; రోంచి నాటౌట్ 9; సాంట్నర్ (బి) ముస్తాఫిజుర్ 3; మెకల్లమ్ (బి) ముస్తాఫిజుర్ 0; మెక్లీంగన్ నాటౌట్ 6; ఎక్స్‌ట్రాలు: 6; మొత్తం: (20 ఓవర్లలో 8 వికెట్లకు) 145. వికెట్ల పతనం: 1-25; 2-57; 3-99; 4-100; 5-122; 6-127; 7-139; 8-139. బౌలింగ్: మోర్తజా 3-0-21-1; శువగత 3-0-16-0; షకీబ్ 4-0-33-0; ముస్తాఫిజుర్ 4-0-22-5; అల్ అమిన్ 4-0-27-2; మహ్మదుల్లా 2-0-21-0. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్: తమీమ్ రనౌట్ 3; మిథున్ (బి) మెక్లీంగన్ 11; షబ్బీర్ (సి) సాంట్నర్ (బి) మెకల్లమ్ 12; షకీబ్ (సి) మెకల్లమ్ (బి) సాంట్నర్ 2; సౌమ్య (స్టం) రోంచి (బి) సోధి 6; మహ్మదుల్లా (బి) సోధి 5; ముష్ఫికర్ (బి) ఎలియట్ 0; శువగత నాటౌట్ 16; మోర్తజా ఎల్బీడబ్ల్యు (బి) ఎలియట్ 3; ముస్తాఫిజుర్ (సి) రోంచి (బి) ఎలియట్ 6; అల్ అమిన్ (బి) సోధి 0; ఎక్స్‌ట్రాలు: 6; మొత్తం: (15.4 ఓవర్లలో ఆలౌట్) 70. వికెట్ల పతనం: 1-4; 2-29; 3-31; 4-38; 5-43; 6-44; 7-48; 8-59; 9-65; 10-70. బౌలింగ్: నాథన్ మెకల్లమ్ 2-0-6-1; అండర్సన్ 2-0-7-0; సాంట్నర్ 3-0-16-1; మెక్లీంగన్ 1-0-3-1; ఎలియట్ 4-0-12-3; సోధి 3.4-0-21-3. -
చల్ల చల్లని కూల్ కూల్
► మాయాజాలం చూపించిన ధోని ► ఒత్తిడిలోనూ తలవంచని తీరు ► భారత్‌ను గెలిపించిన వ్యూహ చతురత మూడు బంతుల్లో రెండు పరుగులు చేస్తే బంగ్లాదేశ్ గెలుస్తుంది. బౌలర్ పాండ్యాకి అనుభవం లేదు. ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నాడు. ఇక భారత్ ఓటమి ఖాయమని అందరికీ అర్థమయింది. అయినా కెప్టెన్ ధోని పట్టువదలకుండా పోరాడాలంటూ సహచరుల్లో స్ఫూర్తి నింపుతున్నాడు. ప్రతి బంతికీ బౌలర్ దగ్గరకి వెళ్లి ఏం చేయాలో చెబుతున్నాడు. బంగ్లాదేశ్‌తో మ్యాచ్ చివరి క్షణాల్లో ధోని మాస్టర్‌మైండ్ చూస్తే అర్థమవుతుంది... ఎందుకతను భారత క్రికెట్ చరిత్రలోనే విజయవంతమైన కెప్టెన్ అయ్యాడో. ఇన్నింగ్స్ ఆఖరి బంతి వేయడానికి ముందు కీపర్ ధోని కుడి చేతి గ్లౌవ్ తీసేశాడు. సాధారణంగా నిలుచునే స్థానంలో కాకుండా... ఐదడుగులు ముందుకు వచ్చి నిలబడ్డాడు. బంతి వికెట్లకు దూరంగా వేస్తే ఎట్టి పరిస్థితుల్లో అది తన దగ్గరకు రావాలి. రనౌట్ చేయాలనేది వ్యూహం. ఈ ట్రాప్‌లో బంగ్లా బ్యాట్స్‌మెన్ పడ్డారు. మరో కీపర్ అయితే బంతిని వికెట్లకు విసిరేవాడు. కానీ ధోని ముందే ఊహించాడు కాబట్టి పరిగెడుతూ వచ్చి బెయిల్స్ పడగొట్టాడు. ఇదీ ఆటగాడిగా తనకున్న అనుభవం. బంగ్లాదేశ్‌పై భారత్ సంచలన విజయం సాధించడంలో అందరికంటే కీలక పాత్ర ధోనిదే. తన దగ్గర వనరులన్నీ కరిగిపోతున్నా ఏమాత్రం స్థైర్యం కోల్పోకుండా సారథిగా జట్టును గెలిపించాడు. బెంగళూరునుంచి సాక్షి క్రీడా ప్రతినిధి బంగ్లాదేశ్‌పై భారత్ విజయంలో ధోని చేసిన రెండు స్టంపింగ్స్, చివరి ఓవర్లో తన చతురతదే ప్రధాన పాత్ర. వికెట్ ఎలా ఉన్నా 146 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోవడం అంత సులువు కాదు. బౌలర్లు కూడా ధోని ఆలోచనలకు తగినట్లుగా స్పందించారు. మూడు ఓవర్ల తొలి స్పెల్‌లో అశ్విన్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పాటు తొలి వికెట్ తీసి శుభారంభం ఇచ్చాడు. తమీమ్ చెలరేగుతున్న వేళ జడేజాతో బౌలింగ్ చేయించి తొలి ఓవర్లోనే స్టంపవుట్కు పురిగొల్పడం అద్భుతంగా పని చేసింది. రైనానుంచి కూడా ధోని అదే ఫలితం సాధించాడు. ఈ సారి షబ్బీర్‌ను స్టంప్ చేయడంలో అతని కీపింగ్‌లో అద్భుతం కనిపించింది. మళ్లీ రెండు సిక్సర్లు బాది ఊపు మీదున్న షకీబ్‌ను ఆపేందుకు అశ్విన్‌ను తీసుకు రావడం, అతను తొలి బంతికే వికెట్ తీయడం చకచకా జరిగిపోయాయి. ఇన్నింగ్స్ 13వ ఓవర్లో స్లిప్‌లో ఫీల్డర్‌ను ఉంచడం సాధారణంగా ఎవరూ ఊహించనిది. కానీ ధోని వ్యూహాలు అలాంటివి. ఏడు ఓవర్ల ముందే తన ప్రధాన బౌలర్ కోటా ముగించేయడం చూస్తే ఇకపై వేయాల్సిన ఓవర్ల గురించి కెప్టెన్‌కు స్పష్టత ఉందని అర్థమవుతుంది. పాండ్యా చివరి ఓవర్ వేయాల్సి వస్తుందని అతను ముందే సిద్ధమైనట్లున్నాడు. కుర్రాళ్లకు అండగా...: తొలి బంతికే మిస్ ఫీల్డ్, ఆ తర్వాత సునాయాస క్యాచ్ వదిలేయడం, ఒకే ఓవర్లో నాలుగు బౌండరీలు... ఇలా అన్ని రకాలుగా ఒత్తిడిలో ఉన్న బుమ్రాను ధోని నిరుత్సాహ పరచలేదు. ‘జరిగిందేదో జరిగిపోయింది. నువ్వు ఇక్కడే అర గంట ఏడ్చినా అతను అవుట్ కాడు. మన ప్రణాళిక అమలు చేయడం ముఖ్యం అని అతడితో మాట్లాడాను’ అని ధోని చెప్పడం ఒక యువ బౌలర్‌పై ఎలా నమ్మకం ఉంచాడనేదానికి నిదర్శనం. అదే ప్రోత్సాహంతో 19వ ఓవర్లో మళ్లీ చెలరేగిన బుమ్రా మ్యాచ్ ఫలితాన్ని శాసించాడు. ఇక చివరి ఓవర్ పాండ్యాకు అప్పగించే ముందయితే చర్చోపచర్చలు. ఈ సమయంలో పాండ్యాలో ధైర్యం నింపిన ధోని, ప్రతీ బంతి గురించి జాగ్రత్త తీసుకున్నాడు. చివరి బంతి కోసమైతే పాండ్యా బలం, బలహీనతపై కూడా దృష్టి పెట్టి బాధ్యత అప్పగించాడు. ‘పాండ్యా యార్కర్లు బాగా వేయలేడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో యార్కర్‌కు ప్రయత్నించవద్దని మాత్రం స్పష్టం చేశాను. వైడ్ కాకుండా లెంగ్త్ బాల్ వేస్తే చాలని అనుకున్నాం. అది అద్భుతంగా పని చేసింది. ఇంత గందరగోళం మధ్యలో పరిస్థితిని చక్కబెట్టడమే విజయ రహస్యం’ అని ధోని అన్నాడు. పాండ్యా, బుమ్రాలు తొలిసారి ఇంత ఒత్తిడిలో ఆడారని, వారు భవిష్యత్తులో నేర్చుకుంటారని కూడా కెప్టెన్ మరింత ప్రోత్సహించే ప్రయత్నం చేశాడు. ధోని నాయకత్వంలో భారత్ గొప్ప, చిరస్మరణీయ విజయాలు సాధించడం ఇదేమీ తొలిసారి కాదు. గతంలోనూ కొన్ని హోరాహోరీ మ్యాచ్‌లు జరిగాయి. చాలా సందర్భాల్లో బ్యాటింగ్‌తో ప్రత్యర్థిపై ఆధిక్యం ప్రదర్శించిన ధోని... ఈ మ్యాచ్‌లో కెప్టెన్‌గా వందకు వంద మార్కులు సంపాదించుకున్నాడు.