హోప్‌ సెంచరీ వృథా: బంగ్లాదేశ్‌ చేతిలో విండీస్‌ ఓటమి  | Windies defeat to Bangladesh | Sakshi
Sakshi News home page

హోప్‌ సెంచరీ వృథా: బంగ్లాదేశ్‌ చేతిలో విండీస్‌ ఓటమి 

Published Wed, May 8 2019 12:30 AM | Last Updated on Wed, May 8 2019 12:30 AM

Windies defeat to Bangladesh - Sakshi

ముక్కోణపు సిరీస్‌లో భాగంగా డబ్లిన్‌లో వెస్టిండీస్‌తో మంగళవారం  జరిగిన వన్డేలో బంగ్లాదేశ్‌ ఎనిమిది వికెట్ల తేడాతో నెగ్గింది. తొలుత విండీస్‌ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 261 పరుగులు చేసింది. ఓపెనర్‌ షై హోప్‌ (109; 11 ఫోర్లు, 1 సిక్స్‌) వరుసగా రెండో సెంచరీ చేశాడు. రోస్టన్‌ ఛేజ్‌ (51; 2 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధశతకం సాధించాడు.

బంగ్లా బౌలర్లలో మొర్తజా (3/49), సైఫుద్దీన్‌ (2/47) రాణించారు. అనంతరం తమీమ్‌  (80; 7 ఫోర్లు), సౌమ్య సర్కార్‌ (73; 9 ఫోర్లు, 1 సిక్స్‌), షకీబుల్‌ (61 నాటౌట్‌; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీల సాయంతో బంగ్లాదేశ్‌ 45 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 264 పరుగులు చేసి గెలిచింది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement