బంగ్లాదేశ్‌దే సిరీస్‌ | Tamim leads Bangladesh to series triumph against Windies | Sakshi
Sakshi News home page

బంగ్లాదేశ్‌దే సిరీస్‌

Published Mon, Jul 30 2018 1:35 AM | Last Updated on Mon, Jul 30 2018 1:35 AM

Tamim leads Bangladesh to series triumph against Windies  - Sakshi

బాసెటెర్‌ (వెస్టిండీస్‌): విండీస్‌ గడ్డపై 2009 తర్వాత బంగ్లాదేశ్‌ మళ్లీ సిరీస్‌ గెలుచుకుంది. తాజా మూడు వన్డేల సిరీస్‌ను 2–1తో నెగ్గింది. చివరి వన్డేలో తమీమ్‌ ఇక్బాల్‌ (124 బంతుల్లో 103; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీతో కదంతొక్కడంతో బంగ్లాదేశ్‌ 18 పరుగుల తేడాతో గెలిచింది. మొదట బంగ్లా 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 301 పరుగులు చేసింది.

 తర్వాత విండీస్‌ 6 వికెట్ల నష్టానికి 283 పరుగులు చేసి ఓడింది. గేల్‌ (73; 6 ఫోర్లు, 5 సిక్సర్లు), పావెల్‌ (74 నాటౌట్‌; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) ధాటిగా ఆడారు. హోప్‌ (64; 5 ఫోర్లు) అర్ధసెంచరీ సాధించాడు. తమీమ్‌ ఇక్బాల్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’తో పాటు ‘సిరీస్‌’ అవార్డులు లభించాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement