ఢాకా: ఐదోసారి బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపొందిన అవామీ లీగ్ చీఫ్, దేశ ప్రధాని షేక్ హసీనా కీలక వ్యాఖ్యలు చేశారు. ‘సహజంగానే బంగ్లాదేశ్ ప్రజలు చాలా తెలివైన వారు. రానున్న ఐదేళ్లలో దేశ ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించడమే నా లక్ష్యం. 2041కల్లా బంగ్లాదేశ్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకున్నాం.
స్మార్ట్ ఎకానమి, స్మార్ట్ ప్రభుత్వం, స్మార్ట్ ప్రజలు నా లక్ష్యాలు’ అని ఎన్నికల్లో మూడింట రెండొంతుల సీట్లు గెలిచి ఘన విజయం సాధించిన తర్వాత హసీనా అన్నారు. ఆదివారం జరిగిన బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికలను ఆ దేశ ప్రధాన పతిపక్ష పార్టీ బహిష్కరించింది.
ఎన్నికల్లో బీఎన్‌పీ పార్టీ అభ్యర్థులు పోటీ చేయలేదు. దీంతో షేక్ హసీనా అవామీ లీగ్ పార్టీ విజయం ఎన్నికల ముందే దాదాపు ఖరారైంది. అయితే ప్రతిపక్ష బీఎన్‌పీ పార్టీ ఉగ్రవాదులతో కుమ్మక్కై ఎన్నికల్లో పోటీ చేయడానికి భయపడిందని, వారు ఎన్నికలను బహిష్కరించి తనను గెలిపించలేదని, బంగ్లాదేశ్ ప్రజలను గెలిపించారని హసీనా అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment