భారీ విజయంతో ఇంగ్లండ్‌ బోణీ  | England bounced back with a huge win | Sakshi
Sakshi News home page

భారీ విజయంతో ఇంగ్లండ్‌ బోణీ 

Published Wed, Oct 11 2023 3:49 AM | Last Updated on Wed, Oct 11 2023 3:49 AM

England bounced back with a huge win - Sakshi

ధర్మశాల: డిఫెండింగ్‌ చాంపియన్‌ ఇంగ్లండ్‌ భారీ విజయంతో బోణీకొట్టింది. వన్డే ప్రపంచకప్‌లో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో బట్లర్‌ బృందం 137 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌పై జయభేరి మోగించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 364 పరుగులు చేసింది. ఓపెనర్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ డేవిడ్‌ మలాన్‌ (107 బంతుల్లో 140; 16 ఫోర్లు, 5 సిక్సర్లు) తన కెరీర్‌లో ఆరో సెంచరీతో చెలరేగాడు.

బెయిర్‌స్టో (59 బంతుల్లో 52; 8 ఫోర్లు)తో తొలి వికెట్‌కు 115 పరుగులు జోడించిన మలాన్‌... రెండో వికెట్‌కు రూట్‌ (68 బంతుల్లో 82; 8 ఫోర్లు, 1 సిక్స్‌)తో కలిసి మరో 151 పరుగులు జతచేశాడు. కెప్టెన్‌ బట్లర్‌ (20), బ్రూక్‌ (20) రెండంకెల స్కోరు చేశారు. మెహదీ హసన్‌ 4, షోరిఫుల్‌ ఇస్లామ్‌ 3 వికెట్లు తీశారు. అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించలేక బంగ్లాదేశ్‌ 48.2 ఓవర్లలో 227 పరుగుల వద్ద ఆలౌటైంది. ఓపెనర్‌ లిటన్‌ దాస్‌ (66 బంతుల్లో 76; 7 ఫోర్లు, 2 సిక్సర్లు), ముష్ఫికర్‌ రహీమ్‌ (64 బంతుల్లో 51; 4 ఫోర్లు) రాణించారు. టోప్లే 4, వోక్స్‌ 2 వికెట్లు పడగొట్టారు. 

స్కోరు వివరాలు 
ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌: బెయిర్‌స్టో (బి) షకీబ్‌ 52; మలాన్‌ (బి) మెహదీ హసన్‌ 140; రూట్‌ (సి) రహీమ్‌ (బి) షోరిఫుల్‌ 82; బట్లర్‌ (బి) షోరిఫుల్‌ 20, బ్రూక్‌ (సి) లిటన్‌దాస్‌ (బి) మెహదీ హసన్‌ 20; లివింగ్‌స్టోన్‌ (బి) షోరిఫుల్‌ 0; కరన్‌ (సి) నజు్మల్‌ (బి) మెహదీ హసన్‌ 11; వోక్స్‌ (సి) మెహదీ హసన్‌ (బి) అహ్మద్‌ 14; ఆదిల్‌ (సి) నజు్మల్‌ (బి) మెహదీ హసన్‌ 11; మార్క్‌ వుడ్‌ (నాటౌట్‌) 6; టోప్లే (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (50 ఓవర్లలో 9 వికెట్లకు) 364. వికెట్ల పతనం: 1–115, 2–266, 3–296, 4–307, 5–307, 6–327, 7–334, 8–352, 9–362. బౌలింగ్‌: ముస్తఫిజుర్‌ 10–0– 70–0, అహ్మద్‌ 6–0–38–1, షోరిఫుల్‌ 10–0–75–3,  హసన్‌ 8–0–71– 4, షకీబ్‌ 10–0–52–1, మిరాజ్‌ 6–0– 55–0. 

బంగ్లాదేశ్‌ ఇన్నింగ్స్‌: లిటన్‌ దాస్‌ (సి) బట్లర్‌ (బి) వోక్స్‌ 76; తంజిద్‌ (సి) బెయిర్‌స్టో (బి) టోప్లే 1; నజు్మల్‌ (సి) లివింగ్‌స్టోన్‌ (బి) టోప్లే 0; షకీబ్‌ (బి) టోప్లే 1; మిరాజ్‌ (సి) బట్లర్‌ (బి) వోక్స్‌ 8; ముష్ఫికర్‌ (సి) ఆదిల్‌ (బి) టోప్లే 51; తౌహిద్‌ (సి) బట్లర్‌ (బి) లివింగ్‌స్టోన్‌ 39; మెహదీ హసన్‌ (బి) ఆదిల్‌ 14; అహ్మద్‌ (బి) కరన్‌ 15; షోరిఫుల్‌ (బి) వుడ్‌ 12; ముస్తఫిజుర్‌ (నాటౌట్‌) 3; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (48.2 ఓవర్లలో ఆలౌట్‌) 227. వికెట్ల పతనం: 1–14, 2–14, 3–26, 4–49, 5–121, 6–164, 7–189, 8–195, 9–221, 10–227. బౌలింగ్‌: వోక్స్‌ 8–0–49–2, టోప్లే 10–1–43–4, సామ్‌ కరన్‌ 7.2–0–47–1, వుడ్‌ 10–0–29–1, ఆదిల్‌ రషీద్‌ 10–0–42–1, లివింగ్‌స్టోన్‌ 3–0–13–1. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement