బంగ్లాదేశ్‌దే టి20 సిరీస్‌  | Windies lost in a decisive match | Sakshi
Sakshi News home page

బంగ్లాదేశ్‌దే టి20 సిరీస్‌ 

Published Tue, Aug 7 2018 12:29 AM | Last Updated on Tue, Aug 7 2018 12:29 AM

Windies lost in a decisive match - Sakshi

లాడెర్‌హిల్‌ (అమెరికా): వెస్టిండీస్‌తో మూడు టి20ల సిరీస్‌ను బంగ్లాదేశ్‌ 2–1తో కైవసం చేసుకుంది. ఆదివారం రాత్రి జరిగిన ఆఖరి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో 19 పరుగుల తేడాతో విండీస్‌పై గెలుపొందింది. మొదట బంగ్లాదేశ్‌ 20 ఓవర్లలో 5 వికెట్లకు 184 పరుగులు చేసింది. ఓపెనర్‌ లిటన్‌ దాస్‌ (32 బంతుల్లో 61; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగాడు. మహ్మూదుల్లా (20 బంతుల్లో 32; 4 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించాడు. కెప్టెన్‌ షకీబ్‌ 24, తమీమ్‌ ఇక్బాల్‌ 21 పరుగులు చేశారు.

విండీస్‌ బౌలర్లలో బ్రాత్‌వైట్, కీమో పాల్‌ చెరో 2 వికెట్లు తీశారు. తర్వాత వర్షంతో ఆట నిలిచే సమయానికి వెస్టిండీస్‌ 17.1 ఓవర్లలో 7 వికెట్లకు 135 పరుగులు చేసి ఓడింది. రస్సెల్‌ (21 బంతుల్లో 47; 1 ఫోర్, 6 సిక్సర్లు) భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. పావెల్‌ 23, రామ్‌దిన్‌ 21 పరుగులు చేశారు. ముస్తఫిజుర్‌ రహమాన్‌కు 3 వికెట్లు దక్కాయి. లిటన్‌ దాస్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’, షకీబ్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ అవార్డు లభించాయి.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement