కుదురుకున్న బంగ్లాదేశ్
ఢాకా: ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో బంగ్లాదేశ్ కుదురుకుంది. రెండో రోజు శనివారం ఆట ముగిసే సమయానికి బంగ్లా రెండో ఇన్నింగ్‌సలో 31 ఓవర్లలో మూడు వికెట్లకు 152 పరుగులు చేసింది. తమీమ్ (40), మహ్మదుల్లా (47) రాణించారు. కేయస్ (59 బ్యాటింగ్) అజేయ అర్ధసెంచరీతో కీలక ఇన్నింగ్‌స ఆడాడు.
అంతకుముందు ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్‌సలో 81.3 ఓవర్లలో 244 పరుగులకు ఆలౌటరుుంది. ఒక దశలో 144 పరుగులకు ఎనిమిది వికెట్లు కోల్పోరుునా... వోక్స్ (46), రషీద్ (44 నాటౌట్) కలిసి తొమ్మిదో వికెట్‌కు 99 పరుగులు జోడించి జట్టును ఆదుకున్నారు. బంగ్లా బౌలర్ మెహదీ హసన్ ఆరు వికెట్లు తీశాడు. తొలి ఇన్నింగ్‌సలో ఇంగ్లండ్‌కు 24 పరుగుల ఆధిక్యం లభించింది. ఓవరాల్‌గా ప్రస్తుతం బంగ్లాదేశ్ 128 పరుగుల ఆధిక్యంలో ఉంది. చేతిలో ఏడు వికెట్లు ఉన్నారుు.